వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వివాదాస్పద క్రికెటర్ జెస్సీ రైడర్‌పై ఆరు నెలల నిషేధం విధించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన డోపింగ్‌లో రైడర్ పాజిటివ్‌గా తేలాడు. తన అధిక బరువును తగ్గించుకునే క్రమంలో తీసుకున్న సప్లిమెంట్ నిషేధిత జాబితాలో ఉండడంతో పరీక్షలో దొరికిపోయాడు. దీంతో న్యూజిలాండ్ స్పోర్ట్ ట్రిబ్యునల్ అతడిపై ఆరు నెలల నిషేధం విధించింది. అయితే వీటిని రైడర్ తన ప్రదర్శన మెరుగయ్యేందుకు తీసుకోలేదని ట్రిబ్యునల్ పేర్కొంది.
కోచ్, రైడర్ సొంతంగా ఇంటర్‌నెట్‌లో పరిశోధించి తమకు తాముగా వీటిని తీసుకున్నారని చెప్పింది. అయితే ఏప్రిల్ నుంచి ఈ నిషేధం అమల్లో ఉండడంతో అక్టోబర్‌లో రైడర్ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది.