బీజేపీ మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ నాయకులను దళితుల ఇళ్లను సందర్శించమని ఆదేశించగా, మరోవైపు వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రులకు కనీస గౌరవం దక్కడం లేదు. ఈ విషయాన్ని యోగి కేబినెట్‌లోని మంత్రే స్వయంగా వెల్లడించారు. మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ బహ్రైచ్ పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌ను సందర్శించినప్పుడు ఇతర మంత్రులకు ఇచ్చే గౌరవాన్ని అధికారులు తనకు ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు కారణం తాను వెనకబడిన కులానికి చెందినవాడిని కావడమే అని ఆయన వాపోయారు.
రెండు రోజుల క్రిత్రం బహ్రైచ్‌లో ఓ వివాహ వేడకకు హాజరయిన ఓంప్రకాశ్ అనంతరం పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలు ఎవరైనా సర్క్యూట్ హౌజ్‌కు సందర్శించినప్పుడు అధికారులు వారిని ప్రొటోకాల్ ప్రకారం గౌరవంగా ఆహ్వానించాలి. అయితే ఓంప్రకాశ్ సర్క్యూట్ హౌజ్ వద్దకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ ఆయనకు స్వాగతం పలకలేదు.
దీని గురించి ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘మన సమాజంలో కొన్ని వందల ఏళ్లుగా వెనకబడిన వర్గాల వారిని అవమానిస్తూనే ఉన్నారు. నేను వెనుకబడిన వర్గానికి చెందిన వాడిని కావడం వల్లే అధికారులు నన్ను పట్టించుకోలేదు. అదే ఏ ఉన్నత వర్గానికి చెందిన మంత్రో వస్తే వారు పరుగున వెళ్లి అతనికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికేవార’ని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment