సోనం కపూర్‌తో చిన్నాన్న సంజయ్ కపూర్
సాక్షి, న్యూఢిల్లీ : అనిల్‌కపూర్ గారాలపట్టి సోనం కపూర్ పెళ్లి రోజు దగ్గరపడుతున్న కొద్దీ బాలీవుడ్‌లో సందడి పెరుగుతోంది. ఆమె పెళ్లిలో హంగామా కోసం డ్యాన్స్ స్టెప్‌లను ప్రాక్టీస్ చేస్తుండటం నుంచి దుస్తుల ఎంపికతో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక సోనం పెళ్లిలో డ్యాన్స్ చేసేందుకు తాను ఎంతో ఉద్వేగంగా ఎదురుచూస్తున్నానని ఆమె బాబాయి సంజయ్ కపూర్ చెబుతున్నారు. ‘20 ఏళ్ల కిందట నా పెళ్లిలో మనం డ్యాన్స్ చేశాం..ఇప్పుడు నీ పెళ్లిలో నేను డ్యాన్స్ చేయబోతున్నా’నంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను పోస్ట్ చేస్తూ సంజయ్ వ్యాఖ్యానించారు.
మే 8న సోనం, ఢిల్లీ వ్యాపారి ఆనంద్ అహుజాల వివాహ వేడుకకు కపూర్ మ్యాన్షన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుకను జరిపించేందుకు కపూర్, అహుజా కుటుంబాలు నిర్ణయించాయి. ఇక సినిమాల పరంగా సోనం కపూర్ నటించిన వీరే ది వెడ్డింగ్ మూవీ జూన్ 1న థియేటర్ల ముందుకు రానుంది. ఈ మూవీలో సోనంతో పాటు కరీనా కపూర్, స్వర భాస్కర్, శిఖా తల్సానియా స్క్రీన్‌ను పంచుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment