Russia-Ukraine Crisis Reason: రష్యా ఉక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినప్పటికీ యుద్ధం వరకు అడుగులు పడవని అందరూ అనుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ విషయంలో తాము వెనకడుగు వేసేది లేదంటూ ఏకంగా ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ప్రపంచ దేశాలు ఇందులో జోక్యం అనవసరమంటూ గట్టి సంకేతాలే పంపారు. మొన్నటి వరకు చర్చలకు సిద్ధమన్న రష్యా అకస్మాత్తుగా మిలిటరీ ఆపరేషన్‌కి చేపట్టింది. అసలు ఈ పరిణామాలకు కారణాలేమంటే!
యుద్ధం ఎందుకు?
ఉక్రెయిన్‌ను, మాజీ సోవియట్ దేశాలను నాటోలో చేర్చుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ప్రధాన డిమాండ్. అయితే ఈ డిమాండ్‌ని అగ్రరాజ్యం అమెరికా, నాటో మాత్రం అంగీకరించలేదు. గతంలో ఉక్రెయిన్ రష్యా నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉక్రెయిన్ నాటోలో చేర్చుకుని పశ్చిమ దేశాలు రష్యాను చుట్టుముట్టేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్‌ని నాటోలో చేర్చడం వల్ల రష్యా భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని పుతిన్ వాదన. (చదవండి: Russia Ukraine War Updates: ఇక మాటల్లేవ్.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా )
అందుకే ఉక్రెయిన్‌ను నాటో చేర్చేందుకు తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే యూరప్‌లో, మా సరిహద్దుల సమీపంలో మోహరించిన నాటో సైన్యాన్ని, మధ్య శ్రేణి క్షిపణులను తగ్గించడం, సైనిక మోహరింపుల్లో, కవాతుల్లో పారదర్శకత పాటించడంతో సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు పుతిన్ సిద్ధమని చెప్పారు. తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా మరో వైపు ఉక్రెయిన్ మాత్రం నాటోలో చేరేందుకు రెడీగా ఉంది. చివరకి రష్యా కోరుకున్న విధంగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడకపోయే సరికి గురవారం పుతిన్ ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment