అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా | Watch,Daughter Of Firefighter Wears His Helmet At Funeral | Sakshi
Sakshi News home page

అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా

Published Wed, Jan 8 2020 7:14 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

సిడ్నీ : ప్రపంచంలో ఏ పిల్లాడైనా సరే తన తండ్రి గొప్పదనం తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా మురిసిపోతారో చెప్పనవసరం లేదు. అందులోనూ దేశంకోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి విలువను అందరూ గుర్తించినప్పుడు ఆ పిల్లల ఆనందానికి అవదులు లేకుండా పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కార్చిచ్చు ధాటికి అమరుడైన తన తండ్రి అంత్యక్రియల సమయంలో అతని సాహసానికి గుర్తుగా తన 19 నెలల కూతురుకు వోడయ్యర్‌ వాడిన హెల్మట్‌తో పాటు మెడల్‌ను బహూకరించారు. వీటిని ఆ పాప ధరించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులు భావోద్వేగానికి గురవడం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో చూసిన ప్రతీ వీక్షకుడి గుండె బరువెక్కుతుంది.

వివరాల్లోకి వెళితే.. ప్రసుత్తం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్‌ ఫైటర్స్‌ తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 19న ఫైర్‌ ఫైటర్స్‌ కార్చిచ్చు నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్‌ ఇంజన్‌లో వెళ్లారు. అయితే ఒక్కసారి కార్చిచ్చు మంటలు మరింతగా వ్యాపించి వారు వెళుతున్న వాహనంపై పడడంతో అందరూ అక్కడికక్కడే మరణించారు. అందులో 36 ఏళ్ల వోడయ్యర్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను న్యూసౌత్‌ వేల్స్‌ రూరల్‌ ఫైర్‌ సర్వీస్‌ నుంచి ఫైర్‌ఫైటర్‌గా తన సేవలందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement