jesse ryder
-
రైడర్‌పై తప్పని వేటు
కివీస్ టి20 ప్రపంచకప్ జట్టులో దక్కని చోటు వెల్లింగ్టన్: బార్లో తప్పతాగి, తోటి క్రికెటర్‌తో గొడవపడి జాతీయ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ జెస్సీ రైడర్ తగిన ఫలితం అనుభవించాడు. టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన కివీస్ జట్టులో జెస్సీ రైడర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. బ్రెండన్ మెకల్లమ్ సారథ్యం వహించనున్న జట్టులో డేవ్‌సిచ్, ట్రెంట్ బౌల్ట్, రోనీ హీరాలకు చోటు దక్కింది. టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుండటంతో, అక్కడి పిచ్‌లకు తగ్గట్లుగానే జట్టును ఎంపిక చేసినట్లు కివీస్ చీఫ్ సెలెక్టర్ బ్రూస్ ఎడ్గార్ చెప్పాడు. జెస్సీ రైడర్ ప్రవర్తన సరిగ్గా లేని కారణంగానే అతన్ని టీమ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదని ఎడ్గార్ తెలిపాడు. న్యూజిలాండ్ జట్టు: బ్రెండన్ మెకల్లమ్(కెప్టెన్), అండర్సన్, ట్రెంట్ బౌల్ట్, డేవ్‌సిచ్, గుప్టిల్, రోనీల్ హీరా, మెక్లీనగన్, నాథన్ మెకల్లమ్, మిల్స్, మున్రో, నీషమ్, రోంచి, సౌతీ, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్. -
రైడర్, బ్రేస్‌వెల్‌లపై రెండో టెస్టుకూ వేటు
వెల్లింగ్టన్: చిత్తుగా తాగిన మత్తులో గొడవ పడిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జెస్సీ రైడర్, మీడియం పేసర్ డౌగ్ బ్రేస్‌వెల్‌లను రెండో టెస్టుకు కూడా దూరంగా ఉంచారు. భారత్‌తో తొలి టెస్టుకు ముందు వీరిద్దరు ఆక్లాండ్ బార్లో తప్ప తాగి గొడవపడిన విషయం తెలిసిందే. ఈఘటనలో రైడర్ చేతికి, బ్రేస్‌వెల్ పాదానికి గాయాలయ్యాయి. ఇరువురిపై తాజాగా విచారణ జరుగుతోంది. ‘ఈనెల 14 నుంచి జరిగే రెండో టెస్టు కోసం కివీస్ జట్టును నేడు (మంగళవారం) కానీ తర్వాత కానీ ప్రకటిస్తారు. కానీ రైడర్, బ్రేస్‌వెల్ పేర్లను మాత్రం పరిగణనలోకి తీసుకోరు’ అని జట్టు కోచ్ మైక్ హెస్సన్ తెలిపారు. 2012లో ఓసారి వీరిద్దరు జట్టు క్రమశిక్షణను అతిక్రమించినందుకు వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యారు. -
21 ఓవర్లలో 283 పరుగులు
క్వీన్స్టౌన్: టి20 క్రికెట్లో అయితే ఇది అత్యధిక స్కోరుగా రికార్డులకెక్కేది. కానీ వన్డే కావడం వల్ల పుస్తకాల్లోకి రాలేదు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చేసిన వీరవిహారం మాత్రం చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేవలం 21 ఓవర్లలో 283 పరుగులు చేశారంటే... ఆ విధ్వంసాన్ని ఊహించడం కూడా కష్టం. కోరీ అండర్సన్ (47 బంతుల్లో 131 నాటౌట్; 6 ఫోర్లు, 14 సిక్సర్లు), జెస్సీ రైడర్ (51 బంతుల్లో 104; 12 ఫోర్లు, 5 సిక్సర్లు)ల సంచలన సెంచరీలతో... వెస్టిండీస్‌తో బుధవారం క్వీన్స్టౌన్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో ఈ ఘనత సాధ్యమైంది. వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. గుప్టిల్ (1), టేలర్ (9) విఫలమైనా.. బ్రెండన్ మెకల్లమ్ (11 బంతుల్లో 33; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. అండర్సన్, రైడర్ నాలుగో వికెట్‌కు 191 పరుగులు జోడించారు. హోల్డర్ 2, నరైన్, మిల్లర్ చెరో వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 21 ఓవర్లలో 5 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. డ్వేన్ బ్రేవో (54 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. దేవ్‌నారాయణ్ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు), వాల్టన్ (17) మోస్తరుగా ఆడారు. మెక్లీంగన్ 2 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. వర్షం కారణంగా రెండో వన్డే రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగో వన్డే నీల్సన్లో శనివారం జరుగుతుంది. -
రైడర్‌పై ఆరు నెలల నిషేధం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వివాదాస్పద క్రికెటర్ జెస్సీ రైడర్‌పై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన డోపింగ్‌లో రైడర్ పాజిటివ్‌గా తేలాడు. తన అధిక బరువును తగ్గించుకునే క్రమంలో తీసుకున్న సప్లిమెంట్ నిషేధిత జాబితాలో ఉండడంతో పరీక్షలో దొరికిపోయాడు. దీంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ట్రిబ్యునల్ అతడిపై ఆరు నెలల నిషేధం విధించింది. అయితే వీటిని రైడర్ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు తీసుకోలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. కోచ్, రైడర్ సొంతంగా ఇంటర్నెట్లో పరిశోధించి తమకు తాముగా వీటిని తీసుకున్నారని చెప్పింది. అయితే ఏప్రిల్ నుంచి ఈ నిషేధం అమల్లో ఉండడంతో అక్టోబర్‌లో రైడర్ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. -
జెస్సీ రైడర్‌పై ఆరు నెలల నిషేధం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వివాదాస్పద క్రికెటర్ జెస్సీ రైడర్‌పై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన డోపింగ్‌లో రైడర్ పాజిటివ్‌గా తేలాడు. తన అధిక బరువును తగ్గించుకునే క్రమంలో తీసుకున్న సప్లిమెంట్ నిషేధిత జాబితాలో ఉండడంతో పరీక్షలో దొరికిపోయాడు. దీంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ట్రిబ్యునల్ అతడిపై ఆరు నెలల నిషేధం విధించింది. అయితే వీటిని రైడర్ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు తీసుకోలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. కోచ్, రైడర్ సొంతంగా ఇంటర్నెట్లో పరిశోధించి తమకు తాముగా వీటిని తీసుకున్నారని చెప్పింది. అయితే ఏప్రిల్ నుంచి ఈ నిషేధం అమల్లో ఉండడంతో అక్టోబర్‌లో రైడర్ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది.