టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం (మార్చి 3) హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన లోకల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో నడుస్తున్న పలు అంశాలపై స్పందించాడు. బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదంపై ఆయన మాట్లాడుతూ.. సమస్య తలెత్తినప్పుడు కాయిన్‌కి ఒక వైపే చూడకూడదని, సమస్యను అలాగే చూస్తూ పోతే అద్భుతాలు సాధించలేమని కోహ్లికి పరోక్షంగా మద్దతు పలికాడు.
విరాట్ చాలా గొప్ప ఆటగాడని, అతనితో సుదీర్ఘ ప్రయాణంలో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు. కోహ్లి వందో టెస్ట్ కోసం యావత్ భారతంతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 100 టెస్ట్‌లు ఆడటం ఆషామాషీ విషయం కాదని, కోహ్లికి మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని, ఈ క్రమంలో అతను మరిన్ని అద్భుతాలు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టంగా ఉందని, వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చాడు. తెలుగు రాష్ట్రాల నుంచి హనుమ విహారి, మహ్మద్ సిరాజ్‌లకు మంచి భవిష్యత్తు ఉందని, వారిరువురు ఇదివరకే వారి మార్కు ప్రభావం జట్టుపై చూపారని కొనియాడాడు. ఎంతటి ఆటగాడైనా టీమిండియాలో కొనసాగలంటే మంచి పర్ఫార్మెన్స్ చూపాల్సిందేనని, యువ క్రికెటర్లు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలంటే పట్టుదల, శ్రమ, క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించాడు.
చదవండి: IND VS SL 1st Test: ఒత్తిడిలో విరాట్..? ప్రాక్టీస్ సెషన్స్‌లో ఆరుసార్లు క్లీన్ బౌల్డ్..!
Comments
Please login to add a commentAdd a comment