Ind Vs Sl 1st Test: It Was Jadeja Decision How Selfless He Is Says Rohit Sharma - Sakshi
Sakshi News home page

Rohit Sharma- Ravindra Jadeja: అతడు నిస్వార్థపరుడు.. మ్యాచ్‌లో తనే హైలైట్‌.. రోహిత్‌ శర్మ ప్రశంసల జల్లు

Published Sun, Mar 6 2022 8:56 PM | Last Updated on Mon, Mar 7 2022 11:26 AM

Ind Vs Sl 1st Test: It Was Jadeja Decision How Selfless He Is Says Rohit Sharma - Sakshi

Ind Vs Sl 1st Test: India Beat Sri Lanka- టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. శ్రీలంకతో టెస్టు మ్యాచ్‌ మొత్తంలో అతడే హైలెట్‌ అంటూ ఆకాశానికెత్తాడు. డబుల్‌ సెంచరీ చేసేందుకు వీలున్నా జట్టు ప్రయోజనాల కోసం నిస్వార్థంగా ఆలోచించాడని కొనియాడాడు. కాగా ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ గెలుపులో జడ్డూ భాయ్‌దే కీలక పాత్ర. తొలుత బ్యాట్‌ ఝులిపించి 175 పరుగుల(17 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించిన జడేజా.. తర్వాత బంతితోనూ చెలరేగాడు. లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్‌లో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అయితే, 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. జడేజా డబుల్‌ సెంచరీకి మరో 25 పరుగుల దూరంలో ఉండగా భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు దిగారు.

ఇక ఈ విషయంపై జడేజా ఇప్పటికే స్పష్టతనిచ్చాడు. ప్రత్యర్థి బ్యాటింగ్‌కు వస్తే తాము వికెట్లు పడగొట్టేందుకు పిచ్‌ అనుకూలిస్తుందన్న నేపథ్యంలో డిక్లేర్‌ చేయమన్నట్లు వెల్లడించాడు. మ్యాచ్‌ విజయానంతరం రోహిత్‌ శర్మ సైతం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయాలా వద్దా అన్న సందిగ్దంలో ఉన్నపుడు జడేజానే ముందుకు వచ్చి డిక్లేర్‌ చేయమని చెప్పాడన్నాడు. తను నిస్వార్థపరుడంటూ కితాబిచ్చాడు. కాగా శ్రీలంకతో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ మీద 222 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

చదవండి: Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement