భిక్కనూరులో పాజిటివ్‌.. నిజామాబాద్‌లో నెగెటివ్‌ | Pregnant Woman Tests Covid Positive And Negative, Dies in Nizamabad | Sakshi
Sakshi News home page

భిక్కనూరులో పాజిటివ్‌.. నిజామాబాద్‌లో నెగెటివ్‌

Published Thu, May 27 2021 10:26 AM | Last Updated on Thu, May 27 2021 10:29 AM

Pregnant Woman Tests Covid Positive And Negative, Dies in Nizamabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,భిక్కనూరు: స్థానిక పీహెచ్‌సీలో నిండు గర్భిణి లతకు ఈనెల 24న కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటీనా తరలించారు. 25న ఉదయం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. 20 గంటల వ్యవధిలో రిపోర్టులు రెండువిధాలుగా రావడంతో లత కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు.

లత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. లత పాజిటివ్‌తో మృతిచెందిందా... నెగెటివ్‌తో మృతిచెందిందా అర్థంకాక ఆమె కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు. ఏ రిపోర్టు నిజమో, ఏ రిపోర్టు తప్పో తెలియడం లేదని మృతురాలు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: కరోనా: మార్కెట్‌లోకి 2-డీజీ డ్రగ్ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement