![Viral Video: Dulhan Ka Bindaas Dance Bride Dances Groom Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/12/fjsklf.jpg.webp?itok=ZmxoV4nd)
పెళ్లిళ్ల సీజన్ వస్తే కళ్యాణమండపాలు ఏ విధంగా కళకళలాడుతాయో సోషల్ మీడియాలో కూడా వధువరులు వీడియోలతో నిండిపోతుంటాయ్. ఈ రోజుల్లో యువతీయువకుల వివాహ క్షణాలు వారికి చాలా ముఖ్యమైనవే కాకుండా మధురమైనవి కూడా. ఒకప్పుడంటే వాటని మనం వీడియో రూపంలో భద్రపరిచి చూసుకోవాలి. అయతే నేటి నెటిజన్ యుగంలో ఇలాంటి మధర క్షణాలున్న కొందరి వీడియోలు వైరల్‌గా మారి సోషల్ మీడియాలో కనపడుతుంటాయి. ఈ రోజుల్లో పెళ్లంటే డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. తాజాగా ఓ పెళ్లిలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట దూసుకుపోతోంది.
ఇటీవల పెళ్లిలో.. వధూవరులు ఇద్దరూ స్టెప్స్ వెయ్యాల్సిందేనంటూ బంధువులు, స్నేహితులు బలవంతంగానైనా చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... అలా అందరి ముందూ డాన్స్ చెయ్యాలంటే కొంతమంది ఇబ్బంది పడేవాళ్లు ఉన్నారు. తాజాగా ఓ వీడియోలో కూడా ఓ వరుడు డాన్స్ వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. వధువు మాత్రం అందరి ముందు డ్యాన్స్ ఇరగదీసింది. సింపుల్‌గా.. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి. ఆ వధువు డాన్స్ చూసి వరుడే కాదు... పెళ్లికి వచ్చిన వారంతా స్టన్ అయ్యారనుకోండి. అందరూ ఆమె చేస్తున్న డ్యాన్స్‌కి ఫిదా అయ్యి తన వైపే చూస్తున్నారు. వారే కాక నెటిజన్లు కూడా వధువు డ్యాన్స్ సూపర్ అంటు కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment