
న్యూఢిల్లీ: దేశంలోని 26 దీవుల సమగ్రాభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిని ప్రధాన మంత్రి మోదీ సమీక్షించారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దీవుల్లో చేపట్టిన కీలక మౌలిక ప్రాజెక్టులు, డిజిటల్ కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ, సముద్ర జలాలను మంచి నీరుగా మార్చే ప్లాంట్ల ఏర్పాటు, వ్యర్థాలు, మత్స్య పరిశ్రమ, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ప్రాజెక్టులు ఏ దశల్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో సమీకృత పర్యాటక–కేంద్రీకృత పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. దీవుల్లో సౌరశక్తి ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధంగా తయారుచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment