
2024-25 సీజన్‌కు గానూ క్రికెట్ న్యూజిలాండ్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ఇవాళ (సెప్టెంబర్ 3) ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోగా.. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే సాధారణ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నారు. ఆల్‌రౌండర్లు నాథన్ స్మిత్, జోష్ క్లార్క్‌సన్ సైతం తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ బెర్తులు దక్కించుకున్నారు.
న్యూజిలాండ్ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా: టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.
Comments
Please login to add a commentAdd a comment