![Everyone Surprises With Neil Broom's Unique Scoop Shot - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/29/Neil-Broom.jpg.webp?itok=XikIE9SD)
వెల్లింగ్టన్: ప్రపంచ క్రికెట్‌లో స్కూప్ షాట్లు కొత్తమే కాదు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొట్టిన తాజా స్కూప్ షాట్ ప్రతీ ఒక్కర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పెద్దగా శ్రమించకుండానే ఆడిన స్కూప్ షాట్ హైలైట్ అయ్యింది.శుక్రవారం న్యూజిలాండ్ లిస్ట్-ఎ క్రికెట్‌లో భాగంగా ఒటాగో-వెల్లింగ్టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఒటాగో తరఫున ఆడుతున్న నీల్ బ్రూమ్.. వెల్లింగ్టన్ కెప్టెన్ హమిస్ బెన్నిట్ వేసిన స్లో బౌన్సర్‌ను వికెట్ కీపర్ తలపై నుంచి ఫోర్‌కు పంపాడు. తన టైమింగ్‌లో ఎటువంటి పొరపాటు చేయకుండా వికెట్ కీపర్ పైనుంచి కచ్చితమైన షాట్ ఆడాడు. ఈ షాట్‌ను చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు, అభిమానులు వాటే షాట్ అనుకోవడం తమ వంతైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒటాగో ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. నీల్ బ్రూమ్(112) సెంచరీ చేయగా, మిచ్ రెన్విక్ హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ఒటాగో 262 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వెల్లింగ్టన్.. 46 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మాల‍్కమ్ నోపాల్(87), డేవాన్ కాన్వే(70)లు ఆదుకోవడంతో వెల్లింగ్టన్ గాడిలో పడింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. ఐదో వికెట్‌గా కాన్వే ఔటైన తర్వాత వెల్లింగ్టన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరి మూడు బంతులకు మూడు పరుగులు చేయాల్సిన తరుణంలో వెల్లింగ్టన్ తడబడింది. నోఫాల్ క్రీజ్‌లో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. రెన్విక్ చేసిన రనౌట్‌తో నోఫాల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒటాగో రెండు పరుగుల తేడాతో గెలిచింది. అయితే నీల్ బ్రూమ్ ఆడిన స్కూప్ షాట్‌ను ఒటాగో తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ షాట్‌ను ఎప్పుడైనా చూశారా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment