మన చేతుల్లోకి... | On the success of India in Mohali Test | Sakshi
Sakshi News home page

మన చేతుల్లోకి...

Published Mon, Nov 28 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

మన చేతుల్లోకి...

మన చేతుల్లోకి...

మొహాలీ టెస్టులో విజయంపై భారత్ గురి
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 78/4
బ్యాటింగ్‌లో సత్తా చాటిన జడేజా, జయంత్  

భారత టెస్టు చరిత్రలో తొలిసారి ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు ఒకే ఇన్నింగ్స్  లో అర్ధ సెంచరీలు చేసిన వేళ... చివరి నలుగురు ఆటగాళ్లు కలిపి ఏకంగా 213 పరుగులు జోడించిన చోట... మన స్పిన్నర్లు వేసిన ఒక్కో బంతి ప్రత్యర్థికి ఒక్కో గండంలా కనిపిస్తున్న క్షణాన... ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మరో టెస్టు విజయానికి కోహ్లి సేన రంగం సిద్ధం చేసుకుంది. 134 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్‌‌సలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కనీసం దానికి చేరువ కూడా కాకుండానే నాలుగు వికెట్లు కోల్పోరుు ఓటమిని ఆహ్వానిస్తోంది.

మ్యాచ్ గెలిచేందుకు టాస్ గెలవడం మాత్రమే సరిపోదని ఇంగ్లండ్‌కు మొహాలీలో తెలిసొచ్చింది. భారత లోయర్ ఆర్డర్ అద్భుత బ్యాటింగ్‌ను అడ్డుకోలేక భారీ ఆధిక్యం సమర్పించుకున్న ఆ జట్టు, ఆ తర్వాత మన బౌలింగ్ ముందు నిలబడలేక మూడో రోజే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకునే స్థితిలో నిలిచింది. ఒకవేళ ప్రత్యర్థి కొంత పోరాడి చిన్నపాటి లక్ష్యం విధించినా... భారత్ అలవోకగా గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జడేజా, జయంత్ బ్యాటింగ్, అశ్విన్ బౌలింగ్ ఆటలో హైలైట్‌గా నిలిచారుు. 

మొహాలీ: టెస్టుల్లో వరల్డ్ నంబర్‌వన్ హోదాకు తగిన రీతిలో భారత జట్టు సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ప్రతీ ఇన్నింగ్స్ కూ మెరుగు పడుతూ వచ్చిన మన ఆట మరింత పదునెక్కింది. జట్టులోని ముగ్గురు ఆల్‌రౌండర్లు తమ పాత్రకు న్యాయం చేయడంతో మూడో టెస్టులో జట్టు విజయావకాశాలను మెరుగుపర్చుకుంది. మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేయగలింది. జో రూట్ (36 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు మరో 56 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ఇంగ్లండ్ దానిని అధిగమించి అదనంగా ఎన్ని పరుగులు జోడించగలదో చూడాలి. అంతకుముందు 271/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్  లో 417 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (170 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించగా... స్పిన్నర్ జయంత్ యాదవ్ (141 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం.

సెషన్-1: జడేజా జోరు
వోక్స్ వేసిన తొలి బంతికే అశ్విన్ (113 బంతుల్లో 72; 11 ఫోర్లు) కొట్టిన బౌండరీతో మూడో రోజు ఆట మొదలైంది. మొదటి అర్ధ గంటలో కొన్ని బంతులు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టి కాస్త ఉత్కంఠకు గురి చేసినా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అశ్విన్, జడేజా జాగ్రత్తగా ఆడి నిలదొక్కుకోవడంతో వీరి భాగస్వామ్యం 97 పరుగులకు చేరింది. చివరకు స్టోక్స్ తాను వేసిన తొలి ఓవర్లో అశ్విన్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. తన సహజశైలికి భిన్నంగా క్రీజ్‌లో నిలదొక్కుకుపోరుు కెరీర్‌లో తొలిసారి ఒకే ఇన్నింగ్‌‌సలో వంద బంతులు ఎదుర్కొన్న జడేజా, ఈ క్రమంలో 104 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవర్లు: 30, పరుగులు: 83, వికెట్లు: 1

సెషన్-2: రాణించిన జయంత్
లంచ్ తర్వాత కూడా జడేజా దూకుడు కొనసాగగా, మరోవైపు నుంచి జయంత్ రెగ్యులర్ బ్యాట్స్‌మన్ తరహాలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వోక్స్ వేసిన ఒక ఓవర్లో జడేజా ఏకంగా నాలుగు ఫోర్లతో చెలరేగాడు. అరుుతే కెరీర్‌లో తొలి సెంచరీకి చేరువగా వచ్చినా, దానిని అతను చేజార్చుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. జడేజా, జయంత్ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అనంతరం జయంత్ మరింత బాధ్యతాయుతంగా ఆడి 132 బంతుల్లో తన తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. స్టోక్స్ వేసిన ఒక ఓవర్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండు సునాయాస క్యాచ్‌లు వదిలేసినా, అదే ఓవర్ చివరి బంతికి జయంత్ వెనుదిరిగాడు. స్టోక్స్ తన తర్వాతి ఓవర్లో ఉమేశ్‌ను కూడా అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్‌‌స ముగిసింది.
ఓవర్లు: 24.2, పరుగులు: 63, వికెట్లు: 3

సెషన్-3: అశ్విన్ మాయ
తొలి ఇన్నింగ్‌‌సలో నిర్లక్ష్యంగా ఆడి వికెట్లు పారేసుకున్న ఇంగ్లండ్ పరిస్థితి రెండో ఇన్నింగ్‌‌సలోనూ మారలేదు. ఈసారి అశ్విన్ దెబ్బ వారిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. గాయంతో హమీద్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో కుక్, రూట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. నాలుగు బంతుల వ్యవధిలో కుక్ రెండుసార్లు (ఎల్బీడబ్ల్యూ) డీఆర్‌ఎస్ మద్దతుతో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో అంపైర్ తీర్పుపై కుక్ అప్పీల్‌కు వెళ్లాడు. అరుుతే ఆ తర్వాత చక్కటి బంతితో కుక్ (12)ను బౌల్డ్ చేసిన అశ్విన్, కొద్ది సేపటికే అలీ (5)ని కూడా పెవిలియన్ పంపించాడు. పార్థివ్ అద్భుత క్యాచ్‌కు బెరుుర్‌స్టో (15) వెనుదిరగ్గా... చివరి ఓవర్లో స్టోక్స్ (5)ను కూడా అవుట్ చేసి భారత్ మూడో రోజును విజయవంతంగా ముగించింది. ఓవర్లు: 38, పరుగులు: 78, వికెట్లు: 4

నన్ను నేను స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఊహించుకుంటూ పరుగులు చేయాల్సిన అవసరం లేదు. నేను అసలైన బ్యాట్స్‌మన్‌నే. ఇందులో కొత్తగా చెప్పేదేముంది. ఈసారి నెట్స్‌లో కాస్త ఎక్కువగా సాధన చేశాను. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో దాదాపు యాభై సగటుతో పరుగులు చేస్తూ వచ్చాను. నేను 90 పరుగులు చేయడం తొలిసారి కావచ్చేమో కానీ నేను బ్యాటింగ్ బాగా చేయగలనని నాకు తెలుసు. అందుకే తొందరపడకుండా జాగ్రత్తగా ఆడాను. భారత్ తరఫున ఆడిన ప్రతీ కీలక ఇన్నింగ్‌‌స గుర్తుంచుకోదగిందే. లార్డ్స్‌లో కూడా జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి అర్ధ సెంచరీ చేశాను. సెంచరీ కోల్పోవడం నిరాశ కలిగించలేదు. అదే షాట్‌తో నేను ఎప్పుడైనా సిక్సర్ కొట్టగలను కాబట్టి ఆ షాట్ ఆడటాన్ని తప్పు పట్టను.   -రవీంద్ర జడేజా

జడేజా ‘బ్యాట్’సాము...
మూడో రోజు చక్కటి ఇన్నింగ్‌‌స ఆడిన రాజపుత్రుడు రవీంద్ర జడేజా మరోసారి తనదైన శైలిలో కత్తిసామును ప్రదర్శించాడు. అర్ధ సెంచరీ చేయగానే బ్యాట్‌ను కత్తి తరహాలో తిప్పుతూ అభివాదం చేశాడు. తొలి సారి రెండేళ్ల క్రితం లార్డ్స్ లో ఇలా చేసిన అతను ఇటీవల కాన్పూర్ టెస్టులోనూ దానిని చూపించాడు. ‘అది రాజ పుత్రుల ట్రేడ్‌మార్క్ స్టరుుల్. గ్రౌండ్‌లోకి నేను కత్తిని తీసుకురాలేను కాబట్టి అలా చేస్తాను’ అని వ్యాఖ్యానించిన ‘సర్’ జడేజా కాలి షూస్‌పై కూడా రాజ్‌పుత్ అని ముద్రించి ఉండటం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement