సూపర్‌ స్మాష్‌లో ‘సూపర్‌ మ్యాన్‌’ క్యాచ్‌ | New Zealand Cricketers One Handed Superman Catch | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్మాష్‌లో ‘సూపర్‌ మ్యాన్‌’ క్యాచ్‌

Published Sun, Jan 19 2020 1:58 PM | Last Updated on Sun, Jan 19 2020 1:58 PM

New Zealand Cricketers One Handed Superman Catch - Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ వేదికగా ముగిసిన సూపర్‌ స్మాష్‌ టీ20 లీగ్‌లో వెల్లింగ్టన్‌ విజేతగా నిలిచింది. ఆక్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ వెల్లింగ్టన్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా, ఆక్లాండ్‌ ఫీల్డర్‌ కాచోపా పట్టిన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ముందుగా వెల్లింగ్టన్‌ బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(49) మిడ్‌ ఆఫ్‌ మీదుగా షాట్‌ ఆడగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కాచోపా గాల్లోకి ఎగిరిమరీ ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.

మెక్‌లీన్‌గన్‌ బౌలింగ్‌లో పవర్‌ ఫుల్‌ డ్రైవ్‌ కొట్టాడు. అంతే వేగంగా స్పందించిన కాచోపా కాస్త ఎడంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెల్లింగ్టన్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా, ఆక్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement