Heartmelting: Gromm Starts Crying After Seeing His Love As Bride, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్‌ కపుల్‌..

Published Thu, Dec 2 2021 8:35 PM | Last Updated on Fri, Dec 3 2021 10:52 AM

Viral Video This Bride And Grooms Emotional Wedding Video Created Stir On Social Media - Sakshi

Groom starts crying when he sees bride on wedding day: పెళ్లి రోజున గర్ల్‌ ఫ్రెండ్‌ను పెళ్లికూతురి డ్రెస్‌లో చూసి ఆనందభాష్పాలను దాచలేకపోయాడా పెళ్లికొడుకు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. అసలేంజరిగిందంటే.. 

పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న అలెగ్జాండ్రియాను చూసిన వరుడు డెమెట్రియస్‌ క్యాషరీస్‌ భావోధ్వేగంతో కన్నీరు పెట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్యూటిఫుల్‌ వైట్‌ పెవిలియన్‌ గౌను ధరించిన వధువు పుష్పగుచ్చం పట్టుకుని తండ్రితోపాటు రావడం చూసిన వరుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోతాడు. దీనిని సంబంధించిన వీడియోను మగ్నోలియా రోడ్‌ ఫిల్మ్‌ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు భిన్న కామెంట్ల రూపంలో ప్రశంజల జల్లును కురిపిస్తున్నారు. 

‘ఓమై గాడ్‌! ఈ వీడియో నన్ను కూడా  ఏడిపిస్తోంది. మీకు శుభాకాంక్షలు' అని ఒకరు, ‘ఈ వీడియో నిజమైన ప్రేమను తెలియజేస్తుంది. మీరిద్దరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. నాకు మీరు తెలియకపోయినా.. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చాలా భావోధ్వేగంతో కామెంట్‌ చేశారు. మరి మీరేమంటారు..

చదవండి: Dental Care Tips In Telugu: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా? ఐతే ఇలా చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement