నిండు గర్భిణి ఆత్మహత్యాయత్నం | Pregnant commit suicide | Sakshi
Sakshi News home page

నిండు గర్భిణి ఆత్మహత్యాయత్నం

Published Sat, Sep 5 2015 11:33 PM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM

Pregnant commit suicide

తాండూరు రూరల్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ నిండు గర్భిణి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడింది. ఆమెను కా పాడేందుకు వెళ్లిన భర్తకు కూడా గాయాల య్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో ని నారాయణపూర్‌లో శనివారం రాత్రి చో టు చేసుకుంది. స్థానికులు, ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన లక్ష్మాపురం నవాజప్ప,భాగ్యలక్ష్మి దంపతులు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి నిండు గర్భిణి. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఆమె శనివారం రాత్రి ఇంట్లో ఒం టిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడింది.

ఆమెను కాపాడేందుకు వెళ్లిన నవాజప్పకు కూడా గాయాలయ్యాయి. స్థా నికుల సమాచారంతో 108 వాహనంలో వారిని స్థానికులు తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఘటనపై వైద్యులు కరన్‌కోట్ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దాదాపు వారం రోజుల్లో కాన్పుకావాల్సిన భాగ్యలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement