రైడర్‌పై తప్పని వేటు | Jesse Ryder: New Zealand leave batsman out of World T20 squad | Sakshi
Sakshi News home page

రైడర్‌పై తప్పని వేటు

Published Mon, Feb 17 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

రైడర్‌పై తప్పని వేటు

రైడర్‌పై తప్పని వేటు

కివీస్ టి20 ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు
 వెల్లింగ్టన్: బార్‌లో తప్పతాగి, తోటి క్రికెటర్‌తో గొడవపడి జాతీయ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ జెస్సీ రైడర్ తగిన ఫలితం అనుభవించాడు. టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన కివీస్ జట్టులో జెస్సీ రైడర్‌కు చోటు దక్కలేదు.
 
 అతని స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. బ్రెండన్ మెకల్లమ్ సారథ్యం వహించనున్న జట్టులో డేవ్‌సిచ్, ట్రెంట్ బౌల్ట్, రోనీ హీరాలకు చోటు దక్కింది. టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుండటంతో, అక్కడి పిచ్‌లకు తగ్గట్లుగానే జట్టును ఎంపిక చేసినట్లు కివీస్ చీఫ్ సెలెక్టర్ బ్రూస్ ఎడ్గార్ చెప్పాడు. జెస్సీ రైడర్ ప్రవర్తన సరిగ్గా లేని కారణంగానే అతన్ని టీమ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదని ఎడ్గార్ తెలిపాడు.
 
 న్యూజిలాండ్ జట్టు: బ్రెండన్ మెకల్లమ్(కెప్టెన్), అండర్సన్, ట్రెంట్ బౌల్ట్, డేవ్‌సిచ్, గుప్టిల్, రోనీల్ హీరా, మెక్లీనగన్, నాథన్ మెకల్లమ్, మిల్స్, మున్రో, నీషమ్, రోంచి, సౌతీ, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement