ఇంద్రకీలాద్రి: మహిళల గదిలో కెమెరాలు | CC cameras found in womens dressing rooms in vijayawada | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రి: మహిళల డ్రెస్సింగ్‌రూంలో కెమెరాలు

Published Mon, Jun 25 2018 3:48 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

CC cameras found in womens dressing rooms in vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈరోజు ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి బయటపెట్టింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కెమెరాలకు కనెక్షన్‌ ఇవ్వలేదని, అంతేకాకుండా మూడు రోజుల నుంచి పనిచేయడం లేదని అంటున్నారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement