IND VS SL 2nd ODI: బంతి పట్టిన హిట్‌మ్యాన్‌.. వైరల్‌ వీడియో | Team India Captain Rohit Sharma Bowled Two Overs In Second ODI Against Sri Lanka, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IND VS SL 2nd ODI: బంతి పట్టిన హిట్‌మ్యాన్‌.. వైరల్‌ వీడియో

Published Sun, Aug 4 2024 7:04 PM | Last Updated on Sun, Aug 4 2024 7:33 PM

Team India Captain Rohit Sharma Bowled Two Overs In Second ODI Against Sri Lanka

ప్రస్తుత శ్రీలంక పర్యటనలో టీమిండియా స్పెషలిస్ట్‌ బ్యాటర్లు పార్ట్‌ టైమ్‌ బౌలర్లుగా అవతారమెత్తుతున్నారు. టీ20 సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌ బంతితో మ్యాజిక్‌ చేయగా.. తొలి వన్డేలో శుభ్‌మన్‌ గిల్‌, రెండో వన్డేలో రోహిత్‌ శర్మ బంతితో మ్యాజిక్‌ చేసే ప్రయత్నం​ చేశారు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ రెండు ఓవర్లు వేసి పర్వాలేదనిపించాడు. క్రీజ్‌లో ఇద్దరు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లు ఉండటంతో హిట్‌మ్యాన్‌ తనలోని ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ నైపుణ్యాన్ని వెలికితీశాడు. రోహిత్‌ రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చాడు. రోహిత్‌ అంతర్జాతీయ వేదికపై ఎక్కువగా బౌలింగ్‌ చేయనప్పటికీ.. ఐపీఎల్‌ మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఐపీఎల్‌లో హిట్‌మ్యాన్‌ పేరిట హ్యాట్రిక్‌ కూడా ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్‌ మెండిస్‌ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్‌ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్‌ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ 2, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement