నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే..? | the whole city was intoxicated for four weeks at a time | Sakshi
Sakshi News home page

నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే..?

Published Sun, May 9 2021 2:28 PM | Last Updated on Sun, May 9 2021 5:39 PM

the whole city was intoxicated for four weeks at a time - Sakshi

ఒకటీ రెండూ రోజులు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు నగరమంతా మత్తులో జోగిందంటే నమ్మగలరా? రష్యాలో జరిగిందిది. 1917లో జార్‌ పాలనకు అంతం పలుకుతూ సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు దిశగా తిరుగుబాటు చెలరేగింది. ఆ ఏడాది అక్టోబర్‌లో బోల్ష్‌విక్‌ ప్రజావిప్లవకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఇది అప్పటి రష్యన్‌ చక్రవర్తుల పరిపాలన కేంద్రమైన పెట్రోగార్డ్‌ (ఇప్పటి సెయింట్స్‌ పీటర్స్‌బర్గ్‌) నగరంలో మొదలయ్యింది. ఈ నగరంలో చక్రవర్తి అధికారిక నివాసం అయిన వింటర్‌ ప్యాలెస్‌ను విప్లవకారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు వారు భావించారు. ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలనుకున్నారు. 

ఈ ప్రయత్నంలో వారికి విశాలమైన వింటర్‌ ప్యాలెస్‌ భవనంలో ప్రపంచంలోనే అతిపెద్ద వైన్‌ సెల్లార్‌ కనపడింది. అందులో సుమారు 100 మిలియన్‌ డాలర్ల విలువైన మందు ఉంది. దీంతో బోల్ష్‌విక్‌ సైనికులు ఉత్సాహంగా ఆ మందు తాగి, చిందులు వేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నగరంలోని పౌరుల చెవిన పడింది. వెంటనే వారూ ఆ భవనానికి చేరుకొని తాగడం మొదలుపెట్టారు. ఇలా ఏకంగా నాలుగు వారాల పాటు తాగుతూ, మత్తులోనే జోగుతూ ఉండిపోయారంతా. చివరికి సెల్లార్‌లోని మందు అయిపోవడంతో వాళ్ల హ్యాంగోవర్‌కు బ్రేక్‌ పడింది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం మత్తులో జోగిన సంఘటన (బిగ్గెస్ట్‌ హ్యాంగోవర్‌)గా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఈ వింటర్‌ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. 

చదవండి:

ఓం న‌మః శివాయ అంటున్న‌ ఇజ్రాయెల్‌ వాసులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement