Soviet Union
-
వృద్ధ జంబూకం ‘నాటో’
రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతినీ, సుస్థిరతనూ, రక్షణనూ వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఏర్పడిన నాటో కూటమి గురువారం తన 75 వసంతాల సంబరాలను జరుపుకొంది. అయితే ప్రకటిత సంకల్పానికీ, దశాబ్దాల దాని ఆచరణకూ ఎక్కడా పొంతన కనబడదు. నాటో నేపథ్యం, దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ యూనియన్ సేనలు తూర్పు యూరప్ దేశాల్లో తిష్ఠవేసి కదల్లేదు. అవి తమవైపు చొచ్చుకు రావొచ్చన్న సందేహం పశ్చిమ యూరప్ దేశాలకుంది. తాము ఒక్కటై ఎదిరించకపోతే దురాక్రమణకు బలి కావటం ఖాయమన్న భయం వాటికి పట్టుకుంది. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చటమే దీని ప్రధాన ధ్యేయం. నాటో దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధ తలో వుంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్సైట్ ఘనంగా చెబుతోంది. మంచిదే. కానీ ఇన్నేళ్ల దాని ఉనికిలో ఒక్కసారైనా సోవియెట్ యూనియన్ నుంచీ లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచీ ప్రత్యక్షంగా కావొచ్చు... పరోక్షంగా కావొచ్చు ఏనాడూ సవాళ్లు ఎదురు కాలేదు. సైనిక కూటమి ఆవిర్భావం దానికదే ప్రత్యర్థిని హద్దు మీరకుండా చేసివుండొచ్చన్న వాదన కూడా కొట్టి పారేయలేం. కానీ నాటో హడావిడి గమనించాక 1955లో సోవియెట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది. ఇరుపక్షాలూ అణ్వాయుధాలనూ, ఇతర భారీ ఆయుధ సామగ్రిని మోహరించటంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికింది. మరి ప్రపంచ శాంతి, సుస్థిరతల జాడెక్కడ? పరస్పర మోహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించటం సాధ్య మేనా? నాటో అంచనాకు తగ్గట్టు సోవియెట్ సేనలు దండయాత్రలు చేయకపోలేదు. 1956లో హంగరీ, 1968లో జెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి. కానీ యూరప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వైపుగానీ... నాటో దేశాలవైపుగానీ చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు. నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియెట్ యూనియన్ వినతిని 1954లో తోసిపుచ్చాకే వార్సా కూటమి ఏర్పడింది. 1989లో సోవియెట్ పతనం, అంతకుముందే తూర్పు యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్నుంచి దూరం జరగటం, వార్సా కూటమి కనుమరుగవటం వంటి పరిణామాల తర్వాత వాస్తవానికి నాటో అవసరం ఎంతమాత్రం లేదు. చిత్రం ఏమంటే... సోవియెట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్, ఆ తర్వాతకాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటా నికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను నాటో తోసిపుచ్చింది. అంతేకాదు... ఉభయ జర్మనీల విలీ నానికి సహకరించాలంటూ పశ్చిమ యూరప్ దేశాల నేతలు గోర్బచెవ్‌ను అర్థించినప్పుడు ఆయన కొక హామీ ఇచ్చారు. నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. సోవియెట్ పతనం నాటికి నాటో సభ్య దేశాలు 16 కాగా, రష్యా అభ్యంతరాలనూ బేఖాతరు చేస్తూ మరో 15 దేశాలను చేర్చుకున్నారు. ఇందులో పూర్వపు వార్సా కూటమి దేశాలున్నాయి. కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా ప్రతి పాదన సైతం బుట్టదాఖలా అయింది. పొరుగునున్న కెనడా, మెక్సికో దేశాలకు వార్సా కూటమి సభ్యత్వం ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నాటో పుట్టుకకు దారితీసిన మూలకారణమే మాయమైనప్పుడు విశాల యూరప్ భద్రత కోసం ఒక నూతన వ్యవస్థ ఏర్పాటు చేయటానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహం వెనకున్న విజ్ఞతేమిటో ఆ కూటమి నేతలు చెప్పగలరా? నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరప్ భద్రతపై దృష్టి సారించివుంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు. యూరప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది. అసలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ 200 సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో 20 వరకూ విస్తృతమైనవి. వెళ్లినచోటల్లా విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు. ఇందుకు లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా వగైరాలను ఉదా హరించవచ్చు. స్థానిక ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా మిలిటెంట్ సంస్థలకు నాటో ఆయుధాలందించటం పర్యవసానంగా ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. కనిపించని శత్రువుపై కత్తి ఝుళిపించటం కోసం నాటో సభ్యదేశాల్లో ప్రతి ఒక్కటీ తమ జీడీపీల్లో 2 శాతం నాటోకు అర్పిస్తున్నాయి. తన ఉనికి కోసం శత్రువును ‘సృష్టించుకునే’ ధోరణి నుంచి నాటో బయటపడనంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించ టమా... నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాల నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి. -
Russia-Ukraine war: రష్యా విక్టరీ డే: మే 9న ఏం జరగబోతోంది?
మే 9.. రష్యా చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అది వారికి విజయోత్సవ దినోత్సవం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీలపై సోవియెట్ యూనియన్ విజయం సాధించిన రోజు. సోవియెట్ యూనియన్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ముందు 1945 సంవత్సరం, మే9న నాజీలు లొంగిపోయిన రోజు. ప్రతీ ఏడాది అదే రోజు విజయోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. రష్యా తన మిలటరీ సత్తా ప్రపంచానికి చాటి చెప్పేలా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద సైనిక పెరేడ్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ తేదీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ తేదీన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక మలుపు తిప్పుతారని, అధికారంగా యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని దశల వారీగా స్వాధీనం చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. యుద్ధం కీలక మలుపు తిరుగుతుందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయోత్సవ వేడుకల్ని గత కొద్ది ఏళ్లుగా కొత్త దేశాలపై యుద్ధ ప్రకటనలు చేయడానికే ఉపయోగిస్తున్నారు. గత ఏడాది మే 9న పుతిన్ చేసిన ప్రసంగంలో రష్యా శత్రువులందరూ తమ దేశాన్ని చుట్టుముట్టేస్తున్నారని, పశ్చిమ సిద్ధాంతాలను తమపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని వాపోయారు. ఈ ఏడాది కూడా విక్టరీ డే నాడు పుతిన్ సంచలన ప్రకటన చేస్తారన్న అంచనాలున్నాయి. మారియుపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటనతో పాటుగా పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అణ్వాయుధాలను ప్రయోగిస్తారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. విజయోత్సవ దిన వేడుకల్ని ఉక్రెయిన్ నగరాల్లో కూడా నిర్వహించడానికి రష్యా సన్నాహాలు చేస్తున్నట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మారియుపోల్ సహా శిథిలావస్థకు చేరుకున్న పలు నగరాలను రష్యా సైన్యం పరిశుభ్రం చేస్తూ ఉండడమే దీనికి తార్కాణమని పేర్కొంటోంది. పశ్చిమ దేశాల ఆందోళనలు ఎందుకు ? ఈ ఏడాది విక్టరీ డే రోజు పుతిన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించి వారందరితో ఆయుధాలు పట్టించే ప్రమాదం ఉందని పశ్చిమాది దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ దండయాత్రపై రష్యన్లలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారిలో దేశభక్తి రేగేలా పుతిన్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారని డ్యూక్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రష్యా వ్యవహారాల్లో నిపుణుడు సైమన్ మిల్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ అని చెబుతూ వస్తున్న పుతిన్ ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించి సాధారణ రష్యన్లని కూడా యుద్ధోన్ముఖుల్ని చేయడమే ఆయన ముందున్న లక్ష్యం’’ అని మిల్స్ అంచనా వేస్తున్నారు. యూదుడైన జెలెన్స్కీని ఉక్రెయిన్ గద్దె దింపి ‘‘నాజీరహితం’’ చేయడమే రష్యా లక్ష్యమన్న సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. మార్షల్ లా అమలు చేస్తారా ? ఈ ఏడాది విక్టరీ డే ప్రసంగంలో పుతిన్ మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తారన్న ఊహాగానాలున్నాయి. ఈ చట్టాన్ని అమలు చేస్తే ఎన్నికల నిర్వహణ రద్దవుతుంది. అధికారాలన్నీ పుతిన్ చేతిలోనే ఉంటాయి. 18 ఏళ్ల వయసు నిండిన యువకులందరూ అవసరమైతే కదనరంగానికి వెళ్లాల్సి వస్తుంది. వారు దేశం విడిచి పెట్టి వెళ్లడానికి వీల్లేదు. అయితే ఇలాంటి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తే రాజకీయంగా పుతిన్‌కు వ్యతిరేకత ఎదురవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. శిథిల ఉక్రెయిన్ ► ఉక్రెయిన్‌పై రష్యా నిర్విరామంగా దాడులు చేస్తూ 75 రోజులు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ఆ చిన్న దేశంలో జరిగే నష్టం అపారంగా ఉంది. కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ చేసిన అధ్యయనం ప్రకారం ఇప్పటివరకు 60 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో జరిగిన ఆర్థిక నష్టం 9,200 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. ► వ్యాపారాలు దెబ్బ తినడంతో వెయ్యి కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ► 195 ఫ్యాక్టరీలు, 230 ఆరోగ్య కేంద్రాలు, 940 విద్యా సంస్థలు, అయిదు రైల్వేస్టేషన్లు, 95 ప్రార్థనాలయాలు, 140 వారసత్వ, సాంస్కృతిక భవంతులు రష్యన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి ► 23,800 కిలోమీటర్ల రహదారులు నాశనమయ్యాయి. వీటి విలువే 6 వేల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా ► నెలకి 700 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం లభిస్తే తప్ప ఉక్రెయిన్ కోలుకునే పరిస్థితి లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో ఆధిపత్య పోరు
భూమిపై దేశాల మధ్య రాజకీయాలు నింగికి పాకుతున్నాయి. పలు అంశాల్లో అమెరికాకు సవాలు విసురుతున్న చైనా తాజాగా అంతరిక్షంలో ఆధిపత్య పోరుకు తెర తీసింది. దీంతో ఒకప్పుడు సోవియట్ యూనియన్– అమెరికా మధ్య ఉన్న పోటీ మరోమారు చైనా– యూఎస్ రూపంలో అంతరిక్షంలో కనిపించనుంది. అగ్రరాజ్య హోదా కోసం తహతహలాడుతున్న చైనా తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు అన్ని రంగాల్లో విపరీతంగా శ్రమిస్తోంది. ప్రపంచ పెద్దన్న అమెరికా ప్రాబల్యమున్న వివిధ అంశాల్లో కాలు మోపి ఉనికి చాటుకోవాలని యత్నిస్తోంది. తాజాగా అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. యూఎస్ఎస్ఆర్ (సోవియట్ రిపబ్లిక్) కుప్పకూలక ముందువరకు అమెరికాతో ఇదే తరహా పోటీ చూపేది. అయితే సోవియట్ పతనానంతరం ప్రపంచం ఏక ధ్రువ ప్రపంచంగా మారిపోయింది. సోవియట్ వదిలి వెళ్లిన ఖాళీని పూడ్చేందుకు చైనా రంగంపైకి వచ్చింది. ఈ క్రమంలో 2021లో అంతరిక్ష ప్రయోగాల పరంగా చైనా అదరగొట్టింది. గత ఏడాది చైనా మొత్తం 55 అంతరిక్ష ప్రాజెక్టులు చేపట్టగా అమెరికా 51తో సరిపుచ్చుకుంది. 2030 నాటికి కుజుడు (మార్స్)పైకి ఉపగ్రహాన్ని పంపి శాంపిళ్లను తీసుకువస్తామని తాజాగా చైనా లూనార్ ప్రోగ్రామ్ డిజైనర్ వూ వైరెన్ ప్రకటించారు. అంతటితో తమ యత్నాలు ఆగవని, సౌర వ్యవస్థలో ఇప్పటివరకు వెళ్లని దూరాలను అన్వేషిస్తామని చెప్పారు. ఇప్పటికే చైనా చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపి అక్కడి నుంచి శాంపిళ్లను విజయవంతంగా తీసుకువచ్చింది. ఇదే తరహాలో మార్స్ మిషన్ పూర్తి చేస్తామని వూ చెప్పారు. చంద్ర మిషన్‌తో పోలిస్తే మార్స్ మిషన్ క్లిష్టమైనదని, ముందుగా శక్తివంతమైన లాంచ్ వాహనాన్ని రూపొందించాల్సి ఉందని చెప్పారు. మేమే ముందు.. మార్స్‌పైకి మనిషిని పంపే ప్రణాళికకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను గత ఏడాది చైనా విడుదల చేసింది. 2033– 2043 కాలంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంకల్పించినట్లు ప్రకటించింది. 2020లోనే చైనా గ్రహాంతరయానానికి తొలిమెట్టు అయిన టియాన్వెన్ –1 ప్రోబ్‌ను ప్రయోగించింది. ఈ ప్రోబ్ 2021లో మార్స్ కక్ష్యలోకి ప్రవేశించింది. మే నెలలో ఈ ప్రోబ్ నుంచి జురాంగ్ అనే రోవర్‌ను కుజుడి ఉపరితలంపైకి దించారు. ఈ రోవర్ నిర్ధేశిత పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రష్యా, అమెరికా తర్వాత మార్స్‌పైకి రోవర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేసిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఈ ధైర్యంతో రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో కుజుడి ఉపరితలం నుంచి శాంపిళ్లను తెచ్చేందుకు చైనా యత్నిస్తోంది. 2020లో అమెరికా తన సొంత మార్స్ మిషన్‌ను చేపట్టింది. 2021లోనే మార్స్ పైకి అమెరికా రోవర్ దిగింది. ఇప్పటివరకు ఈ రోవర్ ఏడు శాంపిళ్లను సేకరించింది. యూరోపియన్ యూనియన్ స్పేస్ కమిషన్‌తో కలిసి ఈ శాంపిళ్లను 2031 నాటికి భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చైనా 2030లో శాంపిళ్లను తెస్తామని ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా కన్నా ముందుగా కుజుడి శాంపిళ్లను తీసుకురావడం ద్వారా అంతరిక్ష ఆధిపత్య పోరులో ముందంజలో ఉండాలన్నది చైనా భావన. అంతరిక్ష దౌత్యం ప్రస్తుతం భూమిపైన ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తోంది. దీన్ని అంతరిక్షంలోకి తీసుకుపోవాలని చైనా భావిస్తోంది. రాబోయే రోజుల్లో అంతరిక్షంపై ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాకు భిన్నంగా అంతరిక్ష దౌత్య మార్గం ద్వారా ఆధిపత్యం సాధించాలని చైనా యోచిస్తోంది. ఇందులో భాగంగా తన స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఇతర దేశాలకు అవకాశాలు ఇస్తోంది. చైనా నిర్మించే స్పేస్ స్టేషన్ పూర్తయితే ఇతర దేశాల వ్యోమగాములకు అవకాశాలు కల్పించడం ద్వారా పటిష్టమైన అంతరిక్ష దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలన్నది చైనా భావనగా ఆ దేశానికి చెందిన చైనా డైలీన్యూస్ వెబ్సైట్ వెల్లడించింది. ఇది చైనాకు మంచి ప్రజాసంబంధాల వారధి (పబ్లిక్ రిలేషన్స్–పీఆర్)గా పనిచేస్తుందని తెలిపింది. అంతరిక్ష దౌత్యంలో భాగంగా చిన్న దేశాలకు కృత్రిమ ఉపగ్రహాలను నిర్మించి ఇవ్వడం, తన దగ్గర ఉన్న ఉపగ్రహ డేటాను ఆయా దేశాలతో పంచుకోవడం వంటి చర్యలను చైనా చేపట్టింది. అయితే ఇలాంటి ఆధిపత్య పోరు కన్నా గతంలో సోవియట్, అమెరికా కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించినట్లు చైనా, అమెరికా సంయుక్తంగా పనిచేయడం ప్రపంచం అంతటికీ మేలు చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాదే పైచేయి 2021లో చైనా అంతరిక్ష ప్రదర్శనల్లో అదరగొట్టింది. కానీ ఇప్పటికీ అంతరిక్షంపై అమెరికా ఆధిపత్యమే నడుస్తోంది. ప్రస్తుతం భూమి చుట్టూ దాదాపు 4,500 కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతుంటే వాటిలో 2,700 ఉపగ్రహాలు అమెరికాకి చెందినవే ఉన్నాయి. అటు చైనా ఉపగ్రహాల సంఖ్య దాదాపు 400 మాత్రమే. అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన రాకెట్లున్నాయి. ఇటీవల కాలంలో చైనా అంతరిక్షంపై పెట్టుబడులను పెంచుతూ వచ్చింది. 2020 నాటికి ఈ రంగానికి చైనా సుమారు 890 కోట్ల డాలర్ల నిధులు కేటాయించింది. కానీ అదే సమయంలో అమెరికా అంతరిక్ష ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు ఏకంగా 4,800 కోట్ల డాలర్లు కావడం విశేషం. అమెరికాలో స్పేస్ ఎక్స్‌లాంటి పలు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షరంగ సంస్థలు ప్రభుత్వానికి దీటుగా అంతరిక్ష ప్రాజెక్టులు చేపడుతున్నాయి. చైనాలో అంతటిస్థాయి ప్రైవేటు అంతరిక్ష కంపెనీలు ఏర్పడలేదు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: నేడు భారతీయులకు అండగా పోలండ్.. మరి ఆనాడు..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలమంది భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులకు పరుగెడుతున్నారు.. అలా వస్తున్న మనవారికి పోలండ్ సహకరిస్తోంది.. విమానాల ద్వారా భారత్‌కు వెళ్లేందుకు తోడ్పడుతోంది. ఇది ఈనాటి దృశ్యం.... కానీ ఒకప్పుడు దీనికి రివర్స్‌గా జరిగింది తెలుసా? పోలండ్ నుంచి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే.. ఇక్కడ ఒక ‘గుడ్ మహారాజా’ వాళ్లను ఆదరించారు. ఆ విశేషాలు ఇవి.. – సాక్షి సెంట్రల్‌డెస్క్ అప్పుడేం జరిగిందంటే.. ..దాదాపు 80 ఏళ్ల క్రితం.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ చేతిలో పోలాండ్ అతలాకుతలం అవుతున్న సమయం. యుద్ధ సంక్షుభిత పోలండ్ నుంచి, సోవియట్ అధీనంలోని జైళ్ల నుంచి.. పోలండ్ చిన్నారులను శరణార్థులుగా వదిలివేశారు. 1942లో సోవియట్ సైన్యం.. రెండేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికిపైగా పిల్లలను ఓ నౌకలో ఎక్కించి పంపించేసింది. ఆ షిప్‌ను ఏ నౌకాశ్రయంలో ఆపినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఆశ్రయం ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఆ నౌక ప్రస్తుత గుజరాత్ తీరంలోని నవానగర్‌కు చేరింది. నవానగర్ రాజు ‘జామ్‌సాహెబ్ దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా’ ఎంతో పెద్ద మనసుతో వారిని అక్కున చేర్చుకున్నారు. ది గుడ్ మహారాజా స్క్వేర్ మీరందరూ నా పిల్లలే.. పోలండ్ నుంచి వచ్చిన చిన్నారుల్లో దాదాపు అందరూ అనాథలుగా మిగిలినవారే. దీనిపై చలించిపోయిన నవానగర్ మహారాజు ఆ పిల్లలెవరినీ అనాథలుగా చూడొద్దని, వారంతా నవానగర్ పౌరులని, రాజ్యాధినేతగా తాను వారికి తండ్రిలాంటి వాడినని ప్రకటించారు. ఆ పిల్లల కోసం ప్రత్యేక క్యాంపులు, పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వైద్యం అవసరమైన వారికి చికిత్స చేయించారు. అలా నాలుగేళ్లపాటు వారి ఆలనాపాలనా చూసుకున్నారు. వారు కూడా నవానగర్ మహారాజును ‘బాపూ (తండ్రి)’గా పిలుచుకునేవారు. పోలండ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత 1946 నుంచి దశలవారీగా వారు తిరిగి తమ స్వదేశానికి చేరుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. మన దేశం నుంచి బ్రిటీష్‌వారు వెళ్లిపోవాలంటూ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయమది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న ఆ సమయంలో ఐరోపా దేశాల పిల్లలను ఆదుకునేందుకు నవానగర్ మహారాజు చూపిన చొరవ ప్రశంసలు పొందింది. ఇంత ఘనత పొందిన నవానగర్ మహారాజు 1966లో కన్నుమూశారు. పోలండ్‌లో.. మన మంచి మహారాజు నవానగర్ మహారాజు చూపిన ఔదార్యానికి పోలండ్ మర్చిపోలేదు. పోలిష్ రిపబ్లిక్‌గా ఏర్పాౖ టెన తర్వాత ఆ దేశ అత్యున్నత అవార్డు అయిన ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్’తో ఆయన్ను గౌరవించింది. వార్సా నగరంలోని హైస్కూల్‌కు ‘మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ, రంజిత్‌సింగ్‌జీ జడేజా’ పేరు పెట్టింది. అంతేకాదు.. 2013లో వార్సాలోని ఓ జంక్షన్‌కు ‘ది గుడ్ మహారాజా స్క్వేర్’ అని నామకరణం చేసింది. -
ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?
Russia-Ukraine: 1991లో సోవియెట్ యూనియన్ పతనమైన తర్వాత ఆ దేశానికి సంబంధించిన అణ్వాయుధాలన్నీ బెలారస్, కజకస్తాన్, ఉక్రెయిన్‌లో ఉండేవి. అందులోనూ ఉక్రెయిన్ అతి పెద్ద అణు భాండాగారంగా నిలిచింది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్న మూడో దేశంగా అవతరించింది. సైనిక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన 3 వేలకు పైగా టాక్టికల్ అణ్వాయుధాలు, యుద్ధ నౌకలు, సాయుధ వాహనాలు, నగరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసే అణ్వాయుధాలు ఉక్రెయిన్ దగ్గరే ఉండేవి. వీటిలో ఎస్ఎస్–19, ఎస్ఎస్–24 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు 176 వరకు ఉంటే, మరో వెయ్యి వరకు గగన తలం మీదుగా దాడి చేసే క్షిపణి వ్యవస్థలన్నీ ఉక్రెయిన్ దగ్గరే ఉన్నాయి. చదవండి: (Vladimir Putin: అదే పుతిన్ బలమా..?) 60 వరకు టీయూ–22 బాంబర్లు కూడా ఉండేవి. ఆ తర్వాత కాలంలో అతి పెద్ద ఆయుధాగారాన్ని నిర్వహించే ఆర్థిక శక్తి లేక ఉక్రెయిన్ అల్లాడిపోయింది. అంతే కాకుండా ఆ అణ్వాయుధాలను వాడడానికి అవసరమైన కేంద్రీకృత ఫైరింగ్ కంట్రోల్స్ అన్నీ రష్యా రాజధాని మాస్కోలో ఉన్నాయి. దీంతో అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఒక తలనొప్పిగా మారాయి. చర్చోపచర్చల తర్వాత ఆ ఆయుధాలను నాశనం చేయడానికి వీలుగా 1994లో రష్యా, యూకే, అమెరికాలతో ఉక్రెయిన్ బుడాపెస్ట్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చదవండి: (ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం) ఆయుధాలను విధ్వంసం చేసినప్పటికీ ఆ దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని గుర్తిస్తామని అమెరికా, యూకే, రష్యాలు హామీ ఇచ్చాయి. దీంతో ఎన్నో వార్హెడ్లు, ఇతర క్షిపణుల్ని ధ్వంసం చేసింది. టీయూ–160 బాంబర్లు, ఇతర అణుసామాగ్రిని రష్యాతో వస్తుమార్పిడి విధానం కుదుర్చుకొని ఆ దేశానికి బదలాయించింది. బదులుగా రష్యా చమురు, గ్యాస్‌లను సరఫరా చేసింది. 2001 మేలో చివరి యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ 11టీయూ–160 వ్యూహాత్మక బాంబులు, 27 వ్యూహాత్మక టీయూ–95 బాంబులు, 483 కేహెచ్–55 గగన తలం మీదుగా ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల్ని ధ్వంసం చేసిందని, మరో 11 భారీ బాంబులు 582 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల్ని రష్యాకు అప్పగించిందని వెల్లడించింది. -
30 ఏళ్ల వివాదం: ఉప్పునిప్పుగా ఉక్రెయిన్–రష్యా బంధం
నేషనల్ డెస్క్, సాక్షి: ఉక్రెయిన్‌తో రష్యా వివాదం ఇప్పటిది కాదు. ఉక్రెయిన్ వందలాది ఏళ్లుగా రష్యన్ సామ్రాజ్యంలో భాగమే. తర్వాత కూడా అవిభక్త సోవియట్ యూనియన్‌లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. 30 ఏళ్ల క్రితం, అంటే 1991లో ప్రచ్ఛనయుద్ధానంతరం సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్ స్వతంత్ర దేశమైంది. నాటి నుంచీ రష్యాతో విభేదాలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యూరప్ దేశాల వైపు మొగ్గుతుండటం రష్యాను కలవరపెడుతూ వచ్చింది. యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోరడంతో పాటు తనను నాటోలో చేర్చుకోవాలని కూడా ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామం రష్యాను మరింత కలవరపెట్టింది. నాటో కూటమి ఉక్రెయిన్‌లో తిష్ట వేస్తే తన భద్రతకు పెను ముప్పన్నది రష్యా ఆందోళన. పైగా నాటోలో చేరితే అమెరికా సహా సభ్య దేశాల సైనిక దన్నుతో ఉక్రెయిన్ బలోపేతమవుతుంది. ఈ పరిణామం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవరపెట్టింది. 2000లో రష్యా పగ్గాలు చేపట్టిన నాటినుంచే ఉక్రెయిన్‌పై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నాటో సభ్యత్వం ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చదవండి: (రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ దేశాల జోలికొస్తే ఖబడ్దార్) వివాదాల్ని ఎగదోసి... ఉక్రెయిన్‌లో తమ కీలుబొమ్మ సర్కార్లను ఏర్పరచడం ద్వారా ఆ దేశ వ్యవహారాలను నియంత్రించేందుకు పుతిన్ ప్రయత్నించారు. పుతిన్ దన్నుతో ఉక్రెయిన్ అధ్యక్షుడైన విక్టర్ యాంకోవిచ్ రష్యా అనుకూల వ్యవహారాలతో వివాదాస్పదునిగా నిలిచారు. 2014లో యూరోపియన్ యూనియన్‌లో చేరేందుకు నిరాకరించారు. దీనిపై జనాగ్రహం పెల్లుబికి ఆందోళనలు చెలరేగడంతో పదవి నుంచి దిగిపోయారు. ఈ కల్లోల సమయంలో రష్యా హఠాత్తుగా దాడికి దిగి దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యన్ల మెజారిటీ ప్రాంతమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి తనలో కలిపేసుకుంది. అంతటితో ఆగకుండా తూర్పు ఉక్రెయిన్‌లో డొనెట్స్క్, లుహాన్స్క్ల సమాహారమైన డోన్బాస్ ప్రాంతంలో వేర్పాటువాద ఆందోళనలకు అన్నివిధాలా మద్దతిస్తూ వచ్చింది. అక్కడ చెలరేగిన హింసాకాండకు 14 వేల మందికి పైగా బలయ్యారు. చదవండి: (Russia-Ukraine War: నా పదవీకాలంలో అత్యంత విషాద క్షణాలు!) మిన్స్క్ ఒప్పందం ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యూరప్ దేశాలు రంగంలోకి దిగాయి. ఫలితంగా 2015లో బెలారస్ రాజధాని మిన్స్క్లో జర్మనీ, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం వేర్పాటువాదులు ఆక్రమించుకున్న డొనెట్స్క్, లుహాన్స్క్ వ్యవహారాల్లో ఉక్రెయిన్ వేలు పెట్టరాదు. యథాతథ స్థితి కొనసాగింపునకు రష్యా అంగీకరించాలి. కానీ ఒప్పందాన్ని గౌరవించడం లేదంటూ రెండు దేశాలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌కు మూడువైపులా భారీ సైనిక మోహరింపులకు పుతిన్ తెర తీసి పశ్చిమ దేశాలకు కంటిపై కునుకు లేకుండా చేశారు. యుద్ధం ఆలోచన లేదంటూనే మోహరింపులను రెండు లక్షల దాకా పెంచారు. బెలారస్లో వేలాది సైనికులతో అణు విన్యాసాలు చేస్తూ వచ్చారు. తాజాగా డోన్బాస్కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించడమే గాక, ఉక్రెయిన్‌కు చరిత్రలో ఎన్నడూ ప్రత్యేక అస్తిత్వం లేదంటూ తన ఉద్దేశాలను చెప్పకనే చెప్పారు. వెనువెంటనే దానిపైకి యుద్ధానికి దిగి యూరప్‌లో పెను సంక్షోభానికి తెర తీశారు. ఇలా మొదలైంది.. 2021 మార్చి ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా సైన్యాల మోహరింపు ఆరంభం 2021 డిసెంబర్ సరిహద్దుల వద్ద దాదాపుగా లక్ష దాకా మోహరించిన రష్యా సైన్యాలు 2022 జనవరి ►ఉద్రిక్తతలను చల్లార్చేందుకు రష్యా, నాటో మధ్య చర్చలు. ►సేనలను అప్రమత్తం చేసిన నాటో 2022 ఫిబ్రవరి ►తూర్పు ఉక్రెయిన్‌లోని 2 రెబెల్ ప్రాబల్య ప్రాంతాల్లోకి రష్యా సైన్యం ►రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలు ►ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి రష్యా శ్రీకారం -
రష్యా- ఉక్రెయిన్ల మధ్య మొదలైన వార్.. అసలు ఈ యుద్ధం ఎందుకు?
Russia-Ukraine Crisis Reason: రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినప్పటికీ యుద్ధం వరకు అడుగులు పడవని అందరూ అనుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదంటూ ఏకంగా ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలు ఇందులో జోక్యం అనవసరమంటూ గట్టి సంకేతాలే పంపారు. మొన్నటి వరకు చర్చలకు సిద్ధమన్న రష్యా అకస్మాత్తుగా మిలిటరీ ఆపరేషన్‌కి చేపట్టింది. అసలు ఈ పరిణామాలకు కారణాలేమంటే! యుద్ధం ఎందుకు? ఉక్రెయిన్ను, మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ప్రధాన డిమాండ్. అయితే ఈ డిమాండ్‌ని అగ్రరాజ్యం అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. గతంలో ఉక్రెయిన్ రష్యా నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుని పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చడం వల్ల రష్యా భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని పుతిన్ వాదన. (చదవండి: Russia Ukraine War Updates: ఇక మాటల్లేవ్.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా ) అందుకే ఉక్రెయిన్ను నాటో చేర్చేందుకు తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే యూరప్‌లో, మా సరిహద్దుల సమీపంలో మోహరించిన నాటో సైన్యాన్ని, మధ్య శ్రేణి క్షిపణులను తగ్గించడం, సైనిక మోహరింపుల్లో, కవాతుల్లో పారదర్శకత పాటించడంతో సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు పుతిన్ సిద్ధమని చెప్పారు. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా మరో వైపు ఉక్రెయిన్ మాత్రం నాటోలో చేరేందుకు రెడీగా ఉంది. చివరకి రష్యా కోరుకున్న విధంగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడకపోయే సరికి గురవారం పుతిన్ ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు. -
నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే..?
ఒకటీ రెండూ రోజులు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు నగరమంతా మత్తులో జోగిందంటే నమ్మగలరా? రష్యాలో జరిగిందిది. 1917లో జార్ పాలనకు అంతం పలుకుతూ సోవియట్ యూనియన్ ఏర్పాటు దిశగా తిరుగుబాటు చెలరేగింది. ఆ ఏడాది అక్టోబర్‌లో బోల్ష్విక్ ప్రజావిప్లవకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఇది అప్పటి రష్యన్ చక్రవర్తుల పరిపాలన కేంద్రమైన పెట్రోగార్డ్ (ఇప్పటి సెయింట్స్ పీటర్స్బర్గ్) నగరంలో మొదలయ్యింది. ఈ నగరంలో చక్రవర్తి అధికారిక నివాసం అయిన వింటర్ ప్యాలెస్‌ను విప్లవకారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సోవియట్ యూనియన్ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు వారు భావించారు. ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి విశాలమైన వింటర్ ప్యాలెస్ భవనంలో ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ సెల్లార్ కనపడింది. అందులో సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన మందు ఉంది. దీంతో బోల్ష్విక్ సైనికులు ఉత్సాహంగా ఆ మందు తాగి, చిందులు వేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నగరంలోని పౌరుల చెవిన పడింది. వెంటనే వారూ ఆ భవనానికి చేరుకొని తాగడం మొదలుపెట్టారు. ఇలా ఏకంగా నాలుగు వారాల పాటు తాగుతూ, మత్తులోనే జోగుతూ ఉండిపోయారంతా. చివరికి సెల్లార్‌లోని మందు అయిపోవడంతో వాళ్ల హ్యాంగోవర్‌కు బ్రేక్ పడింది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం మత్తులో జోగిన సంఘటన (బిగ్గెస్ట్ హ్యాంగోవర్)గా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఈ వింటర్ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. చదవండి: ఓం నమః శివాయ అంటున్న ఇజ్రాయెల్ వాసులు -
గడియారం ముల్లు వెనక్కి తిరిగింది!
ఒలింపిక్స్ అంటే... విజేతలు, పతకాలే కాదు పౌరుషాలు ప్రతాపాలు కూడా కనిపిస్తాయి! పసిడి కాంతులే కాదు...పంతాలు ఉంటాయి. రికార్డు టైమింగ్లే కాదు చరిత్రకెక్కిన వివాదాలూ చోటు చేసుకుంటాయి. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో రెండు అగ్రరాజ్యాల (అమెరికా, సోవియట్ యూనియన్) మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ ఫైనల్ ‘యుద్ధం’ ఓ అసాధారణ వివాదంగా మిగిలిపోయింది. అంతర్జాతీయ క్రీడల చరిత్రలోని వివాదాస్పద ఘట్టాలను పేర్కొంటే తొలి స్థానం ఈ ఫైనల్ మ్యాచ్‌కే దక్కుతుంది. పోయిన సమయం తిరిగి రాదంటారు. కానీ మ్యూనిక్ ఒలింపిక్స్‌లో సోవియట్ యూనియన్ బాస్కెట్‌బాల్ జట్టు విషయంలో అలా జరగలేదు. వడ్డించే వాళ్లు మనోళ్లయితే అన్నట్లుగా... అన్నీ కలిసిరావడంతో చివరి క్షణాల్లో సోవియట్ యూనియన్ జట్టు ఆటగాళ్లకు అనుకూల ఫలితం వచ్చింది. వారి ఖాతాలో స్వర్ణ పతకాలు చేరాయి. తమను కావాలనే ఓడించారని గట్టిగా నమ్మిన అమెరికా జట్టు ఆటగాళ్లు రజత పతకాలు స్వీకరించకుండానే వెళ్లిపోయారు. బాస్కెట్‌బాల్ అంటేనే ముందుగా గుర్తొచ్చే పేరు అమెరికానే. ఇప్పుడే కాదు... ఎప్పటి నుంచో ఈ క్రీడను శాసిస్తోంది ఆ దేశమే. పైగా అప్పట్లో ప్రత్యేకించి ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా బాస్కెట్‌బాల్ జట్టుకు ఎదురేలేదు. మూడు దశాబ్దాలకు పైగా ఓటమి అంటేనే తెలియదు. 1936 నుంచి 1972 ఫైనల్ ముందు వరకు 63 మ్యాచ్‌లాడినా... అన్నింటా గెలిచిన చరిత్ర అమెరికాది. అలాంటి జట్టు మ్యూనిక్‌లోనూ ఎప్పటిలాగే అజేయంగా ఫైనల్ చేరింది. సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా)తో హోరాహోరీగా తలపడింది. కానీ ఈ పోరులో అమెరికా వెనుకబడింది. మ్యాచ్ ముగిసేదశకు చేరగా అమెరికా 48–49 స్కోరుతో ఓటమికి చేరువైంది. అయితే చివరి క్షణాల్లో సోవియట్ ఆటగాడు తప్పిదం చేయడంతో అమెరికాకు రెండు ఫ్రీ త్రోలు లభించాయి. కొలిన్స్ వాటిని పాయింట్లుగా మలిచాడు. అమెరికా 50–49తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగియడానికి మూడు సెకన్లు ఉన్నాయి. సోవియట్ ఆటగాళ్లు ఆట కొనసాగించగా రెండు సెకన్లు అయిపోయాయి. మరో సెకను మాత్రమే మిగిలిఉన్న దశలో సోవియట్ జట్టు టైమ్ అవుట్ (విరామం) కోరిందని చెబుతూ రిఫరీ ఆటను నిలిపేస్తాడు. టైమ్ అవుట్ తర్వాత సోవియట్ జట్టు ఆట కొనసాగించినా పాయింట్ సాధించడంలో విఫలమవుతుంది. గెలిచామనే సంబరాల్లో అమెరికా ఆటగాళ్లు మునిగిపోతారు. కానీ ఇక్కడే అంతా గందరగోళం చోటు చేసుకుంటుంది. అదనంగా మరో మూడు సెకన్ల ఆట జరుగుతుంది. విజేత తారుమారై అమెరికా పరాజిత అవుతుంది. తమకు అన్యాయం జరిగిందని అమెరికా ఆటగాళ్లు ఏకంగా బహుమతి ప్రదానోత్సవాన్నే బహిష్కరిస్తారు. ఆ మూడు సెకన్లలో... అమెరికా ఫ్రీ త్రోలు పూర్తయ్యాక సోవియట్ ఆటగాళ్లు ఆటను కొనసాగించిన సమయంలో మ్యాచ్ సమయాన్ని పర్యవేక్షించే అధికారి గడియారంలో మిగిలి ఉన్న సమయాన్ని సెట్ చేసుకోలేదని... అందుకే జరిగిన రెండు సెకన్ల ఆటను లెక్కలోకి తీసుకోకుండా సోవియట్ జట్టుకు ఒక సెకను బదులుగా మళ్లీ మూడు సెకన్లు ఇవ్వాల్సిందేనని మైదానంలోకి దూసుకొచ్చిన అప్పటి అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఫిబా) సెక్రటరీ జనరల్ విలియమ్ జోన్స్ రిఫరీలను ఆదేశిస్తాడు. దాంతో రిఫరీ సోవియట్ జట్టుకు మూడు సెకన్ల సమయం ఇస్తాడు. ఆ మూడు సెకన్లలో ఏం ఒరుగుతుందిలే అనుకునేలోపే ఊహించని పరిణామం జరుగుతుంది. సోవియట్ ఆటగాడు ఇవాన్ ఈడెష్కో తమ కోర్టు వైపు నుంచి ఒంటిచేత్తో బంతిని దాదాపు 28 మీటర్ల దూరం విసురుతాడు. అమెరికా బాస్కెట్ వద్ద కాచుకున్న 20 ఏళ్ల అలెగ్జాండర్ బెలోవ్ ఆ బంతిని నేరుగా అందుకొని ఎంతో నేర్పుగా బాస్కెట్లోకి వేసేస్తాడు. ఇలా వెనక్కి తిప్పిన సమయంతోనే అనూహ్యంగా 2 పాయింట్లు సాధించిన సోవియట్ జట్టు 51–50తో అమెరికాను ఓడిస్తుంది. ఈ ఫలితంతో ఖిన్నులైన అమెరికా జట్టు తుది ఫలితంపై అప్పీల్ చేస్తుంది. తర్జనభర్జనల తర్వాత అర్ధరాత్రి దాటాక ఐదు దేశాల సభ్యులతో కూడిన జ్యూరీ 3–2తో సోవియట్ యూనియన్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుంది. క్యూబా, హంగేరి, పోలాండ్ సభ్యులు సోవియట్ యూనియన్‌కు.. ఇటలీ, ప్యూర్టోరికో సభ్యులు అమెరికాకు ఓటు వేస్తారు. జ్యూరీ కూడా తమకు అన్యాయం చేసిందని భావించిన అమెరికా ఆటగాళ్లు రజత పతకాలు ముట్టమనే పంతానికి దిగుతారు. ఇప్పటికీ ఈ రజత పతకాలు స్విట్జర్లాండ్‌లోని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మ్యూజియంలో అలాగే ఉన్నాయి. వీలునామాలో రాసి... బంగారం చేజారి... వచ్చిన రజతాన్ని కాదన్న అమెరికన్లు ఆ నిరసనను ఏళ్లతరబడి అలాగే కొనసాగిస్తున్నారు. పరిస్థితులు సద్దుమణిగాక అయినా తీసుకుంటారనుకున్న నిర్వాహకులకు నిరాశే ఎదురైంది. రజతాలు స్వీకరించే ముచ్చటేలేదని కరాఖండిగా చెప్పేశారు. మ్యూనిక్ నుంచి స్వదేశానికి వచ్చేశాక కూడా అమెరికన్ల మనసు మారలేదుకదా... పంతం ఇంకాస్తా పెరిగింది. మరో దశకు చేరింది. ఎంతగా అంటే ఫైనల్ ఆడిన అమెరికా ఆటగాడు డేవిస్ తన వారసులు, వారి తర్వాత తరాల వారసులు కూడా ఈ పతకాలు స్వీకరించరాదని ఏకంగా ఓ వీలునామా రాశాడు. అమెరికా వైపు నుంచి ఇలాంటి పరిణామం చోటు చేసుకోగా... సోవియట్ యూనియన్ బాస్కెట్‌బాల్ వర్గాలను విషాదంలో ముంచెత్తే ఘటన జరిగింది. సోవియట్ జట్టును గెలిపించిన చివరి 2 పాయింట్ల షాట్ వేసిన 20 ఏళ్ల అలెగ్జాండర్ బెలోవ్ ఆరేళ్ల తర్వాత 26 ఏళ్లప్రాయంలోనే క్యాన్సర్‌తో చనిపోయాడు. ఖాళీగా రజత పతక పోడియం -
రష్యాతో మరింత సాన్నిహిత్యం
కొత్త చెలిమికి వెదుకులాడటం, పాత చెలిమిని పటిష్టం చేసుకోవడం దౌత్య సంబంధాల్లో నిత్యా వసరం. జమ్మూ–కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో మనకు అది మరింత కీలకం. కనుకనే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకెళ్లి అక్కడి తూర్పు ప్రాంత రాజధాని అయిన వ్లాడివోస్టోక్ నగరంలో జరిగిన తూర్పు ఆర్థిక వేదిక(ఈఈఎఫ్) సదస్సులో పాల్గొన్నారు. ఆ ప్రాంత పర్యటనకెళ్లిన తొలి ప్రధాని మోదీయే. అలాగే కేవలం వెనకబడిన ఆఫ్రికా దేశాలకు సాయం చేయడం కోసం ఉద్దేశించిన రుణ సదుపాయ పథకాన్ని రష్యా వంటి అభివృద్ధి చెందిన దేశానికి వర్తింపజేయడం కూడా కీలక నిర్ణయం. ఆ పథకం కింద అక్కడి తూర్పు ప్రాంతానికి రూ. 7,200 కోట్ల రుణాన్ని ఇవ్వబోతున్నట్టు మోదీ ప్రకటించారు. వ్లాడివోస్టోక్ నగరం ఆ దేశ రాజధాని మాస్కోకు దాదాపు 6,500 కిలోమీటర్ల దూరం. ఆ నగరం అటు ఉత్తర కొరియాకు, ఇటు చైనాకు ఇంతకన్నా బాగా దగ్గర. సోవియెట్ యూనియన్ పతనమై ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడుతున్న దశలో ఇతర దేశాల తరహాలోనే మన దేశం కూడా క్రమేపీ అమెరికాకు దగ్గరైంది. ఆర్థికంగా బాగా దెబ్బతిన్న పూర్వపు సోవియెట్ దేశాలన్నీ కూడదీసుకుని రష్యా నేతృత్వంలో కూటమిగా ఏర్పడ్డాక పాత మిత్రులకు మళ్లీ సన్నిహితం కావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఒకసారంటూ పొరపొచ్చాలు వస్తే సంబంధాలు మళ్లీ యధాస్థితికి చేరడం అంత సులభం కాదు. ఏటా ఇరు దేశాలూ శిఖరాగ్ర సద స్సులు జరుపుకోవాలని 2000 సంవత్సరంలో నిర్ణయించినా, అవి క్రమం తప్పకుండా సాగుతూనే ఉన్నా భారత్–రష్యాలు మునుపటిలా దగ్గర కాలేకపోయాయి. మన రక్షణ పరికరాల కొనుగోళ్లలో సింహభాగం ఇప్పటికీ రష్యాదే అయినా, అనేక కారణాల వల్ల ఇటీవలికాలంలో వేరే దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. రష్యాకు చెందిన ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ(ఏడీఎంఎస్)కొనుగోలుకు నిరుడు మనకు ఒప్పందం కుదిరినా దానికి పలు మార్లు అమెరికా మోకాలడ్డింది. తాము రష్యాపై ఆంక్షలు విధించినందున ఆ దేశంతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందం కుదుర్చుకోరాదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. చివరకు దాన్ని ఒప్పించాకే ఒప్పందం కుదిరింది. గత నెల 16న భద్రతామండలి కశ్మీర్‌పై రహస్య సమావేశాన్ని నిర్వహిం చినప్పుడు ఆ సమస్య భారత్–పాక్‌ల ద్వైపాక్షిక అంశమని చెప్పి రష్యా మనల్నే సమర్థించినా... ఐక్యరాజ్యసమితి తీర్మానాలను కూడా పరిగణనలోకి తీసుకుని రెండు దేశాలూ చర్చించుకుని పరి ష్కారం సాధించాలని సూచించింది. అంతక్రితం కశ్మీర్ విషయంలో రష్యా మనల్ని ఏకపక్షంగా సమర్థించేది. భారత్ వ్యతిరేక తీర్మానాలను వీటో చేసేది. కానీ ఇప్పుడు దాని స్వరంలో మార్పు రావడం పొరపొచ్చాల ఫలితమే. వర్తమాన ప్రపంచంలోని పలు సమస్యల విషయంలో భారత్, రష్యాల వైఖరులు భిన్నంగా ఉంటున్నాయి. అఫ్ఘానిస్తాన్‌లో శాంతి స్థాపన అంశమే ఇందుకు ఉదాహరణ. అక్కడ తాలిబన్లతో చర్చలు జరిపి, దాన్ని ప్రధాన స్రవంతికి తీసుకురావాలన్న పాకిస్తాన్, చైనా వాదనకు రష్యా మద్ద తిస్తోంది. కానీ తిరిగి తాలిబన్లు పుంజుకుంటే ఈ ప్రాంత భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నది మన దేశం వైఖరి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తదితర దేశాలతో భారత్ జత కట్టడం చైనాను అదుపు చేసేందుకేనని, అంతిమంగా అది తన ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తుందని రష్యా భావిస్తోంది. వ్లాడివోస్టోక్ కూడా పసిఫిక్ మహాసముద్ర తీరాన ఉంది. మన ప్రయోజనాలకు అడుగడుగునా గండికొట్టే చైనాకు రష్యా క్రమేపీ దగ్గరవుతున్నదని భారత్ భావన. తమ ఇతరత్రా సంబంధాలు రష్యాకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి కావని చెప్పడం మోదీ పర్యటన ప్రధాన ఉద్దేశం. దానికితోడు ఇరు దేశాల మధ్యా ఇటీవల వాణిజ్య సంబంధాల్లో స్తబ్దత ఏర్పడింది. వీటిని తిరిగి పట్టాలెక్కించడమే మోదీ పర్యటన ఆంతర్యం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ జరిపిన చర్చల్లో ఇరు దేశాల వార్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న 1,100 కోట్ల డాలర్ల స్థాయి నుంచి 2025కల్లా 3,000 కోట్ల డాలర్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఇంధనం, రక్షణ, వైమానిక, నావికా రంగాలకు సంబంధించి 15 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. మన సైన్యం వినియోగించే రక్షణ రంగ పరికరాల్లో అత్యధికం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. వాటికి విడిభాగాల కొరత బాగా ఉంది. తాజా చర్చల పర్యవసానంగా రెండు దేశాల భాగస్వామ్యంతో మన దేశంలోనే విడిభాగాల ఉత్పత్తి మొదలవుతుంది. చెన్నై–వ్లాడివోస్టోక్ల మధ్య సాగర మార్గాన్ని అభివృద్ధి చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మరో మూడేళ్లలో చంద్రుడిపైకి ముగ్గురు వ్యోమగాముల్ని పంపే ‘గగనయాన్’ను మన దేశం చేపట్టబోతున్న నేపథ్యంలో ఆ ముగ్గురికీ తమ దగ్గర శిక్షణ ఇవ్వడానికి పుతిన్ అంగీకరించారు. పుతిన్‌తో కలిసి జరిపిన మీడియా సమావేశంలో కశ్మీర్ తమ ఆంతరంగిక సమస్యని మోదీ స్పష్టం చేశారు. దేన్నయినా వ్యంగ్యభరితం చేసే సామాజిక మాధ్యమాల్లో కష్టకాలంలో ఉన్న మనం రష్యాకు రూ. 7,200 కోట్ల రుణం ఇవ్వడంపై కూడా విమర్శలొచ్చాయి. అయితే ఈ రుణంతో చేపట్టే ప్రాజెక్టుల్లో 75 శాతం సామగ్రిని, సేవలను భారత్ నుంచే దిగుమతి చేసుకోవాలన్న నిబంధన ఉంది. అలాగే ఆ ప్రాజెక్టుల్ని మన సంస్థలు మాత్రమే చేపడతాయి. ఈ రెండు నిబంధనల వల్లా మన ప్రైవేటు, పబ్లిక్ రంగ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయి. కనుక దీనివల్ల అంతిమంగా మన దేశానికి లబ్ధి చేకూరుతుంది. నిలకడలేని అమెరికా వ్యవహార శైలి కారణంగా దానిపైనే సంపూర్ణంగా ఆధారపడటం మన దేశానికి సాధ్యం కాదు. అందువల్లే రష్యాతోనైనా, మరే దేశంతోనైనా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, లోటుపాట్లను చక్కదిద్దుకోవడం అత్యవసరం. -
'సోవియట్ యూనియన్‌కు పట్టిన గతే పాక్‌కు'
వాషింగ్టన్: గతంలో సోవియట్ యూనియన్‌కు పట్టిన గతే పాకిస్తాన్‌కు పడుతుందని ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ పేర్కొన్నారు. ఆయుధాల కోసం పోరు కొనసాగిస్తే గతంలో సోవియట్ యూనియన్ కొన్ని రాజ్యాలుగా విడిపోయినట్లు పాక్ పరిస్థితి గందరగోళంగా తయారవుతుందని హెచ్చరించారు. అమెరికాలోని ఫ్లొరిడా వర్సిటీ విద్యార్థులతో సమావేశం సందర్భంగా పాక్ తీరుపై తీవ్ర అసహనాన్ని వెల్లగక్కారు హక్కానీ. గతంలో అమెరికాలో పాక్ దౌత్యవేత్తగా విధులు నిర్వహించిన హక్కానీ.. ప్రస్తుతం పాకిస్తాన్‌కు ఆర్థిక శక్తి కావాలన్నారు. కానీ పాక్ అణ్వాయుధాలు, అణ్వస్త్ర సామాగ్రి.. ఉగ్రవాదం అంశాలపై దృష్టిపెట్టిందన్నారు. అణ్వస్త్ర సామర్థ్యంతో అగ్రరాజ్యాల సరసన తమ పేరు చేరుతుందని, వారితో సమానంగా తమకు గౌరవం, హోదా లభిస్తుందని పాక్ ఆలోచిస్తుందని తెలిపారు. 12-14 శతాబ్దాల్లో పరిపాలన కొనసాగినట్లు పాక్‌లో వ్యవహారం నడుస్తోందని, ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఆర్థికంగా శక్తిమంతమైన దేశంగా ఎదగడంతో పాటు ఆర్మీపై ఖర్చుచేసే నిధులను సామాన్య ప్రజలకు వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు హక్కానీ. ఆయన ప్రస్తుతం హడ్సన్ ఇనిస్టిస్ట్యూట్లో దక్షిణ, మధ్య ఆసియాలకు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
సోవియట్‌లా.. చైనా కూలిపోనుందా?!
కమ్యూనిస్ట్ దేశం చైనాలో అవినీతి భూతం విశృంఖలంగా ఉందా? దేశాన్ని పతనం చేసే స్థాయికి అవినీతి పెరిగిందా? సోవియట్ యూనియన్‌లా చైనా ఏదో ఒకరోజు కుప్పకూలిపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనా ఉన్నతాధికారులే దీనిని బలపర్చడం విశేషం. చైనా.. కమ్యూనిస్ట్ ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి. సోవియట్ యూనియన్ తరువాత అంతటి స్థాయికి ఎదిగిన దేశం. అవినీతి భూతం చైనా అర్థిక పునాదులను కూలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చైనా బయటి దేశాలతో చేసే యుద్ధం కన్నా.. దేశంలోని పెరిగిన అవినీతితో యుద్ధం చేయాలని.. లేకపోతే అత్యంత వేగంగా సోవియట్ యూనియన్ తరహాలో చైనా విచ్ఛిన్నం అవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 25 పొలిట్ బ్యూరోలో కీలక నేతగా ఎదిగిన యాంగ్ క్సియాడు అవినీతిపై స్పష్టమైన ప్రకటన చేశారు. భారీగా అవినీతి చైనాలో గత ప్రభుత్వాలు దేశంలో అవినీతిని ప్రోత్సహించాయి. అవినీతి పరులు పార్టీని శాసించే స్థాయికి నేడు చేరుకున్నారు.. ఇది దేశానికి చాలా ప్రమాదకరమని యాంగ్ చెప్పారు. అవినీతి పరులు బలపేతం కావడంతో పార్టీ బలహీన పడే స్థాయికి చేరిందని కూడా ఆయన స్పష్టం చేశారు. విచ్చిన్నం దిశగా దేశం దేశంలో విశృంఖలంగా పెరిగిన అవినీతిని కట్టడి చేయాలని ఆయన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరారు. అవినీతిని కట్టడి చేయలేకపోతే.. చైనా మరో సోవియట్ యూనియన్ అవుతుందని యాంగ్ హెచ్చరించారు. పట్టుకోల్పోతున్న జిన్‌పింగ్ అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే పార్టీలో పట్టు కోల్పోతున్నారని.. యాంగ్ ప్రకటించారు. పార్టీపై కీలక నేతలు పట్టుకోల్పోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాంగ్ పేర్కొన్నారు. ప్రమాద ఘంటికలే! జిన్‌పింగ్ కుడిభుజం, అధికార పార్టీలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ అయిన వాంగ్ క్వుషాన్, తాజాగా యాంటి కరప్షన్ చీఫ్ జాహో లెజీ కూడా చైనా ప్రమాదర స్థితిలో ఉందని చెబుతున్నారు. భారీగా పెరిగిన అవినీతి వల్ల చైనా ఎప్పుడైనా కూలిపోవచ్చనే సందేహాలు వ్యక్తం చేశారు. -
చిత్రహింసల వల్లే నేతాజీ మరణం!
కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్ యూనియన్ లో బ్రిటిష్ అధికారుల ఇంటరాగేషన్ లో చిత్రహింసల వల్ల మృతి చెందారని తాజా వాదన తెరపైకి వచ్చింది. రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షీ రాసిన ‘బోస్– ది ఇండియన్ సమురాయ్’ పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుంచి తప్పించుకుని సైబీరియాకు వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని , నేతాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు.. ఆయనను విచారణ కు అనుమతించాలంటూ సోవియట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. -
కాలాన్ని శాసించిన క్యాస్ట్రో
కొత్త కోణం ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్పటికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొందించుకున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బతినకుండా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే స్థానాన్ని సాధించుకున్న కమ్యూనిస్టు వీరుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో. ఆయన జీవితం, పోరాటం, విజయాలు భవిష్యత్ తరాలను ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. అమెరికా తొత్తుగా వ్యవహరిస్తున్న బటిస్టా నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి, విప్లవపతాకను ఎగురవేసినప్పటి నుంచి ప్రధా నమంత్రిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా క్యాస్ట్రో సాగించిన పాలన అమె రికాను ఎదిరించడానికే పరి మితం కాలేదు. అమెరికాకు వ్యతిరేకంగా క్యాస్ట్రో సాగించిన పోరాటం, సాధించిన విప్లవ విజయం క్యూబా ప్రజల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై చెరగని ముద్రవేశాయి. దాదాపు 638 సార్లు అమెరికా జరిపిన హత్యా యత్నాలను ఎదుర్కొని నిలబడ గలిగారా యన. దేశ ప్రజానీకం మొత్తం క్యాస్ట్రోకు రక్షణ కవచంగా నిలిచిందనడానికి అమెరికా విఫలయత్నాలే నిదర్శనం. నిజానికి 1990వ దశకంలో జరిగిన సోవియట్ యూనియన్ పతనం క్యూబాకు పెద్ద విఘాతమే. అయినా క్యూబా ఆ సమస్యను అధిగ మించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే ప్రగతిని సాధించగలిగింది. అక్కడి చక్కెర అమెరికాకు చేదే క్యూబా పురాతన దేశం. 1492లో స్పెయిన్ నావికుడు క్రిస్టోఫర్ కొలం బస్ అప్పటి ఇటలీ ప్రభుత్వ సహకారంతో భారతదేశాన్ని కనుగొనాలని బయలు దేరి, దారి తప్పి అమెరికా సహా క్యూబాను కనిపెట్టాడు. అప్పటి నుంచి అక్కడికి స్పెయిన్ దేశీయుల వలస ప్రారంభమైంది. 1898 వరకు క్యూబా స్పెయిన్ వలస దేశమే. స్పానిష్ అమెరికన్ యుద్ధం తరువాత 1898లో క్యూబా అమెరికా వలసగా మారింది. కొద్ది కాలంలోనే క్యూబాను అమెరికా స్వతంత్ర దేశంగా ప్రకటించినా, ఆ స్వతంత్రం నామమాత్రమే. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అమెరికా క్యూబాను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది. చెరుకు తోటల పెంపకం, చక్కెర ఉత్పత్తి అమెరికా తన గుత్తాధిపత్యంలో ఉంచుకుంది. దేశ ఆర్థిక రంగానికి మూలాధారమైన చక్కెర ఉత్పత్తి అమెరికా నియంత్రణలో ఉండడం వల్ల ప్రజల బతుకుతెరువు అగ్ర దేశం దయాదాక్షిణ్యాల మీద కొనసాగింది. బటిస్టా నాయకత్వంలోని నియం తృత్వ ప్రభుత్వం కూడా అమెరికా కనుసన్నల్లో ఉండేది. చక్కెర పరిశ్రమలో, చెరుకు తోటలో పనిచేసేవారు కేవలం 30 శాతం. మిగిలిన 70 శాతం నిరు ద్యోగంలో లేదా అర్థ నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతుండేవారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా, అమెరికా ఆర్థిక దోపిడీ లక్ష్యంగా నిర్మితమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ ఆ దేశాన్ని పేదరికంలోకి నెట్టింది. నిత్యా వసరాలైన పాలు, గుడ్లు, మాంసాహారం కూడా కరువయ్యాయి. 89 శాతం మందికి కనీసం పాలు కూడా దొరకని స్థితి. 96 శాతం మంది మాంసాహారం తిని ఎరుగరు. 98 శాతం మందికి గుడ్లు కూడా లభించేవి కావు. ప్రభుత్వంతో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. వివిధ రూపాల్లో కొన్ని తిరుగుబాట్లు చేశారు. ఆ క్రమంలోనే క్యాస్ట్రో విద్యార్థి నేతగా ఉద్యమాల్లో అడుగుపెట్టారు. బటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1953 జులై 26వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలో శాంటియాగో డీక్యూబా లోని మంకోడా సైనిక స్థావరం మీద దాడి జరిగింది. ప్రభుత్వం 24 మందిని అరెస్టు చేసి, జైలుకి పంపింది. 60 మంది విప్లవకారులను హత్య చేసింది. ప్రజా ఉద్యమాల ఫలితంగా 1955 ఏప్రిల్‌లో క్యాస్ట్రో సహా విప్లవకారులంతా విడుదలయ్యారు. విప్లవ కార్య క్రమాల మీద నిర్బంధం పెరగడంతో క్యాస్ట్రో తన కార్యస్థానాన్ని మెక్సికోకి మార్చి, అక్కడి నుంచే సాయుధ గెరిల్లా పోరాటానికి సన్నాహాలు చేశారు. క్యాస్ట్రో సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రవుల్ క్యాస్ట్రో, యువ విప్లవ కెరటం చేగువేరా కూడా ఆయనను అనుసరించారు. చిట్టచివరిగా 1959 జన వరి 1వ తేదీన క్యాస్ట్రో నాయకత్వంలోని రెడ్ఆర్మీ బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసింది. ఆ ఫిబ్రవరి 10న క్యాస్ట్రో ప్రప్రథమ ప్రధానమంత్రిగా పదవిని చేప ట్టారు. బటిస్టా దేశం వీడి పారిపోయాడు. ఆదిలో అల్లకల్లోలం క్యాస్ట్రో ప్రభుత్వం మొదటి చర్యగా అమెరికా ఆస్తులను, పరిశ్రమలను జాతీ యం చేసింది. వేల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయిన అమెరికా క్యూబా విప్లవ ప్రభుత్వాన్ని అడుగడుగునా దెబ్బతీయడానికి యత్నించింది. విప్లవ ప్రభుత్వం ఏర్పడడంతో బటిస్టా మద్దతుదారులైన ధనికవర్గం అమెరికాకు పారిపోయింది. అందులో వివిధ రంగాల నిపుణులు, వైద్యులు, ఇతర మేధా వులు కూడా ఉన్నారు. దాదాపు 50 శాతం వైద్యులు క్యూబాను వీడారు. తీవ్ర స్థాయిలో వైద్యుల కొరత ఏర్పడింది. అయినా క్యాస్ట్రో ప్రభుత్వం చలించ కుండా పెద్ద మొత్తంలో వైద్యవిద్యను ప్రోత్సహించి, అవసరమైనంత మంది వైద్యులను తయారుచేసుకోగలిగింది. ఆరేళ్లలోనే అవసరమైన ఆరోగ్య వ్యవ స్థను స్థాపించుకోలిగింది. 1970 సంవత్సరానికి ఆరోగ్యరంగంలో అనన్యసా మాన్యమైన విజయాలను సాధించింది. తమ బడ్జెట్లో సింహభాగాన్ని ఆరోగ్య అవసరాలకు, డాక్టర్ల శిక్షణకు వినియోగిం చడం వల్ల ఇది సాధ్య మైంది. 1970కి వచ్చే సరికి మలేరియా, పోలియో పూర్తిగా నిర్మూలించారు. క్షయ, జీర్ణకోశ వ్యాధులతో జరిగే మరణాలను చాలా పెద్దమొత్తంలో అరి కట్టగలిగారు. 1980లో ఈ కృషిని మరింత విస్తృత పరచగలిగారు. ఈరోజు ఆరోగ్యరంగంలో క్యూబా ప్రపంచ దేశాలన్నింటిలో అగ్రభాగాన ఉండడమే కాకుండా, ప్రజలు వైద్య సౌకర్యాల లేమితో బాధపడ కుండా చేయగలిగింది. ఆరోగ్యం ప్రజల హక్కుగానే కాకుండా ప్రభుత్వ బాధ్యతగా ప్రకటించుకు న్నది. ఆదర్శవంతమైన డాక్టర్- నర్స్ పథకాన్ని అమ లుచేసింది. చేస్తున్నది. 150 కుటుంబాలకు ఒక నర్స్, ఒక డాక్టర్ వంతున నియమించి వైద్య ఆరోగ్య విషయాలలో ప్రజలందరిని చైతన్యపరిచే అరుదైన వ్యవస్థను క్యూబాలో అద్భుతంగా అమలు పరిచారు. ఆ 150 కుటుంబాల ఆరోగ్య వివరాలన్నీ డాక్టర్ - నర్స్‌ల బృందం వద్ద ఉంటాయి. ప్రతి 30 వేల నుంచి 60 వేల జనాభా ఉన్న ప్రాంతానికి ఒక పాలిక్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. క్యూబాలో ఇప్పుడు 498 పాలిక్లినిక్లున్నాయి. వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యా ర్థులు మొదటి ఏడాది నుంచే పాలిక్లినిక్లలో వైద్యసేవలందిస్తూ ఆచరణలో వైద్యవిద్యను నేర్చుకుంటారు. క్యూబాను దెబ్బతీసేందుకు అత్యవసరాలైన మందులు, వైద్య పరికరాలను సైతం అమెరికా నిలిపివేసింది. కానీ అవేవీ క్యూబా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. విప్లవం వచ్చేనాటికి క్యూబా శిశుమరణాల రేటు 80 అయితే ఈ రోజు అది 4.63 శాతం. మన దేశంలో 41.1 శాతం. అమెరికాలో 5.74శాతం. అంటే క్యూబా కంటే అధికమే. చిన్న దేశం క్యూబా సాధించిన వైద్య విజయాన్ని అర్థం చేసు కోవడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. అంతేకాక లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్స్ స్థాపించి 72 దేశాలకు చెందిన దాదాపు 20,500 మంది వైద్యులను అందించింది. క్యూబాలో వైద్య ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అలా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విజయ పరంపర విద్యారంగంలో క్యూబా సాధించిన విజయం కూడా ఘనమైనదే. నూటికి నూరు శాతం విద్యారంగం బాధ్యత ప్రభుత్వానిదే. మూడు దశాబ్దాల క్రితమే నూటికి నూరు శాతం అక్షరాస్యతను ఆ దేశం సాధించింది. ఇందుకు కారణం 1961లోనే 2 లక్షల మంది ఉపా ద్యాయులను సమీకరించి, ఒక ఉద్యమ స్ఫూర్తితో అక్షరాస్యతను అందించగలిగింది. అదే సమయంలో విద్యను ఉత్పత్తితో అను సంధానం చేస్తూ భవిష్యత్తు ఉపాధి నైపుణ్యాలను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మహిళల అక్షరాస్యతలో కూడా నూటికి నూరు శాతం ఫలితాలను సాధించగలిగింది క్యూబా. రాజకీయరంగంలో సైతం క్యూబా సాధించిన విజయం అనేక ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు వంటిది. పార్లమెంటులో ఇప్పుడు దాదాపు 45 శాతంగా మహిళల ప్రాతి నిధ్యం ఉందంటే, స్త్రీల రాజకీయ భాగస్వామ్యంలో ఆ దేశం ఎంత ముందుందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అనే కమైన మార్పులను చేపట్టింది. భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేసే అసమాన వ్యవస్థగా కాకుండా ప్రభుత్వం మాత్రమే యావత్ భూమిపైన హక్కును కలిగి ఉంటుంది. రైతులు సహకార సంఘాలుగా ఏర్పాటై వ్యవ సాయాన్ని నిర్వహించే అవకాశాన్ని కలిగించారు. దానితో సహకార రంగం ద్వారా ఉత్పత్తి పెరగడం మాత్రమే కాకుండా క్యూబా ప్రభుత్వం ధరలను సైతం నియంత్రించగలిగింది. ఆయన చిరస్మరణీయుడు ప్రజల ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎప్పటిక ప్పుడు తన విధానాలను సమీక్షించుకొని క్యూబా ముందుకు పోతున్నది. మొదట రష్యా తరహాలో కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించుకున్నప్ప టికీ; ఆ తర్వాత చైనా, వియత్నాం పద్ధతుల్లో ఆర్థిక విధానాలను రూపొం దించు కున్నది. ఇటీవల మరికొన్ని నిర్ణయాలను తీసుకొని ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాలను విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి అంశాలు దెబ్బ తినకుండా సమయానుకూలంగా మార్చుకోవాలని ఆలోచి స్తున్నట్టు తెలుస్తున్నది. పారిశ్రామిక రంగంలో కొంత వెసులుబాటు కల్పించి త్వరితగతిన వృద్ధిని సాధించాలని చూస్తున్నారు. గత అరవైయేళ్లుగా సామా జికార్థిక ప్రగతికి ప్రజలే కేంద్రబిందువుగా పాలనను అందిస్తూ అనేక దేశాల్లో సోషలిస్టు విధానాలు విఫలమైనప్పటికీ, తమ గడ్డమీద మాత్రం సోషలిజం నిజమని రుజువు చేసింది క్యూబా. కమ్యూనిజం శాశ్వత సత్యమని చాటి చెప్పింది. తొమ్మిది పదుల నిండు జీవితంలో సామ్రాజ్యవాదంపై అలు పెరు గని యుద్ధం చేసి, జనక్యూబాను నిర్మించిన ఫిడెల్ క్యాస్ట్రోను ప్రపంచ సోషలిస్టుల్లో చిగురించిన కమ్యూనిస్టు విశ్వాసంగా నిరంతరం స్మరించు కుందాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
కొండంత ఆణిముత్యం!
ఆర్మేనియా నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం! తూర్పు యూరప్, పశ్చిమ ఆసియాల మధ్య ఉన్న దేశం ఆర్మేనియా. ఈ దేశానికి పశ్చిమంలో టర్కీ, ఉత్తరంలో జార్జియా, తూర్పులో అజర్బైజాన్, దక్షిణంలో ఇరాన్ దేశాలు ఉన్నాయి. భౌగోళికంగా రెండు ఖండాల మధ్య ఉండడం వల్ల ఎన్నో జాతులు ఆర్మేనియాపై దండెత్తాయి. గ్రీకులు, ఒట్టమన్లు, ఇరానీయులు, రష్యన్లు... ఆర్మేనియా ప్రాంతాలపై దండెత్తారు. ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్లో భాగమైన ఆర్మేనియా, సోవియట్ యూనియన్ పతనం తరువాత ‘ఆర్మేనియా రిపబ్లిక్’గా అవతరించింది. పది పరిపాలనా విభాగాలుగా ఆర్మేనియా విభజించబడింది. అవి: 1. అగ్రాట్సన్, 2. అరాత్, 3. అర్మవిర్, 4. జెఘర్కునిక్, 5. కోతక్, 6.లొరి, 7.సిరక్, 8. సియునిక్, 9. తవుష్ 10.వయొత్స్ద్జర్... ఈ విభాగాల నిర్వహణాధికారిని మర్జ్‌పెట్ అంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. యెరెవన్ నగరానికి రాజధాని నగరంగా స్వయంప్రతిపత్తి ఉంది. ఆర్మేనియా రిపబ్లిక్‌గా అవతరించిన తరువాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఉపాధికల్పనలో వ్యవసాయరంగం వాటా పెరిగింది. ఆహారభద్రత పెరిగింది. పర్యాటకరంగంలో ఎన్నో అనుబంధ పరిశ్రమలు వెలిశాయి. పర్యావరణ సంబంధిత అంశాలపై ఆర్మేనియా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. గాలి, నీటి కాలుష్యంపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తుంది. ‘నేచర్ ప్రొటెక్షన్’ పేరుతో ఒక మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసింది. టర్కీ, అజర్బైజాన్ మినహా ప్రపంచంలోని ప్రతి దేశంతో ఆర్మేనియా సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ‘ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’, ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’తో సహా నలభై అంతర్జాతీయ సంస్థలలో ఆర్మేనియాకు సభ్యత్వం ఉంది. ఆర్థిక సంస్కరణల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి స్థిరమైన అభివృద్ధి దిశలో సాగిపోతుంది ఆర్మేనియా. టాప్ 10 1. ఆర్మేనియన్ భాషలో దేశం పేరు హయక్. హయక్ అనేది ఆర్మేనియన్ మూల పురుషుడి పేరు. 2. ఆర్మేనియాలోని ‘అపోస్టోలిక్ చర్చి’ ప్రపంచంలోనే పురాతనమైన చర్చి. 3. ‘క్రిస్టియన్ కంట్రీ’గా తనను తాను ప్రకటించుకున్న తొలిదేశం ఆర్మేనియా. 4. రాజధాని యెరెవన్లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది. 5. ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి పేరు ఉంది. 6. ఆర్మేనియా జాతీయ చిహ్నం మౌంట్ ఆరాత్. అయితే భౌగోళికంగా ఇది టర్కీలో ఉంది. 7. అరస్... ఆర్మేనియాలో పొడవైన నది. 8. రాజధాని నగరం యెరెవన్కి ‘పింక్ సిటీ’ అని పేరు. 9. మద్యం జన్మస్థలం ఆర్మేనియా అని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. 10. ఆర్మేనియాలో అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ... మల్లయుద్ధం. దేశం : రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా రాజధాని : యెరెవన్ అధికార భాష : ఆర్మేనియన్ కరెన్సీ : డ్రామ్ జనాభా : 29 లక్షల 99 వేలు (సుమారుగా) అక్షరాస్యత : 99 శాతం -
రోవర్లలో మేటి... ఆపర్చునిటీ!
అరుణగ్రహంపై పదేళ్లుగా అలుపెరగకుండా తిరుగుతున్న నాసా ఆపర్చునిటీ శోధక నౌక(రోవర్) అరుదైన రికార్డు సృష్టించింది. 2004లో అంగారకుడిపై వాలిన ఈ శోధక నౌక ఆదివారం 40 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందట. దీంతో భూమి కాకుండా ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రోవర్‌గా ఇది చరిత్రకెక్కింది. అయితే మూడు నెలల కాలంలో ఒక కిలోమీటరు దూరం మాత్రమే తిరిగి భూమికి సమాచారాన్ని పంపేందుకే దీనిని తయారు చేశారు. కానీ.. పదేళ్లు పూర్తయినా ఇంకా ఇది చకచకా పరుగులు పెడుతోంది. మార్స్‌పై ఈగల్ క్రేటర్ ప్రాంతంలో దిగి ఇప్పటిదాకా 40.25 కిలోమీటర్లు ప్రయాణించిన ఆపర్చునిటీ మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కీలకమైన ఎండీవర్ క్రేటర్ ప్రాంతానికి చేరుకోనుందట. అంగారకుడిపై మట్టి, శిలల గురించిన సమాచారాన్ని, గతంలో నీటి ప్రవాహపు ఆనవాళ్లను, ఖగోళం, వాతావరణ వివరాలను కూడా ఈ రోవర్ అందించింది. అన్నట్టూ.. ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రికార్డు ఇంతకుముందు సోవియెట్ యూనియన్ పంపిన లూనోఖోడ్-2 రోవర్ మీద ఉంది. లూనోఖోడ్-2 రోవర్ చంద్రుడిపై 1973, జనవరిలో దిగి.. ఐదు నెలల్లోనే 39 కిలోమీటర్లు ప్రయాణించింది. తర్వాత అదే ఏడాది మే నెలలో చివరిసారిగా సమాచారం పంపి.. శాశ్వతంగా మూగబోయింది. -
అన్నీ అంతంతే !
ప్రపంచకప్‌లో తలపడుతున్న ఎనిమిది గ్రూప్‌లలో అంతగా అంచనాలు లేనిది గ్రూప్ ‘హెచ్’. ఇందులోని నాలుగు దేశాలు బెల్జియం, రష్యా, కొరియా రిపబ్లిక్, అల్జీరియాలకు ఇప్పటిదాకా ప్రపంచకప్ సాధించిన చరిత్ర లేదు. అయితే బెల్జియం, కొరియాలు ఇంతకుముందు చెరోసారి సెమీఫైనల్ దాకా వెళ్లగలిగాయి. మహా అయితే ఈ రెండు జట్లు మరోసారి నాకౌట్‌కు చేరే అవకాశం ఉంది. ఈ గ్రూప్ నుంచి ఏ జట్టయినా సెమీస్‌కు చేరితే అది అద్భుతమే అనుకోవాలి. కొరియా రిపబ్లిక్ ఆసియా నుంచి ఎక్కువ సార్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లలో కొరియా రిపబ్లిక్ ఒకటి. వరుసగా ఎనిమిదో సారి, మొత్తంగా తొమ్మిదోసారి ప్రపంచకప్ ఆడుతున్న ఈ దక్షిణ కొరియా జట్టు 2002 ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో నిలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 1954లో తొలిసారి ప్రపంచకప్‌కు క్వాలిఫై అయ్యాక మళ్లీ 1986 దాకా అర్హత సాధించలేకపోయింది. అయితే ఆ తరువాత నుంచి వరుసగా ప్రపంచకప్‌లో ఆడుతూ వస్తోంది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: తొలుత 1954లో, ఆ తరువాత 1986 నుంచి 1998 దాకా వరుసగా నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశకే పరిమితమైంది. 2002లో నాలుగో స్థానంలో నిలి చింది. 2006లో మరోసారి గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే 2010లో దక్షిణాప్రికాలో ప్రిక్వార్టర్స్‌కు చేరి 15వ స్థానం పొందింది. కీలక ఆటగాళ్లు: సీనియర్ ఆటగాడు పార్క్ చు-యంగ్, సన్ హ్యుంగ్‌మిన్, కిమ్ షిన్వూక్లు గోల్స్ అందించగల ఆటగాళ్లు. వీరికితోడు మిడ్‌ఫీల్డర్లు కూ జాచియోల్, లీ చుంగ్యాంగ్లు కీలకం కానున్నారు. కోచ్: హాంగ్ మ్యుంగ్బో; అంచనా: బెల్జియంపై గెలిస్తే ప్రిక్వార్టర్స్‌కు చేరవచ్చు. రష్యా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రష్యా జట్టు తొలిసారిగా 1994లో ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కానీ, గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. మళ్లీ 2002లో క్వాలిఫై అయినా.. నాకౌట్‌కు చేరలేకపోయింది. గత రెండు ప్రపంచకప్‌లకు అర్హతనూ పొందలేకపోయింది. దీంతో ఈసారి పెద్దగా అంచనాలు లేకుండానే క్వాలిఫయర్స్‌లో బరిలోకి దిగింది. కానీ, యూరోప్ నుంచి గ్రూప్ ‘ఎఫ్’ విజేతగా నిలిచి బ్రెజిల్‌కు దూసుకొచ్చింది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: సోవియట్ యూనియన్ జట్టుగా 1958లో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత పొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 1962, 1970లలోనూ క్వార్టర్స్‌కు చేరింది. 1966లో సెమీస్‌కు చేరి నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా జట్టుగా 1994, 2002 ప్రపంచకప్‌లకు అర్హత సాధించింది. కానీ, గ్రూప్ దశను దాటలేకపోయింది. ఇక 2006, 2010 ప్రపంచకప్‌లకు క్వాలిఫై కూడా కాలేకపోయింది. కీలక ఆటగాళ్లు: ఈ జట్టులో ఫార్వర్డ్ ఆటగాడు అలెగ్టాండర్ కెర్జకోవ్, డిఫెండర్ సెర్గీ ఇగ్నషెవిచ్ కీలక ఆటగాళ్లు. మిడ్‌ఫీల్డర్ రోమన్ షిరోకోవ్ గాయపడటం ప్రతికూలం. కోచ్: ఫాబియో కాపెలో; అంచనా: నాకౌట్ దశకు చేరుకోవచ్చు. బెల్జియం ఫిఫా వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన బెల్జియం.. ప్రపంచకప్ వేటలో మాత్రం వెనకబడే ఉంది. 1982 నుంచి 2002 దాకా వరుసగా ఆరుసార్లు ఫైనల్స్‌కు అర్హత సాధించిన రికార్డు ఈ జట్టుది. కానీ, ఒక్కసారి కూడా టైటిల్ పోరుకు చేరుకోలేకపోగా.. మళ్లీ క్వాలిఫై అయ్యేందుకే ఇన్నేళ్లు పట్టింది. అయితే క్వాలిఫయింగ్స్‌లో ఈ యూరోప్ జట్టు తమ గ్రూప్‌లో నంబర్‌వన్‌గా నిలిచి ప్రపంచకప్‌కు బెర్తు దక్కించుకుంది. ప్రపంచకప్‌లో ప్రదర్శన: ఇప్పటికి 11 సార్లు ప్రపంచకప్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. కానీ, 1986లో సెమీఫైనల్స్‌కు చేరడమే ఈ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. 1990, 1994, 2002 ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్స్‌కు చేరగలిగింది. కీలక ఆటగాళ్లు: క్వాలిఫయింగ్స్‌లో అదరగొట్టిన నాసర్ చడ్లీ, ఈడెన్ హజార్డ్లు మరోసారి కీలకం కానున్నారు. వీరికి కెప్టెన్ విన్సెంట్ కంపనీ, థామస్ వెర్మాలెన్, రొమేలు లుకాకు, కెవిన్ డి బ్రూనే వంటి సీనియర్ల అనుభవం తోడు కానుంది. కోచ్: మార్క్ విల్మట్స్ అంచనా: కొరియాను ఓడించగలిగితే నాకౌట్‌కు చేరొచ్చు. అల్జీరియా గ్రూప్‌లో ఏమాత్రం అంచనాలు లేని జట్టు అల్జీరియా. 1964లోనే ఫిఫా సభ్యదేశంగా మారినా.. ప్రపంచకప్ బరిలో అడుగు పెట్టేందుకు మాత్రం 1982 దాకా పోరాడాల్సివచ్చింది. మొత్తంగా మూడుసార్లు అర్హత సాధించినా ఒక్కసారి కూడా గ్రూప్ దశను దాటలేకపోయింది. అయితే ఈసారి క్వాలిఫయింగ్స్‌లో ఆఫ్రికా నుంచి అర్హత పొందిన ఐదు జట్లలో టాప్‌గా నిలిచింది. తమ కన్నా మెరుగైన బెల్జియం, రష్యా, కొరియా జట్లను దాటుకొని ఏ మేరకు ముందుకు వెళ్తుందన్నది సందేహమే. ప్రపంచకప్‌లో ప్రదర్శన: 1982లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలిసారిగా పాల్గొంది. తరువాత 1986లో బ్రెజిల్, స్పెయిన్ వంటి జట్లున్న గ్రూప్‌లో ఆడి అట్టడుగు స్థానంతో వెనుదిరిగింది. 2010లో దక్షిణాఫ్రికాలోనూ అల్జీరియాకు నిరాశే ఎదురైంది. గ్రూప్‌లో ఒక్క గోల్ కూడా చేయకుండానే నిష్ర్కమించింది. కీలక ఆటగాళ్లు: డిఫెండర్ మాడ్జిడ్ బౌగెర్రా కెప్టెన్‌గా ప్రధాన బాధ్యతలు మోయనున్నాడు. సోఫియేన్ ఫెగౌలి, మేధి లాసెన్, ఇస్లాం స్లిమానీలు ఈ జట్టులో ఇతర ప్రధాన ఆటగాళ్లు. కోచ్: వాహిద్ హాలిహోడ్జిక్ అంచనా: గ్రూప్ దశ దాటడం కష్టమే -
హృదయం: 60 ఏళ్ల తర్వాత కలిశారు!
అప్పటికి మూడు రోజులే అయింది అన్నా కొజ్లొవ్కు, బోరిస్ ఎడ్యూల పెళ్లయి. రెడ్ ఆర్మీ తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు బయల్దేరాడు బోరిస్. ఇంతలోనే ఎడబాటా అనుకుంది అన్నా. కానీ ఆ ఎడబాటు 60 ఏళ్లకు దాటిపోతుందని ఆమె ఆనాడు ఊహించలేదు. బోరిస్ వెంటనే తిరిగిరాలేదు. సోవియెట్ యూనియన్‌లో అలజడుల కారణంగా అన్నా కుటుంబంతో సహా ఆ దేశాన్ని విడిచి, సైబీరియాకు వెళ్లాల్సి వచ్చింది. ఏళ్లు గడిచాయి. బోరిస్‌కు, అన్నాకు సంబంధాలు తెగిపోయాయి. ఒకరి జాడ కోసం ఇంకొకరు ఎంతో ప్రయత్నించారు. అన్నా ఓ దశలో ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ తల్లి ఆమెను కాపాడి, కొత్త జీవితం ఆరంభించమని చెప్పింది. అయిష్టంగానే సరేనంది అన్నా. మరోవైపు భార్య కోసం ఎదురు చూసీ చూసీ అలసిపోయిన బోరిస్ కూడా మరో పెళ్లి చేసుకున్నాడు. ఆరు దశాబ్దాలు గడిచాయి. ఈలోపు ఇద్దరూ తమ భాగస్వాముల్ని పోగొట్టుకున్నారు. అన్నా అనుకోకుండా రష్యాలోని తన సొంత నగరం బోరోవ్లియాంకాకు వెళ్లింది. ఆశ్చర్యం. అక్కడ బోరిస్ కనిపించాడు. ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకున్నారు. ఒకరి కథలు ఒకరు పంచుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 60 ఏళ్ల సుదీర్ఘం విరామం తర్వాత మళ్లీ ఇటీవలే వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. -
ఆమె... అతడు... మధ్యలో రెండు దేశాలు
రోజులు కాదు. నెలలు కాదు. ఏళ్లు గడిచిపోయాయి. అది కూడా ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 11 ఏళ్లు. అయినా అతణ్ణి ఆమె, ఆమెను అతడు కలవడానికి ప్రయత్నం, పోరాటం ఆపలేదు. చివరికి రెండు దేశాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. వాళ్లిద్దరూ కలిశారు. ఇంతకూ ఎవరా ఇద్దరు? ఏమా కథ? అది నలభై ఏళ్ల నాటి కథ. సోవియెట్ యూనియన్ అమ్మాయి ఇరినా మెకిలాన్. మాస్కోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్‌లో ఉద్యోగి. అక్కడే ఆమె అమెరికాకు చెందిన ప్రొఫెసర్ వుడ్ఫోర్డ్ను కలిసింది. కొన్నాళ్లకే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. 1974 మేలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మూడు నెలల తర్వాత వుడ్‌ఫోర్డ్ స్వదేశానికి బయల్దేరాల్సి వచ్చింది. అతని వీసా గడువు ముగిసిపోవడమే దీనికి కారణం. మళ్లీ వస్తానంటూ... వదల్లేక వదల్లేక మాస్కోను వదిలివెళ్లాడు వుడ్‌ఫోర్డ్. ఆ తర్వాత తన భార్యను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు వుడ్‌ఫోర్డ్. కానీ మాస్కో రావటానికి అతనికి అనుమతి లభించలేదు. కనీసం తనైనా యూఎస్ వెళ్దామని చూసింది ఇరినా. కారణాలు చెప్పలేదు కానీ, ఆమె అమెరికా వెళ్లడానికి అనుమతించలేదు సోవియెట్ యూనియన్. యూఎస్‌కు, సోవియెట్ యూనియన్‌కు మధ్య వైరం... ఇరినా, వుడ్‌ఫోర్డ్‌లకు శాపంగా మారింది. ఉత్తర ప్రత్యుత్తరాలతో క్షేమ సమాచారాలు కనుక్కుంటూ, వివాహ వార్షికోత్సవాల సమయంలో గ్రీటింగ్ కార్డులు, ఫొటోలు పంపుకుంటూ అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ, ఇలా ఏకంగా పదకొండేళ్లు గడిచిపోయాయి. అయినా ఒకరినొకరు కలవడానికి వుడ్‌ఫోర్డ్, ఇరినా ప్రయత్నాలు ఆపలేదు. ఎడబాటు ఎంత బాధ, ఎంత అసహనం కలిగించినా, ఏనాడో ఒకనాడు తప్పకుండా కలుస్తామన్న ఆశతోనే అన్నేళ్లు ఎదురుచూశారు వాళ్లిద్దరూ. వుడ్‌ఫోర్డ్, ఇరినాల ప్రేమకథ పత్రికలకెక్కింది. దీంతో సోవియెట్ యూనియన్ దిగి వచ్చింది. ఇరినా యూఎస్‌కు వెళ్లడానికి అంగీకరించింది. 1986 జనవరిలో ఇరినా మాస్కో నుంచి కూతురితో కలిసి బయల్దేరింది. యూఎస్‌లోని బాల్టిమోర్ - వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో దిగగానే వర్షించే కళ్లతో తనకోసం ఎదురుచూస్తూ కనిపించాడు వుడ్‌ఫోర్డ్. ఇద్దరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంది. వాళ్లిద్దరూ తిరిగి కలిసిన క్షణాల్ని అమెరికా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అనూహ్య మలుపులు తిరిగిన తమ కథను తర్వాత ‘ఆఫ్ లవ్ అండ్ రష్యా: ది ఎలెవన్ ఇయర్ ఫైట్ ఫర్ మై హజ్బెండ్ అండ్ ఫ్రీడమ్’ పేరుతో పుస్తకంలోకి ఎక్కించింది ఇరినా. ఇటు రష్యాలో, అటు అమెరికాలో ఈ పుస్తకం మంచి పాపులారిటీ సంపాదించుకుంది. -
ఏవి ఆ సోవియెట్ రోజులు...
తెలుసుకోదగ్గ పుస్తకం: ఆదోని డిగ్రీ కాలేజి వార్షికోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడి లైబ్రరీలో ఉన్న ఎన్నో మంచి పుస్తకాల్లో ‘ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్’ (ప్రోగెస్ పబ్లిషర్స్ - 1974) చూడగానే నాకెందుకో బెంగగా అనిపించింది. డెబ్బైల్లోనూ ఎనబైల్లో కొంతకాలం దాకా సోవియెట్ పుస్తకాలు, కవిత్వం, కథలు ఎంతో చౌకగా విరివిగా దొరికేవి. నా చిన్నప్పుడు సత్తెనపల్లిలో జరిగిన జిల్లా సైన్సు ఫెయిర్‌లో నాకు బహుమతిగా దొరికిన మూడు పుస్తకాలూ సోవియెట్ పుస్తకాలే. యాకోవ్ పెరొల్మాన్ రాసిన నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం నా హైస్కూలు రోజుల్లో ఎన్నిసార్లు చదివానో. మార్క్స్, ఎంగెల్సు రచనలు, లెనిన్ రచనలు పూర్తి సంపుటాలతో పాటు గోర్కీ అమ్మ, టాల్‌స్టాయ్ కొసక్కులు, అన్నా కెరెనినా, డాస్టవిస్కీ పేదజనం-స్వేతరాత్రులు, తుర్గనెవ్ తండ్రులూ-కొడుకులూ, కుప్రిన్ రాళ్లవంకీ కథలు, చింగిజ్ అయిత్మాతోవ్ నవలలు, ఆర్మేనియన్ కథలు ‘కొండగాలీ-కొత్త జీవితం’, పిల్లల బొమ్మల పుస్తకాలూ ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి సాహిత్యమిత్రుడి భాండాగారంలోనూ కనిపించేవి. రష్యన్ కవిత్వం కన్నా సోవియెట్ కవిత్వం, ముఖ్యంగా రసూల్ గాంజటవ్, జైసన్ కులియెన్ వంటి వారి పుస్తకాలు ఎంతో అందమైన ముద్రణల్లో కనిపించేవి. చెకోవ్ మొత్తం కథలు నాలుగు సంపుటాల్లో వచ్చిన అందమైన ప్రచురణలో మూడు సంపుటాలు ఇప్పటికీ భద్రంగా నా దగ్గరున్నాయి. ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్ పుస్తకం చూడగానే ఈ జ్ఞాపకాలు మనసులో మెదలడంతో కలిగిన బెంగ కొంతమాత్రమే కాని అసలు సోవియెట్ ప్రయోగమే నా హృదయాన్ని కలచివేసింది. ఇరవయ్యవ శతాబ్దం చూసిన మహత్తర మానవ సామాజిక ప్రయోగాల్లో సోవియెట్ రష్యా ఆవిర్భావం కూడా ఒకటి. శతాబ్దం ముగియకుండా ఆ ప్రయోగం కుప్పకూలిపోవడం మరొకటి. సోవియెట్ రష్యా ఏర్పడినప్పుడు అది శ్రీశ్రీ స్తుతించినట్టుగా ‘భావికాల స్వర్ణభవన నిర్మాతగా మారుతుందనే’ ప్రపంచమంతా ఎదురుచూసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ దగ్గర నాజీ సైన్యాల్ని సోవియెట్లు నిలవరించి ఉండకపోతే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేదని మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరత్నంగారు ఎంతో ఉద్వేగంగా చెప్పేవారు. కాని ఇప్పుడదంతా ఒక గతంగా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవడం నా బెంగకి కారణం. ఎనభైలలో గోర్బచెవ్ పెరిస్త్రోయికా గురించి మాట్లాడినప్పుడు ఆర్ఎస్ సుదర్శనం దగ్గరకు వెళ్లి గ్లాస్ నోస్త్, పెరిస్త్రోయికా అంటే ఏమిటని అడిగితే ఆ పదాలు సోవియెట్ గోడలు పగుళ్లు బారుతున్నాయనడానికి సంకేతమనీ, ఆ వ్యవస్థ తొందర్లోనే కూలిపోనున్నదనీ వివరించారాయన. అవన్నీ తలంపులోకి రాగా ఇప్పుడీ యాభై మంది సోవియెట్ కవుల కవితా సంకలనం తెరవగానే రష్యన్ స్టెప్పీల పచ్చగడ్డి వాసనతో పాటు అందులోని యుద్ధాల పొగా, సైబీరియన్ ఖై దీల అశ్రువుల వెచ్చదనం కూడా నా చుట్టూ ముసురుకున్నాయి. ఈ పుస్తకం ముందుమాటలో ఇలా ఉంటుంది - ‘హింసకీ శత్రుత్వానికీ వ్యతిరేకంగా ఇది గళం విప్పింది. ప్రపంచంలో శాశ్వతంగా కనవచ్చే కాయకష్టం, మాతృత్వం, ప్రకృతితో తాదాత్మ్యంలో మనిషి పొందే సంతోషం, ప్రజల మధ్య సంభవించే స్నేహం వంటి వాటి కోసమే ఈ కవిత్వం నిలబడుతున్నది’ సమకాలీన సోవియెట్ సంకలనల్లాగా కాకుండా ఈ సంకలనంలో అన్నా అఖ్మతోవా, సాస్టర్నాక్ వంటి కవులకి కూడా చోటు దొరికింది. తల్లి హృదయం అనుభవించే క్షోభ ఏమిటో అన్నా అఖమతోవా, మేరియా త్సెతావా వంటి వారికన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? తన పిల్లల ఆకలి తీర్చడం కోసం సోవియెట్ రష్యాలో మేరియా త్సెతావా దొంగతనానికి కూడా వెనకాడలేదని మనకు తెలుసు. ఇక స్టాలిన్ ప్రభుత్వం అక్రమంగా నిర్బందించిన తన కొడుకుని చూసుకోవడం కోసం, విడిపించుకోవడం కోసం అన్నా అఖ్మతోవా ఏళ్ల తరబడి వీధుల్లో ప్రభుత్వ కార్యాలయ్యాలో జైళ్ల ముందట పడిగాపులు పడింది. యుద్ధం, దుఃఖం, భగ్న ఆశలకు గుర్తు ఈ పుస్తకం. - వాడ్రేవు చినవీరభద్రుడు లిటరరీ ఫిక్షన్‌కు వేరే ప్రత్యేకత లేదు... ఇలా అన్నారు: కాల్పనిక సాహిత్యాన్ని ‘లిటరరీ ఫిక్షన్’ (సీరియస్ సాహిత్యం), ‘జ్ఛట్ఛ ఫిక్షన్’ (కాలక్షేప సాహిత్యం) అని రెండుగా వర్గీకరించారు. నా దృష్టిలో లిటరరీ ఫిక్షన్ కూడా ఒక జ్ఛట్ఛ (జానర్/కేటగిరీ) మాత్రమే. తక్కిన అన్ని రకాల కాల్పనిక సాహిత్యానికి ఉన్నట్టే లిటరరీ ఫిక్షన్‌గా పిలవబడే సీరియస్ సాహిత్యానికీ తనదంటూ ఓ పాఠక సమూహం ఉంది. అంతకు మించి దానికేం ప్రత్యేకత లేదు. పాఠకుడిగా నా వయసు పాతికేళ్లు. ఈ పాతికేళ్లలో గమనించిందేమంటే- తెలుగు కథల్లో లిటరరీ ఫిక్షన్ ఆధిపత్యం క్రమంగా పెరుగుతూ పోయి, చివరికి వేరే రకాల కథలు దాదాపు మృగ్యమైపోయాయి. భావోద్వేగాల ప్రకటనకి, అంతరంగాల ఆవిష్కరణకి ప్రాముఖ్యతనిస్తూ ప్లాట్ డెవలప్మెంట్, స్ట్రక్చర్ వంటి శషబిషలు పెద్దగా పెట్టుకోని ఈ తరహా కథల మీద నాకు అంతగా ఆసక్తి లేదు. నాలోని పాఠకుడికి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, దాని పోకడల గురించి, మనుషుల మనస్తత్వాల గురించి కథల్లోనే చదివి తెలుసుకోవాలనే కోరిక లేదు. దానికి మరింత ప్రభావశీలమైన దారులు వేరే ఉన్నాయి. మెదడుకి పదును పెట్టే అబ్బుర పరిచే కథలే నాకు కావాలి. కథల్లో పుష్కలంగా ఇమాజినేషన్ ఉండాలి. అందుకోసం ఊహాశక్తే ఊపిరిగా నడిచే జ్ఛట్ఛ ఫిక్షన్‌కు మించినదేది? దురదృష్టవశాత్తు తెలుగులో ప్రస్తుతం హారర్, క్రైమ్, మిస్టరీ, చారిత్రకం, సాహసం, థ్రిల్లర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ వగైరా విభాగాలకి చెందిన కథలు దాదాపు రావటం లేదు. అడపాదడపా ఏవన్నా వచ్చినా వాటిలో నాణ్యతనాస్తి. ఈ అసంతృప్తి తరచూ స్నేహితులతో పంచుకుంటుండేవాడిని. ‘ఉత్తినే విమర్శించే బదులు అవేవో నువ్వే రాయొచ్చు కదా’ అన్న వారి సూచనతో, నేను రాయటం మొదలుపెట్టాను. - అనిల్ ఎస్. రాయల్ సైన్స్ ఫిక్షన్ కథా రచయిత (కినిగె ఇంటర్వ్యూ నుంచి) డైరీ మే 30 హైదరాబాద్ త్యాగరాయ గానసభలో మహాకవి శేషేంద్ర 7వ వర్ధంతి సభ. రామా చంద్రమౌళి, అనుమాండ్ల భూమయ్య, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. మే 25 ఆదివారం ఉదయం 10.30 గం.లకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్ శేఖర్ సంస్మరణ సభ. నిర్వహణ టి.కొండబాబు - 9490792047 మే 30 శుక్రవారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో యింద్రవెల్లి రమేశ్ - ‘వెల్లడి’ (వచనం మరియు కవిత్వం) ఆవిష్కరణ. అల్లం నారాయణ, ఎ.విద్యాసాగర్, జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొంటారు. సాక్షి సాహిత్య పేజీ మీద మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను రాయండి. సాహిత్యం పేజీలో మీరు కోరుకుంటున్న శీర్షికలను తెలియచేయండి. ఎటువంటి వ్యాసాలను కోరుకుంటున్నారో రాయండి. మా చిరునామా: ఎడిటర్ సాక్షి రోడ్ నం.1, బంజారా హిల్స్ హైదరాబాద్. సాక్షిలో పుస్తక సమీక్షకు రెండు కాపీలు పంపాలి. sakshiliterature@gmail.com -
‘మృత్యువు’ ముంగిట మంగోలియా
విశ్లేషణ: ప్రపంచ ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. మంగోలియా ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా? ‘నేను మరణిస్తే నా దేహాన్ని మరణించనివ్వండి. నా దేశాన్ని మాత్రం మరణించనివ్వకండి’. ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన చెంగీజ్ఖాన్ మాతృభూమి మం గోలియా ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా మెల్లమెల్లగా మరణిస్తోంది. అది ‘వాతావరణ మార్పుల వినాశకర పరిణామాలకు అతివేగంగా గురవుతున్న దేశం’. సంపన్న దేశాల దురాశాపూరిత ‘ఆర్థికాభివృద్ధి’ సృష్టించిన వాతావరణ ఉత్పాతం శ్వేతమృత్యువై మంగోలియన్ల పశుపాలక జీవిత విధానాన్ని కడతేరుస్తోంది. అసాధారణమైన మంచు తుఫానులకు, అతిశీతల ఉష్ణోగ్రతలకు ‘జాతీయ సంపద’ (పశుసంపద)ఎక్కడికక్కడ మందలుగా గడ్డకట్టిపోతోంది. జనాభాలో 40 శాతంగా ఉన్న పశుపాలకులకు సంప్రదాయక శీతాకాలపు గుడారాల (‘గెర్’) జీవితం ప్రాణాం తకంగా మారుతోంది. రాతి, కాంక్రీటు గృహాలు సైతం చలికి గజగజలాడి గడ్డకట్టిపోతున్నాయి. ఎండా కాలపు ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి, గోబీ ఏడారి వేగంగా విస్తరిస్తూ, సువిశాలమైన పచ్చిక మైదానాలను కబళించేస్తోంది, దేశమే ఎడారిగా మారిపోయే ముప్పును ఎదుర్కొంటోంది. అయితేనేం అది ప్రపంచశక్తుల వనరుల పోరుకు వేదిక. రష్యా, చైనాల మధ్య ‘భౌగోళిక బందీ’గా ఉన్న ఆ దేశంతో ‘వ్యూహాత్మక భాగస్వామ్యానికి’ అమెరికా ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. ప్రపంచంలో నేడు నెలకొన్న ఉద్రిక్తతలు చాలవన్నట్టు మధ్య ఆసియాలో మరో సరికొత్త ఉద్రిక్తతల కేంద్రం రూపుదిద్దుకుంటోంది. అటు వాతావరణ మార్పులు, ఇటు వనరుల కోసం పోరు కలిసి మం గోలు జాతి గొంతుకు బిగుస్తున్న అడకత్తెరగా మారాయి. నిరుపేద ‘కోటీశ్వరులు’! ఖనిజసంపదను బట్టి చూస్తే మంగోలియా ప్రపంచంలోని అతి సంపన్న దేశం. రాగి, బొగ్గు, మాలిబ్డినమ్, తగరం, టంగ్స్టిన్, బంగారం వంటి ఖనిజాలు భారీగా ఉన్న దేశం. ఒక్క ‘తావాన్ తోల్గోయ్’ రాగి, బంగారు గనుల రాబడితో స్థూల జాతీయోత్పత్తి 2010 నుంచి 2011కు 6.4 నుంచి 17.3 శాతానికి చేరింది. వృద్ధి కొలమానాలతో చూస్తే అది వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ముందున్నట్టు లెక్క! ఆ గనుల ఖనిజంతోనే 27.5 లక్షల మంగోలియన్లంతా కోటీశ్వరులై పోవాలి. ఆ దేశ అపార ఖనిజ సంపద ఎన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేస్తుందో తెలియదు. కానీ మంగోలులు ఖనిజ సంపద కాలనాగై కరిచే శాపగ్రస్త ప్రజలు. అందుకే వారు నిరుపేదలు. ‘తావాన్ తోల్గోయ్’ ప్రపంచ గనుల పరిశ్రమ దిగ్గజం ‘రియో టింటో’ సంస్థది. అది అమెరికా, బ్రిటన్ గుత్తాధిపతులది. సోవియట్ యూనియన్ పతనానికి ముందు మంగోలియా దానికి ఉపగ్రహ దేశంగా ఉండేది. ఆ తదుపరి అది పాశ్చాత్య ప్రపంచానికి, స్వేచ్ఛా విపణికి తలుపులు తెరచింది. దీంతో అమెరికా, కెనడా, యూరప్ దేశాలేగాక జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, భారత్ తదితర దేశాల వ్యాపార సంస్థలు మంగోలియాపై ఎనలేని ‘ఆసక్తిని’ కనబరుస్తున్నాయి. ఇక దక్షిణాన ఉన్న చైనా మంగోలియాతో ఉన్న భౌగోళిక, ఆర్థిక, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకొని, ఆర్థికవ్యవస్థపై పట్టు కోసం ప్రయత్నిస్తోంది. మంగోలియా ఎగుమతులలో 95 శాతం బొగ్గు, రాగి తదితర ఖనిజాలే. వాటిలో 90 శాతం చైనాయే దిగుమతి చేసుకుంటుంది. తన ‘పెరట్లోనే’ ఉన్నదనుకున్న ఖనిజ సంపదను ఇతరులు దోచుకుపోవడం రష్యాకు కంటగింపుగా ఉంది. చైనా, రష్యాలు రెండూ మంగోలియాపై ‘చారిత్రక హక్కు లు’ ఉన్న దేశాలే. ‘స్వేచ్ఛ’ విధించిన శాపం! సోవియట్ యూనియన్ పతనంతో రష్యా భల్లూకపు పట్టు నుంచి బయటపడ్డ మంగోలులు తమ పశుపాలక జీవిత విధానాన్ని పెంపొందింపజేసుకున్నారు. పశుపాలకులకు తెలిసిన ఏకైక సంపద, జీవన భద్రత ఒక్కటే... పశవుల మందలే. మందల పరిమాణానికి సోవియట్ హయాంలో పరిమితులు ఉండేవి. బదులుగా రష్యా మాంసాన్ని వారికి అతి చౌకకు అందించేవారు. స్వేచ్ఛా విపణి ఆ ఆంక్షలను తొలగించింది. 1990-2010 మధ్య కాలంలో పశు సంపద జనాభా కోటి నుంచి నాలుగు కోట్లకు చేరింది. దీంతో పచ్చిక మైదానాలు త్వరత్వరగా అంతరించిపోసాగాయి. మరోవంక వాతావరణ మార్పుల కారణంగా మంచు తుఫానులు పెరిగి శీతాకాలానికి పశవుల మేత నిల్వ చేయాల్సిన అవసరం పెరిగింది. 2019-10 ఏడాది ఎన్నడూ ఎరుగని మంచు తుఫానులు విరుచుకు పడ్డాయి. దీంతో పశవులకు గడ్డిపరకలు, నీరు కరువయ్యాయి. వం దలు, వేల సంఖ్యలో మందలు ఆకలికి, చలికి కడతేరిపోయాయి. ఆ శీతాకాలం గడచే సరికి 14 శాతం కుటుం బాలు పశుపాలనకు స్వస్తిపలికి ఉలాన్ బేటర్ లాంటి పట్టణాల మురికివాడలకు చేరాల్సి వచ్చింది. ‘కోటీశ్వరుల’ దేశంలో జనాభాలోని ప్రతి ముగ్గురు అర్ధాకలితో, పోషకాహర లోపంతో బాధపడుతున్నవారేనని ఐరాస అంచనా. శిశు మరణాల సంఖ్య గత నాలుగేళ్లలో 35 నుంచి 45 శాతం మేరకు పెరిగింది. 1990 నాటికే మంగోలియా వాతావరణం సున్నితంగా మారింది. ఆ తదుపరి ఈగల్లా ముసిరిన అంతర్జాతీయ గుత్త కార్పొరేషన్లు చేపట్టిన విచ్చలవిడి గనుల తవ్వకాలు, పరిశ్రమలు సృష్టించిన ఉష్ణోగ్రతలు, కాలుష్యం కలిసి పరిస్థితిని పూర్తిగా విషమింపజేశాయి. మంగోలియాలోని నేటి వాతావరణ ఉత్పాతానికి గనుల సంస్థల, పరిశ్రమల దురాశే ప్రధాన కారణంగా మారింది. రాజధాని ఉలాన్ బేటర్ 13 లక్షల జనాభా ఉన్న చిన్న నగరమే. కానీ ప్రపంచంలో అతి ఎక్కువ వాయు కాలుష్య నగరం అదే. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఆ నగరంలో మరణాల రేటు 24 నుంచి 45 శాతం ఎక్కువ. నాలుగేళ్ల ప్రాయానికే గుర్రపుస్వారీ మొదలెట్టి, మందలు తోలుకుంటూ స్వేచ్ఛావిహారం చేసే మంగోలులు గనుల్లో మగ్గుతూ మొగ్గలుగానే రాలిపోవాల్సి వస్తోంది. గనుల పరిశ్రమసహా అన్ని చోట్లా మంచి ఉద్యోగాలన్నిటికీ చైనీయుల నుండి పోటీ ఎదురవుతోంది. చైనాలోని ఇన్నర్ మంగోలియా జనాభాలో 60 శాతంగా మారిన చైనీయులు మంగోలియా పట్టణాలకు వలస వస్తున్నారు. నైపుణ్యం, శక్తిసామర్ధ్యాలతో వారితో పోటీ పడలేని మంగోలులు అల్ప వేతనాల పనులకు పరిమితం కావాల్సి వస్తోంది. కొద్దిపాటి మంచి ఉద్యోగాలను చైనీ యులు, కొరియన్లు ఎగరేసుకుపోతున్నారు. దీంతో చైనా పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. చైనా మాత్రం మంగోలియా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోడానికి నానా తం టాలు పడుతోంది. చైనాతో కయ్యానికి దిగిన ఫలితంగా అరుదైన లోహాల కోసం ఆల్లాడుతున్న జపాన్ సైతం మంగోలియాను ఆశ్రయిస్తోంది. అన్నిటికి మించి అమెరికా మంగోలియాను ఎలాగైనా తన వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇరాక్, అప్ఘాన్ యుద్ధాలకు మంగోలియా కొద్ది సంఖ్యలోనే అయినా సైన్యాన్ని పంపింది. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. రష్యా గత ఐదేళ్లకాలంలో సామ, దాన, భేదోపాయాలను ప్రయోగించి మంగోలియాను మచ్చిక చేసుకోగలిగింది. అమెరికా గత అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌తో ప్రారంభించి ప్రధాన దేశాల నేతలంతా అతి కాలుష్య నగరం ఉలాన్ బేటర్‌కు ‘తీర్థయాత్రలు’ సాగిస్తున్నారు. అవినీతిమయమైన ప్రభుత్వంతో కలిసి ఎవరికి వారే ఖనిజ సంపదను కొల్లగొట్టాలన్న ఆరాటమే తప్ప... ముంచుకొస్తున్న పెను ఉత్పాతం నుంచి మంగోలియన్లను కాపాడాలన్న తపన ఎవరికీ లేదు. మంగోలియన్లు ఎలాంటి చావు చస్తేనేం నేలలోని ఖనిజ సంపదలు నిక్షేపంగానే ఉంటాయిగా? - {పపంచవ్యాప్త వార్షిక సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల కంటే మూడురెట్లు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. - గోబీ ఎడారి ఏడాదికి 10,000 చ.కి.మీ. మేర విస్తరిస్తోంది. త్వరలోనే దేశంలో 90 శాతం ఎడారిగా మారిపోయే ముప్పు పొంచి ఉంది. - 2009-10 ఏడాది మంచు తుఫానుల్లో 65 లక్షల పశువులు చనిపోయాయి. - పది పెద్ద గనుల నుంచి వెలికి తీస్తున్న ఖనిజ సంపద విలువ ఏడాదికి 1.3 నుంచి 2.75 లక్షల కోట్ల డాలర్లు -
‘యుద్ధం’ అమెరికా నైతిక హక్కు!
యుద్ధాన్ని ప్రారంభించడం లో అమెరికా చరిత్ర, గొప్ప యూరోపియన్ రాజ్యాల ప్రమాణాలతో పోలిస్తే ఏమంత ఘనమైనదేమీ కాదు. 20వ శతాబ్దాన్ని నిర్వచించే మైలు రాళ్లలాంటి మూడు ప్రపంచ యుద్ధాల (ప్రచ్ఛన్న యుద్ధాన్ని కలుపుకుని) నడుమ అది తారట్లాడిందే తప్ప, ముందుకు గంతువేసింది లేదు. అమెరికాను రెండు ప్రపంచ యుద్ధాలలోకి దించడానికి బ్రిటన్ దాన్ని బాగానే అనునయించాల్సి వచ్చింది. జర్మన్ల మహా మూర్ఖత్వం సైతం అందుకు అవసరమైందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిజాన్ని ఎదుర్కోవడంపై అమెరికా మరింత ఎక్కువ శ్రద్ధను కనబరచింది. అయితే నాటో కూటమికి, సోవియట్ యూనియన్‌కు మధ్య ఇనుప తెరను నిర్మించిన ఖ్యాతి మాత్రం విన్స్టన్ చర్చిల్ కంటే హెన్రీ ట్రూమన్కే ఎక్కువగా దక్కుతుంది. కమ్యూనిజం భయం అమెరికాను కొరియా యుద్ధంలోకి దించింది. ఆ యుద్ధం ఆగిందేగానీ ఇంకా ముగియలేదు. ఇక వియత్నాం యుద్ధం వియత్నాం షరతులకు లోబడే ముగిసింది. అమెరికన్ ఉలిపికట్టెవాదానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నిటిలోకీ అత్యంత ఉత్తమమైనది మాత్రం అనిశ్చితే. యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందే యుద్ధాన్ని ముగించడం గురించి అమెరికా ఆందోళన చెందడం సమంజసమే. యూరప్ సాగించిన వలసవాద యుద్ధాలకు నిరుత్సాహకరమైన స్పష్టత ఉంది. వాటి లక్ష్యం అధికారంలో ఉన్న సామ్రాజ్యాలను కూలదోయడం, ఆ స్థానంలో రాజప్రతినిధులను లేదా విధేయులైన మహారాజాలు, నవాబులు, షాలు, అమీర్లను ప్రతిష్ఠించడం. వాటికి భిన్నంగా ధార్మిక యుద్ధాలు లేదా కోరుకున్న భావజాలం కోసం చేసే యుద్ధాల లక్ష్యం ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే మరింత మెరుగైనదిగా మార్చడం. అలాంటి యుద్ధాల లోతు కొలవగలిగేదీ కాదు, అవి ఎలా సాగుతాయనేది నిర్ణయించగలిగేదీ కాదు. ఎందుకంటే అలాంటి యుద్ధాల్లో ఒక కాలాతీతమైన ప్రశ్నను ఎదురోవాల్సి వస్తుంది: మెరుగైనది అంటే ఖచ్చితంగా ఏది? వాస్తవానికి ఆ సంఘర్షణ మెరుగైన దానిని వాయిదా వేస్తుందా? లేక త్వరితం చేస్తుందా? ప్రచ్ఛన్న యుద్ధంతో అమెరికా మరింత ఎక్కువగా స్వతంత్ర దురాక్రమణశీలిగా మారింది. 9/11 న్యూయార్క్ ఉగ్రవాద దాడుల తదుపరి అమెరికా దురాక్రమణ తత్వాన్ని తన నైతిక హక్కుగా భావిస్తుండటం అర్థం చేసుకోగలిగేదే. విశాలమైన అర్థంలో ముస్లిం ప్రపంచంగా పిలుచుకునే ప్రాంతం నుంచి తనకు ముప్పు ఉన్నదని భావించినప్పుడల్లా అది ఆ నైతిక హక్కును ప్రదర్శిస్తోంది. ఇంతకుమునుపెన్నడూ ఏ సంప్రదాయక సంఘర్షణలోనూ చూడనంతటి భీకరంగా అమెరికా నేడు అజ్ఞాత ఇస్లామిక్ మిలిటెన్సీని వెంటాడుతోంది. ఆ అజ్ఞాత మిలి టెన్సీ నీడల్లోంచే న్యూయార్క్ జంట టవర్లపై దాడులు జరగడం అందుకు కారణం. ఇది మితిమీరిన మారణాయుధ ప్రయోగానికి, పౌర మరణాలకు, ప్రజాస్వామిక నాగరికతకు అత్యంత మౌలిక ప్రాతిపదికగా ఉండే భావాలకు తీవ్ర హాని కలగడానికి దారి తీసింది. ఇది అతి తక్కువగా యుద్ధ ఖైదీలను పట్టుకునే యుద్ధం. ప్రాణాలతో మిగిల్చినవాళ్లను గ్వాంటనామాకు పంపుతారు. మరణమే అంతకంటే నయం కావచ్చు. వెర్రిపట్టినట్టుగా అదే పనిగా శత్రువుల కోసం అన్వేషించే అమెరికాను ఎదిరించే ప్రభుత్వాలు లేదా దాని దారికి అడ్డువచ్చిన ప్రభుత్వాలు తమకు ముప్పును కొనితెచ్చుకోడానికి సిద్ధపడే ఆ పని చేయాలి. జాతీయవాదం, సామాజిక ఐక్యత, తమను తాము రక్షించుకుంటూ, అమెరికా దురాక్రణను నివారించగుకోగల శక్తిసామర్థ్యాలు వంటి విషయాలలో అవి అసాధారణమైన భద్రతను చేపట్టడం ఆవశ్యకం. అయితే అమెరికా తప్పులు చేసింది. వాటిలోకెల్లా శిఖరాయమానమైనది ఇరాక్. అంతటి భారీ విధ్వంసం లేకుండానే అది దాన్ని దారికి తెచ్చుకోగలిగేది. అమెరికా అత్యాధునిక రాజధాని నగరంలో మనకు తారసపడే పలువురితో పోలిస్తే జార్జి డబ్ల్యూ బుష్ ఏమంత ప్రతిభాపాటవాలు కలవారేమీ కాదు. పైగా ఆయన చుట్టూ ఉన్నవాళ్లు అంతకన్నా అసమర్థులు. సద్దాం హుస్సేన్ ప్రభుత్వ దుర్భలతను ఖచ్చితంగానే అంచనా వేసినా, ఆయన ఇరాకీ ప్రజలను మాత్రం చాలా తప్పుగా అంచనా వేశారు. ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక పటంపై ఇరాక్ ఇప్పుడు మబ్బులాంటి అస్పష్ట ప్రాంతంగా మారింది. ఎక్కువ యుద్ధాలను అంతం చేసిగాక, ఎక్కువ యుద్ధాలను ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న వ్యక్తిగా బరాక్ ఒబామా చరిత్రలో నిలిచిపోతారు. అయినా అయన బుష్ కారు. 9/11 దుమారం ఒబామాను వెన్నంటే ఉంది. అది ఆయనకూ తెలుసు. అది, అగ్రరాజ్యపు నౌకల ప్రయాణానికి దోహదపడేదే తప్ప, స్వదేశంలోని సొంత బలగాలపై విరుచుకుపడి, విధ్వంసం కలుగజేసే టైఫూన్ కాదని కూడా ఆయనకు రూఢిగా తెలుసు. నావికా బలాలను దాడికి అనువైన స్థానాలలో మోహరింపజేసిన తర్వాత వెనక్కుతగ్గడమంటే స్వదేశంలో తన ప్రతిష్టకు పూడ్చుకోలేని దెబ్బతగలడమేనని సైతం ఆయనకు తెలుసు. గందరగోళం కూడా ఒక సమస్యేనని గుర్తించగలిగేపాటి తెలివితేటలు ఒబామాకు ఉన్నాయి. అయితే ఆయనకు ముందటి అధ్యక్షుడు బుష్ గందరగోళంలో అవకాశం దాగి ఉన్నదని విశ్వసించేవారు. సిరియాలో తన లక్ష్యాలేమిటో ఒబామాకు తెలుసు. అయితే వాటిని సాధించాలంటే ప్రజాభిప్రాయం అనుమతించే పరిమిత యుద్ధం సరిపోదని సైతం ఆయన గుర్తించారు. అసద్ కుటుంబీకులు డమాస్కస్ వీడిపోవడం ఒబామాకు కావాలి. అయితే అందుకోసం అమెరికా సైన్యం అక్కడ కాలుమోపడం అవసరం. కలగూరగంపలాంటి, ప్రమాదకరమైన తిరుగుబాటు ముఠాలు అమెరికా నియంత్రణకు గానీ లేదా ప్రాంతీయ శక్తులైన టర్కీ, సౌదీ అరేబియా వంటి ప్రాంతీయ శక్తుల నియంత్రణకుగానీ లోబడే బాపతు కాదు. యుద్ధం కాకపోతే అమెరికాకు ఎంచుకోడానికి ఉన్న అత్యుత్తమ అవకాశం సిరియా ఆయుధ పాటవాన్ని క్షీణింపజేయడం, దాని కాల్బలాల నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడం, యుద్ధ సన్నద్ధమై ఉన్న దాని మిత్రపక్షం హిజ్బుల్లాను దెబ్బతీయడం. చివరిగానే అయినా ప్రాధాన్యంలేనిదేమీ కాని మరోపని కూడా ఉంది. అది- సిరియాకు సైనిక మిత్రులుగా రష్యా, ఇరాన్లకున్న పరిమితులు బట్టబయలయ్యేట్టు చేయడం. ఇరాన్, రష్యాలు చేయగలిగినదల్లా గర్జించడం మాత్రమే. కాబట్టి అమెరికా తాను పంపదలుచుకున్న సందేశాన్ని పంపినట్టవుతుంది. ఇరాన్, రష్యాలు స్పందించడానికి తమకు అనువైన సమయాన్ని, వారాలు లేదా నెలల్లో ఎంచుకోగలుగుతాయనేదే ఇందులో ఇమిడి ఉన్న ప్రమాదం. ఇరాన్‌కు, దాని షియా మిత్రులకు వ్యతిరేకంగా సున్నీ గగనతలాన్ని సంఘటిత పరుచుకోవడం కోసం సౌదీ అరేబియా... సిరియాలోని బషర్ అల్ అసద్ వ్యతిరేక పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. కాబట్టి రష్యా, సిరియా గగనతలాన్ని ఉపయోగించుకొని సౌదీ అరేబియాపై ప్రతీకార చర్యకు దిగవచ్చు. 9/11 ఉగ్రవాదదాడులు తీవ్రవాద సున్నీల కుట్రే. అయినాగానీ సౌదీ నేతృత్వంలో సాగుతున్న ఈ సున్నీ వ్యూహానికి అమెరికా కట్టుబడి ఉండటం ఆసక్తికరం. ఇక ఇరాన్, తర్కరహితమైన అవకాశాలను ఎంచుకునేలా దాన్ని ప్రోత్సహించడం ఒక విరోధాభాస. అస్థిరత ఆవరించిన ఆ ప్రాంతంలో ఇరాన్ సుస్థిరత అనేది అమెరికన్ వ్యూహకర్తలకు ఆందోళన కలిగిస్తూనే ఉండి ఉండాలి. సంక్లిష్టమైనదానికంటే సుపరిచితమైనదే మేలని అమెరికా ఎంచుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంపై 2014, ఆగస్టులో సెమినార్లు జోరుగా చోటుచేసుకోబోతున్నాయి. సిరియా, మధ్యప్రాచ్యాలను నేటికీ యుద్ధాలను ప్రేరేపించే విధంగా మార్చినది ఆ యుద్ధమే. ఇంకా ముగియని ఆ యుద్ధపు శతవార్షికోత్సవాలకు ఒక క్షిపణి ప్రయోగం నాంది పలుకుతుంది. అంతకంటే ఇంకా కొత్తది ఏముంది? బైలైన్ ఎం.జె.అక్బర్,సీనియర్ సంపాదకులు