ఆస్ట్రేలియాను పైన నిలిపింది భారతీయులే... | narendra-modi-addresses-all-phones-arena | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 17 2014 2:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంతో సిడ్నీలో ప్రవాస భారతీయులను ఊర్రూతలూగిస్తున్నారు. ప్రధాని ప్రసంగ వివరాలు: * 200 ఏళ్ల కింద ఆస్ట్రేలియాకు కొంతమంది భారతీయు వచ్చారు. * వాళ్ల జీవనశైలిని చూసి భారతీయులు గర్వపడుతున్నారు. * నాడు ఇక్కడకు వచ్చిన భారతీయులు.. ఆస్ట్రేలియాను తమ సొంత దేశంగా చూసుకుంటున్నారు. 1964లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగినప్పుడు మక్త్వార్ సింగ్ సమురాయ్ ఆస్ట్రేలియాకు ప్రతినిధిగా వెళ్లారు. *అప్పట్లో ఒలింపిక్స్లో భారతీయుడు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడం చిన్నవిషయం కాదు. *ఆంగ్లో ఇండియన్లది కూడా ఇక్కడ చాలా ప్రముఖ పాత్ర. *రెడ్ సెలస్, స్టూవర్ట్ క్లార్క్ ఇద్దరూ ఆంగ్లో ఇండియన్లే. భారత్ నుంచి వచ్చి, ఆస్ట్రేలియాను క్రికెట్లో అగ్రస్థానంలో నిలబెట్టారు. *లీసా పుణెలో జన్మించింది. 2013 వరకు 1000 పరుగులు, 100 వికెట్లు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్. ఆమె ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. *అక్షయ్ వెంకటేశ్ 12 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్, మ్యాథ్స్ ఒలింపియాడ్లలో ఆస్ట్రేలియా పేరు నిలబెట్టాడు. *ఇంద్రా నాయుడు భారత ఆస్ట్రేలియన్. ఐక్యరాజ్యసమితిలో కూడా ఇప్పటికీ ఆస్ట్రేలియాకు సేవలు అందిస్తున్నారు. ఇంకా చాలా పేర్లున్నాయి. *భారతీయులై ఉండి, ఆస్ట్రేలియాలో ఈ దేశ పతాకాన్ని అగ్రస్థాయిలో నిలబెడుతున్నారు. *ఇదీ మన శక్తి. భారతీయులైనందుకు మనం ప్రపంచంలో ఎక్కడున్నా, అక్కడి వాళ్ల ప్రేమను పొందుతాం, వాళ్లతో కలిసి అభివృద్ధి చేస్తాం. * ఇంత సేవలు అందిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. *భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. మీ వేళ్ల మీద సిరా పడదు. మీరు ఓట్లు వేయరు. * కానీ నాకు తెలుసు.. ఆ ఎన్నికల్లో ఏ ఒక్క క్షణం కూడా మీరు దాంతో సంబంధం లేకుండా ఉండలేదు. *ఇక్కడున్న ప్రతి భారతీయ కుటుంబం ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో నిద్రలేకుండా టీవీ చూస్తూనే ఉన్నారు. *ఎవరు గెలిచారు, ఎవరు ఓడారన్న విషయం కోసం కాదు.. *ఇప్పుడు నేను ఎక్కడున్నానో.. నా దేశం ఎప్పుడు అలా అవుతుందని వాళ్లందరి గుండెలు మండిపోయాయి. *భారతదేశం ఉజ్వల భవిష్యత్తు కావాలన్న కల మాత్రమే వాళ్లకు ఉంది. *అంతేతప్ప ఎవరు గెలుస్తారన్నదాంతో వాళ్లకు సంబంధం లేదు. *వాళ్ల గుండెలు పలికింది ఒక్కటే.. భారత్ మాతాకీ జై. భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నారు. *చాలామందికి ఇప్పటికీ కరెంటు లేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా తాగడానికి మంచినీళ్లు లేవు, కనీసం మరుగుదొడ్లు కూడా లేవు. * చాలామందికి పెద్దపెద్ద పనులు చేయాలన్న కలలుంటాయి. నాకు చిన్న చిన్న లక్ష్యాలే ఉన్నాయి. * చిన్న చిన్న వాళ్ల కోసం చేయాలి, వాళ్లను పెద్ద చేయడానికి చేయాలి. *అత్యంత పేదవాళ్లు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్లడం ఎవరైనా చూశారా? ఇప్పుడు వెళ్తున్నారు. వాళ్లకూ ఖాతాలొచ్చాయి. *ప్రధానమంత్రి జనధన యోజన ద్వారా.. దేశ ఆర్థిక వృద్ధి పయనంలో వాళ్లు కూడా మనతో పాటు మందుకు నడవాలి. *దాదాపు 75 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. * నేను ఈ విషయం గురించి రిజర్వు బ్యాంకును అడిగితే.. చేయచ్చు గానీ, కనీసం మూడేళ్లు పడుతుందన్నారు. *ఆర్థికమంత్రిత్వశాఖను అడిగితే రెండేళ్లు పడుతుందన్నారు. పీఎంవో కార్యాలయం వాళ్లను పిలిచి అడిగాను. *కనీసం ఏడాది పడుతుందని వాళ్లు చెప్పారు. చివరకు.. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చెప్పేశాను. *150 రోజుల్లో పని పూర్తిచేయాలని చెప్పాను.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement