ఒక మహిళ గుట్టుచప్పుడూ కాకుండా చాలా తెలివిగా భర్త, అత్తగారిని ఒకేలా అంతమొందించి కటకటాలపాలయ్యింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ముంబైలో కవితా అనే మహిళ భర్త కమల్‌కాంత్‌తో కొంత కాలం విడిపోయింది. అనంతరం పిల్లలను సాకుగా చూపి భర్త వద్దకు వచ్చింది. ఇంతలో కమల్‌కాంత్ తల్లి కడుపు నొప్పి వ్యాధితో హఠాత్తుగా మరణించింది. కొద్ది నెలల తర్వాత భర్త కమల్‌కాంత్ కూడా తల్లిలా కడుపునొప్పి వ్యాధితో అనారోగ్యం బారిపడ్డాడు. ఆ తర్వాత క్రమంగా ఆరోగ్యం క్షీణించి నవంబర్ 19న మృతిచెందాడు.
పోలీసులు మొదట ఇది ప్రమాదవశాత్తు అనారోగ్యం కారణంగా మృతి చెందిన కేసుగానే భావించారు. కానీ అతని హెల్త్ రిపోర్ట్‌లో అతని రక్తంలో ఆర్సెనిక్, థాలియం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. అదీగాక అతడి రక్తంలో అసాధారణమైన పదార్థాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు కుట్రపూరితంగా చేసిన హత్యగా అనుమానించి క్రైం బ్రాంచ్‌కి అప్పగించారు. అందులో భాగంగా బాధితుడు భార్యని, అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అప్పుడే అతడి భార్య కవితా చేసిన దారుణం బయటపడింది.
ఆమె తన ప్రేమికుడు హితేష్ జైన్‌లు చిన్ననాటి స్నేహితులని, ఇద్దరు వ్యాపార కుటుంబాల నుంచి వచ్చారని పోలీసులు తెలిపారు. బాధితుడి డైట్ విషయమై విచారణ చేయగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా బాధితుడి భార్య తన ప్రియుడుతో కలిసి కమల్ కాంత్‌ను చంపాలని అతడికి ఆహారంలో విషం కలిపి ఇచ్చినట్లు తేలింది. దీంతో కవితను ఆమె ప్రియుడు హితైష్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే బాధితుడి తల్లిపై కూడా విష ప్రయోగం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఆమె కూడా అచ్చం కమల్‌కాంత్‌లాంటి అనారోగ్య లక్షణాలతో చనిపోయింది. ఆ దిశగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment