రైడర్, బ్రేస్‌వెల్‌లపై రెండో టెస్టుకూ వేటు | Jesse Ryder, Doug Bracewell to miss second Test against India | Sakshi
Sakshi News home page

రైడర్, బ్రేస్‌వెల్‌లపై రెండో టెస్టుకూ వేటు

Published Tue, Feb 11 2014 12:36 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

రైడర్, బ్రేస్‌వెల్‌లపై రెండో టెస్టుకూ వేటు - Sakshi

రైడర్, బ్రేస్‌వెల్‌లపై రెండో టెస్టుకూ వేటు

వెల్లింగ్టన్: చిత్తుగా తాగిన మత్తులో గొడవ పడిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జెస్సీ రైడర్, మీడియం పేసర్ డౌగ్ బ్రేస్‌వెల్‌లను రెండో టెస్టుకు కూడా దూరంగా ఉంచారు. భారత్‌తో తొలి టెస్టుకు ముందు వీరిద్దరు ఆక్లాండ్ బార్‌లో తప్ప తాగి గొడవపడిన విషయం తెలిసిందే. ఈఘటనలో రైడర్ చేతికి, బ్రేస్‌వెల్ పాదానికి గాయాలయ్యాయి. ఇరువురిపై తాజాగా విచారణ జరుగుతోంది. ‘ఈనెల 14 నుంచి జరిగే రెండో టెస్టు కోసం కివీస్ జట్టును నేడు (మంగళవారం) కానీ తర్వాత కానీ ప్రకటిస్తారు. కానీ రైడర్, బ్రేస్‌వెల్ పేర్లను మాత్రం పరిగణనలోకి తీసుకోరు’ అని జట్టు కోచ్ మైక్ హెస్సన్ తెలిపారు. 2012లో ఓసారి వీరిద్దరు జట్టు క్రమశిక్షణను అతిక్రమించినందుకు వన్డే జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement