
సాక్షి, నిజామాబాద్: వర్ని మండలం సిద్ధాపూర్‌లో పెళ్లి వేడుకల్లో కరోనా కలకలం సృష్టించింది. గత గురువారం పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. సిద్దాపూర్‌లో మూడు రోజులుగా పరీక్షల శిబిరం కొనసాగుతోంది. ఇప్పటివరకు 370 మందికి టెస్టులు చేయగా, 86 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 865 మంది కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం.. క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.
చదవండి:
నిజామాబాద్: షాపింగ్‌మాల్‌లో 75 మందికి కరోనా!
ఎన్నికల సిత్రాలు: నిన్న ఏడుపులు.. నేడు చిందులు
Comments
Please login to add a commentAdd a comment