శ్రీలంకతో తొలి టెస్టులో రవీంద్ర జడేజా డబుల్ సెంచరీకి 25 పరుగుల దూరంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్షంగా రోహిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినప్పటికి.. పరోక్షంగా దీని వెనకాల కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. దీనికి తోడూ 2004లో సచిన్‌ను డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్న ద్రవిడ్.. ఇప్పుడు జడేజాను మెయిడెన్ డబుల్ సెంచరీ అందుకోకుండా చేశాడంటూ సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. రోహిత్‌ను కూడా విమర్శిస్తూ కామెంట్స్ చేయడంతో వివాదం ముదిరింది.
తాజాగా జడేజా డబుల్ సెంచరీ చేయకపోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించాడు. డబుల్ సెంచరీ చేయకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం వెనుక తన పాత్ర ఉందని జడేజా స్పష్టం చేశాడు. అది తన నిర్ణయమేనని.. ఇందులో కెప్టెన్ రోహిత్.. కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర లేదని పేర్కొన్నాడు. పిచ్‌పై లభిస్తోన్న బౌన్స్, టర్న్‌ను అందిపుచ్చుకోవడం కోసం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమని నేనే సందేశం పంపానంటూ జడేజా చెప్పుకొచ్చాడు.
''అదంతా నా నిర్ణయమే. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పిచ్‌పై బౌన్స్ స్థిరంగా బౌన్స్ అవుతుంది. బంతులు తిరగడం మొదలుపెట్టడంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడం ఇబ్బందిగా మారుతోంది. అందుకే ప్రత్యర్థి బ్యాటింగ్‌కు వస్తే మాకు వికెట్లు వచ్చే అవకాశం ఉందని నేనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయమన్నా. నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొనే రోహిత్.. కోచ్ ద్రవిడ్‌తో చర్చించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అంతేకానీ రోహిత్, ద్రవిడ్‌లు నన్ను డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుపడ్డారనడంలో నిజం లేదు. ఇదే వాస్తవం. ప్రత్యర్థి ఆటగాళ్ల అలసటను తాము బలంగా మార్చుకునే నేపథ్యంలో ఇలా చేశాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక రవీంద్ర జడేజా(228 బంతుల్లో 175 నాటౌట్, 17 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయగా.. అశ్విన్ 61, హనుమ విహారి 58, కోహ్లి 45 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 58 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
చదవండి: Ravindra Jadeja: జడ్డూ డబుల్ సెంచరీ మిస్.. మళ్లీ విలన్‌గా ద్రవిడ్?!
Comments
Please login to add a commentAdd a comment