‘యాషెస్’ ఆనందంలో ఇంగ్లండ్ క్రికెటర్ల వికృత చేష్టలు | English cricketers behave ugly after yashes win | Sakshi
Sakshi News home page

‘యాషెస్’ ఆనందంలో ఇంగ్లండ్ క్రికెటర్ల వికృత చేష్టలు

Published Tue, Aug 27 2013 3:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

‘యాషెస్’ ఆనందంలో ఇంగ్లండ్ క్రికెటర్ల వికృత చేష్టలు

‘యాషెస్’ ఆనందంలో ఇంగ్లండ్ క్రికెటర్ల వికృత చేష్టలు

 లండన్: ఇంగ్లండ్ ఆటగాళ్ల విపరీత ప్రవర్తన మరోసారి బయటపడింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నెగ్గిన ఆనందంలో ఒళ్లు మరిచి ప్రవర్తించి క్రీడా లోకానికి తలవంపులు తెచ్చారు. యాషెస్ సిరీస్ గెలిచిన సంబరంలో మునిగిన ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్‌లో పార్టీ చేసుకున్న అనంతరం గ్రౌండ్‌లోకి చేరారు. అక్కడంతా చీకటిగా ఉన్నా మందు తాగారు. కెవిన్ పీటర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ఈ ముగ్గురు ఆటగాళ్లు మరింత ముందుకెళ్లి పిచ్‌పై మూత్రం పోశారు. ఈ సమయంలో దీనిని మిగతా ఆటగాళ్లు ప్రోత్సహిస్తూ కనిపించారు. ఇదంతా ప్రెస్ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జర్నలిస్టులు గమనించారు.
 
  మ్యాచ్ ముగిసిన ఐదు గంటల అనంతరం ఈ సంఘటన జరిగినట్టు వారు తెలిపారు. పిచ్‌పై కూర్చుని క్రికెటర్లు బీరు తాగుతున్న ఫొటోను వికెట్ కీపర్ మాట్ ప్రయర్ ట్విట్టర్‌లో పెట్టాడు. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై బ్రిటన్ క్రీడా మంత్రి హ్యూజ్ రాబర్ట్‌సన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామని అన్నారు. కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించినప్పటికీ ఈ ఒక్క సంఘటన వారికి మచ్చ తే నుంది. క్యురేటర్ కామ్ సదర్లాండ్ కూడా పిచ్ సహజంగా కనిపించలేదని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement