Pregnant woman dead
-
భిక్కనూరులో పాజిటివ్.. నిజామాబాద్‌లో నెగెటివ్
సాక్షి,భిక్కనూరు: స్థానిక పీహెచ్సీలో నిండు గర్భిణి లతకు ఈనెల 24న కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటీనా తరలించారు. 25న ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. 20 గంటల వ్యవధిలో రిపోర్టులు రెండువిధాలుగా రావడంతో లత కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు. లత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. లత పాజిటివ్‌తో మృతిచెందిందా... నెగెటివ్‌తో మృతిచెందిందా అర్థంకాక ఆమె కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు. ఏ రిపోర్టు నిజమో, ఏ రిపోర్టు తప్పో తెలియడం లేదని మృతురాలు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కరోనా: మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్ విడుదల -
మగబిడ్డ కావాలని బెదిరింపులు; ఒత్తిడి భరించలేక..
సాక్షి, కుప్పం : ఇద్దరు ఆడబిడ్డలకు జన్మనివ్వడమే ఆమె పాలిట శాపమైంది. మూడో కాన్పులోనైనా మగబిడ్డను ప్రసవించకపోతే పరిమాణాలు వేరుగా ఉంటాయని అత్తామామల బెదిరింపులు.. రెండో పెళ్లి చేసుకుంటానంటూ భర్త హుంకరింపు..ఈ వేధింపులకు తాళలేక ఓ గర్భిణి ఉరేసుకుని తనువు చాలించింది. పోలీసుల కథనం.. కుప్పం మునిసిపాలిటీలోని తంబిగానిపల్లె కోటాలుకు చెందిన కవిత (25), గోవిందరాజులు దంపతులకు రక్షిత (3), రుచిత (1) సంతానం. రెండు కాన్పుల్లోనూ ఇద్దరూ ఆడపిల్లలే జన్మించడంతో భర్తతోపాటు అత్తమామలు మునెమ్మ, నాగరాజు తరచూ వేధించేవారు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా, ఉన్నంతలో సంతోషంగా జీవిద్దామని, ఇక పిల్లలు వద్దని కవిత తన భర్తకు ఎన్నోసార్లు హితవు పలికినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. అప్పటి నుంచి అత్తింటి వేధింపులు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం 3వ నెల నిండింది. మగబిడ్డను ప్రసవించకపోతే రెండవ పెళ్లి చేసుకుంటానంటూ భర్త తరచూ వేధిస్తూండడంతో కుంగిపోయింది. ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక కవిత ఇంట్లోనే బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక కవిత మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. అనాథలైన చిన్నారులు తల్లి చనిపోయిందని గ్రహించలేని ఏడాది పైచిలుకు వయసున్న చిన్నారి రుచిత పాల కోసం ఏడుస్తుంటే చూపరులను కంటతడి పెట్టించింది. అత్తమామలు, భర్తకు మగబిడ్డపై ఉన్న మోజు చివరకు ఆమె ఊపిరి తీసిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాలింత మృతితో ఉద్రిక్తత
శ్రీకాకుళం, హిరమండలం: బాలింత మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటన మంగళవారం హిరమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుని ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ పట్టుబట్టడంతో కిలోమీటరు మేర ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. ఇదీ జరిగింది.. హిరమండలం మేజర్ పంచాయతీ సుభలయ గ్రామానికి చెందిన గర్భిణి బుడ్డి దేవీ(20) పురిటి నొప్పులతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో హిరమండలం పీహెచ్సీలో చేరింది. ఆ సమయంలో వైద్యాధికారి, సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. వాచ్‌మన్ వెళ్లి పిలవడంతో స్టాఫ్‌నర్సు ఏకాశమ్మ వచ్చి వైద్యసేవలు అందించడంతో దేవీ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం సమయంలో బిడ్డతో పాటు (మాయ) ప్లజెంటా బయటకు సకాలంలో రాలేదు. దీంతో బొడ్డును కట్ చేస్తుండగా ప్లజెంటా కడుపులోకి వెళ్లిపోయింది. వెంటనే ఈ విషయాన్ని వైద్యాధికారి సీహెచ్ మౌనికకు ఫోన్ చేసి చెప్పగా ఆమె ఆస్పత్రికి చేరుకుంది. ఇంతలో దేవీకి తీవ్ర రక్తస్రావం జరగడంతో హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చూసేసరికే దేవీ మృతిచెందింది. ఆస్పత్రిని చుట్టుముట్టిన బాధితులు.. హిరమండలం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైపోయిందంటూ దేవీ కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని హిరమండలం ఆస్పత్రి వద్ద ఉంచి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేది లేదంటూ బైఠాయించారు. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి మృతురాలి కుటుంబానికి మద్దతు పలికి ఆస్పత్రిని చుట్టుముట్టారు. దీంతో ఏబీ రోడ్డుపై కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ వి.రమేష్ సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో మాట్లాడారు. అయినా వారు ఆందోళన విరమించలేదు. కొత్తూరు, సారవకోట, పాతపట్నం, మెళియపుట్టి ఎస్ఐలు సిబ్బందితో చేరుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. వెంటనే పాతపట్నం సీఐ ప్రకాశరావు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు రహదారులపై ఆందోళన విరమించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓతో చర్చలు.. సమాచారం అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ నరేష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు వినలేదు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. వైద్యాధికారితో పాటు ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ ఇక్కడి పరిస్థితిని ఐటీడీఏ పీఓ, డీఎంహెచ్ఓలకు ఫోన్లో వివరించారు. క్షమాపణ పేరిట హైడ్రామా.. వైద్యాధికారి మౌనిక బహిరంగ క్షమాపణ చెబుతారంటూ అధికారులు ఆందోళనకారుల వద్దకు తీసుకొచ్చారు. ఇంతలోనే ఆమె కళ్లుతిరిగి పడిపోవడంతో మళ్లీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లిపోయారు. పోలీసు వాహనంలో వేరే ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాధితులు అడ్డుకున్నారు. వైద్యాధికారి క్షమాపణ చెప్పకపోవడంతో మరింతగా ఆందోళన చేపట్టారు. ఆర్టీఓ హామీ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకొండ ఆర్డీఓ ఆర్.గున్నయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యసిబ్బంది, బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యాధికారి, సిబ్బ ందిపై చర్యలు తీసుకుంటామని, కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు శాంతించి మృతదేçహాన్ని తీసుకువెళ్లారు. ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద కుటుంబం.. దేవీది పేద కుటుంబం. కుటుంబ పోషణ కోసం తండ్రి దుబాయి వెళ్లాడు. తల్లి రేణుక కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, స్వాతీలు ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. దేవీకి ఒడిశాకు చెందిన వాసుదేవరావుతో ఏడాది కిందట వివాహం చేశారు. ప్రసవం కోసం పుట్టింటికి రాగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేవీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు. శిశువును చూసి భర్త వాసు, తల్లి రేణుక, చెల్లెళ్లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
బం«ధువుల ఆరోపణ కేకేనగర్ : కడలూరు జిల్లాలో ప్రభుత్వ ఆçస్పత్రిలో అబార్షన్ చేయించుకున్న గర్భిణి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిని ముట్టడించి ఆందోళన చేశారు. కడలూరు జిల్లా బన్రుట్టి సమీపంలోని ఆండిపాళయంకు చెందిన ధనసెలియన్ కూలీ కార్మికుడు. ఇతని భార్య కళైవాణి(27). వీరికి ఇద్దరు పిల్లలు. ఈ స్థితిలో కలైవాణి మళ్లీ గర్భం దాల్చింది. ఆర్థిక స్తోమత కారణంగా భర్త సూచన మేరకు అబార్షన్‌కు కళైవాణి ఒప్పుకుంది. ఆమెను అబార్షన్ కోసం కడలూరు ప్రభుత్వ ఆçస్పత్రిలో శుక్రవారం చేర్పించారు. వైద్యులు అబార్షన్ చేశారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కళైవాణి అధిక రక్తస్రావం ఏర్పడడంతో మృతి చెందింది. సమాచారం అందుకుని కళైవాణి భర్త, ఆమె బంధువులు కడలూర్ ప్రభుత్వ ఆస్పత్రి ముందు గుమిగూడారు. ఆమె మృతదేహాన్ని తీసుకోకుండా ఆందోళనకు దిగారు. పుదునగర్ పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. విచారణలో కళైవాణికి శుక్రవారం అబార్షన్ చేశారని, అప్పటి నుంచి ఆమె కళ్లు తెరవకుండా అలాగే ఉందని, ఈ క్రమంలో సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. కళైవాణి మృతిపట్ల తమకు అనుమానం ఉందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతిచెందిందని వారు ఆరోపించారు. ఆమెకు చికిత్స చేసిన వైద్యులపై చర్యలు తీసుకుని, నష్ట పరిహారం చెల్లించే వరకు తాము ఆందోళన విరమించేదిలేదని వారు తేల్చిచెప్పారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనాన్ని కలిగించింది. -
నిండు గర్భిణి ఆత్మహత్యాయత్నం
తాండూరు రూరల్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ నిండు గర్భిణి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడింది. ఆమెను కా పాడేందుకు వెళ్లిన భర్తకు కూడా గాయాల య్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో ని నారాయణపూర్‌లో శనివారం రాత్రి చో టు చేసుకుంది. స్థానికులు, ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన లక్ష్మాపురం నవాజప్ప,భాగ్యలక్ష్మి దంపతులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి నిండు గర్భిణి. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి ఇంట్లో ఒం టిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన నవాజప్పకు కూడా గాయాలయ్యాయి. స్థా నికుల సమాచారంతో 108 వాహనంలో వారిని స్థానికులు తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఘటనపై వైద్యులు కరన్‌కోట్ ఎస్ఐ విజయ్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దాదాపు వారం రోజుల్లో కాన్పుకావాల్సిన భాగ్యలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.