న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ ఇప్పుడు టెస్టు సిరీస్ కోల్పోకుండా కాపాడుకోగలదా!
శుక్రవారం తెల్లవారుజామున గం. 3.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ ఇప్పుడు టెస్టు సిరీస్ కోల్పోకుండా కాపాడుకోగలదా! అది అంత సులభం కాబోదు. ఎందుకంటే ఇక్కడి బేసిన్ రిజర్వ్ మైదానంలో పూర్తిగా పచ్చికతో నిండిన పిచ్ రెండో టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమైంది.
ఎక్కువ బౌన్స్ ఉండే ఈ వికెట్‌పై భారత్, కివీస్ మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఓడిన భారత్, సిరీస్ కాపాడుకోవాలంటే ఈ టెస్టు నెగ్గడం తప్పనిసరి. ఇటీవల ఇదే మైదానంలో జరిగిన కివీస్, విండీస్ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది.