Kamareddy District: కరోనాతో ఎస్‌ఐ గణపతి మృతి | Kamareddy Sub Inspector Deceased of Coronavirus | Sakshi
Sakshi News home page

Kamareddy District: కరోనాతో ఎస్‌ఐ గణపతి మృతి

Published Tue, Apr 27 2021 10:36 AM | Last Updated on Tue, Apr 27 2021 10:47 AM

Kamareddy Sub Inspector Deceased of Coronavirus - Sakshi

సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా బారినపడి మృతి చెందారు. తాజాగా కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టించింది. ఇటీవల కరోనా సోకిన ఎస్‌ఐ గణపతి(53) చికిత్స పొందుతూ మరణించారు. ఐదు రోజుల క్రితం గణపతికి జ్వరం రావడంతో కరోనా  పరీక్షలు చేయించుకున్నాడు. ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో గణపతిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరిలించారు. ఆస్పత్రిలో మూడు రోజుల పాటు గణపతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆరు నెలల క్రితం సిద్దిపేట్ నుంచి బదిలీపై గణపతి కామారెడ్డికి వచ్చారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నారు. గతంలో గణపతి కామారెడ్డిలో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐగా కూడా విధులు నిర్వహించారు.


చదవండి: మితిమీరిన కషాయాలు కాల్చేస్తాయి.. సూర్యరశ్మి తగలాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement