భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్లేయర‍్లను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తారు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేసింది. దీంతో, టీం ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అయితే, ఇంగ్లాండ్- టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక, భారత జట్టు 98 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన దశలో టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. భారత జట్టు స్కోర్ బోర్డును జడేజాతో కలిసి ముందుకు తీసుకెళ్లాడు.
కాగా, పంత్ 146 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్‌లో అవుట్ అయిన విషయం తెలిసిందే. ఇక, మొదటి రోజు మ్యాచ్ హైలెట్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యూట్యూబ్‌లో పెట్టింది. కానీ, దానికి టైటిల్.. మాత్రం ఇంగ్లాండ్ జట్టును పొడుగుతున్నట్టుగా రాసుకొచ్చింది. రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన రూట్ అని ఇచ్చింది. ఇక ఈ టైటిల్‌ను చూసిన దినేష్ కార్తీక్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై సెటైర్స్ వేశాడు.
కార్తీక్ ట్విట్టర్ వేదికగా.. ‘‘రిషబ్ పంత్ అటువంటి ఆకట్టుకునే అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ బోర్డు ఇంతకంటే మంచి టైటిల్ పెట్టవచ్చు. కానీ, రెండు జట్లు ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత కూడా ఇంగ్లాండ్ బోర్డుకు మంచి టైటిల్ రానట్లుంది” అని రాసుకొచ్చాడు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అనంతరం.. ఎవరు మంచి ప్రదర్శ చేస్తారో వార పేరునే టైటిల్స్ పెడతారు. కానీ, ఈసీబీ మాత్రం అలా చేయకపోవడంతో దినేశ్ కార్తీక్ ఇలా కౌంటర్ అటాక్ ఇచ్చాడు.
After such an engrossing, enthralling days play, I'm sure the headline can be much better and apt than this @ECB_cricket
— DK (@DineshKarthik) July 2, 2022
That knock by @RishabhPant17 land the quality of test cricket played by both sides were as good as it can be and this is how you sum up a day 🤔#ENGvIND pic.twitter.com/T51tBycL6W
ఇది కూడా చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే బ్రాడ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!
Comments
Please login to add a commentAdd a comment