england players
-
'పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే రండి.. లేదంటే వద్దు'
టీ20 వరల్డ్‌కప్-2024కు సమయం దగ్గరపడుతుండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్-2024 నుంచి వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టోప్లీ (ఆర్సీబీ) సామ్ కుర్రాన్ (పంజాబ్ కింగ్స్) స్వదేశానికి పయనమయ్యారు.టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు మే 22 నుంచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 10 రోజుల ముందే స్వదేశానికి రావాలని తమ ఆటగాళ్లను ఈసీబీ ఆదేశించింది. అయితే ప్లే ఆఫ్స్‌కు ముందు స్టార్ ప్లేయర్లు ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడం ఆ జట్లకు పెద్ద ఎదరుదెబ్బగానే చెప్పుకోవాలి. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టులో బట్లర్ లేని స్పష్టంగా కన్పించింది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే మే 17న సీఎస్కేతో డూ ఆర్‌డై మ్యాచ్‌లో తలపడనుంది. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విల్ జాక్స్.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం కావడం కచ్చితంగా ఆర్సీబీపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్ పూర్తికాకుండానే మధ్యలోనే వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ‘‘ఉంటే పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ ఫైరయ్యాడు. -
ఇంగ్లండ్ యువ ఆటగాడి విధ్వంసం.. సరిపోని ఇమాద్ వసీం మెరుపులు
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎనిమిదో సీజన్ తొలి మ్యాచ్‌లో ఫకర్ జమాన్ బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. కరాచీ కింగ్స్‌తో నిన్న (ఫిబ్రవరి 14) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ బ్యాటర్, ఇంగ్లండ్ యువ ఆటగాడు కొహ్లెర్ కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్.. కొహ్లెర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (50 బంతుల్లో 92; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. కొహ్లెర్ మెరుపులకు, కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్యాధ్యతాయుతమైన ఫిఫ్టీ తోడవ్వడంతో పెషావర్ భారీ స్కోర్ సాధించగలిగింది. కరాచీ బౌలర్లలో మీర్ హమ్జా, అండ్రూ టై, ఇమ్రాన్ తాహిర్, బెన్ కట్టింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరాచీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీం (47 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చేలరేగినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. ఇమాద్‌కు వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం తోడైనప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖరి ఓవర్లో కరాచీ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఇమాద్, బెన్ కట్టింగ్ (9) 13 పరుగులు చేయగలిగారు. ఆఖరి బంతిని ఇమాద్ భారీ సిక్సర్‌గా మలచినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పెషావర్ బౌలర్లలో వాహబ్ రియాజ్, జేమ్స్ నీషమ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ ఇర్షాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 15) ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర ప్లేయర్ ఔట్
టీ20 వరల్డ్‌కప్-2022 కీలక దశలో ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మలాన్ గజ్జల్లో గాయం కారణంగా టీమిండియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నవంబర్ 1న శ్రీలంకతో జరిగిన గ్రూప్-1 రెండో సెమీస్ డిసైడర్ మ్యాచ్‌లో గాయపడిన మలాన్.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. టీమిండియాతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు ఫిట్‌గా లేడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. మలాన్ స్థానాన్ని ఫిల్ సాల్ట్ రీప్లేస్ చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, పొట్టి క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లలో ముఖ్యుడై మలాన్.. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటలేకపోయాడు. ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదురైన మ్యాచ్‌లో చేసిన 35 పరుగులే అతని అత్యధిక స్కోర్‌గా ఉంది. టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ నుంచి ఆరో స్థానానికి పడిపోయిన మలాన్ జట్టులో లేకపోవడం ఇంగ్లండ్ విజయావకాశాలపై తప్పక ప్రభావం చూపుతుందని ఆ దేశ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, గ్రూప్-1 నుంచి రెండో సెమీస్ బెర్త్ ఖారారు చేసుకున్న ఇంగ్లండ్.. నవంబర్ 10న టీమిండియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. -
ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా కానున్న స్టార్ ప్లేయర్లు వీరే..!
Most Of England Players Including Gayle To Skip IPL 2022: ఐపీఎల్ 2022 సీజన్‌కి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు సామూహికంగా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి జరగబోయే మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. కొందరు ఇంగ్లండ్ క్రికెటర్లు మాత్రం లీగ్‌పై అనాసక్తి కనబర్చారు. వేలం కోసం 30 మంది ఇంగ్లండ్ ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. జో రూట్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్ వంటి స్టార్ క్రికెటర్లు దూరంగా ఉన్నారు. అయితే బెయిర్ స్టో, టామ్ కర్రన్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్ వంటి ప్లేయర్లు ఐపీఎల్ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సైతం క్యాష్ రిచ్ లీగ్‌కు డుమ్మా కొట్టాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్‌లో కొనసాగుతున్న గేల్.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఐపీఎల్ మెగా వేలం కోసం తన పేరు నమోదు చేసుకోలేదని సమాచారం. కాగా, వీరితో పాటు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఐపీఎల్‌పై అనాసక్తి కనబర్చాడు. తొలుత అతను లీగ్‌లో పాల్గొంటానని ప్రకటించినప్పటికీ.. నిర్ణీత గడువు సమయానికి పేరును నమోదు చేసుకోలేదు. ఇదిలా ఉంటే, వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్డ్ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్క్యాప్డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్ (29), అఫ్ఘానిస్థాన్ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్ (15), యూఎస్ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్ (1), స్కాట్లాండ్ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చదవండి: IPL 2022: మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టేది వీళ్లే.. -
ఇంగ్లండ్ ప్లేయర్లకు ఐపీఎల్ సెగ..!
Mike Atherton: యాషెస్ సిరీస్ 2021-22లో దారుణంగా విఫలమవుతున్న ఇంగ్లండ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ దేశ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ ఐపీఎల్‌ను కార్నర్ చేసి ఇంగ్లీష్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్లో ఆడడం కోసం కొందరు ఆటగాళ్లు దేశ బాధ్యతలను పణంగా పెడుతున్నారని విరుచుకుపడ్డాడు. క్యాష్ రిచ్ లీగ్ సహా ఇతర లీగ్‌ల్లో ఆడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం కాకూడదని, ఇలా జరగకుండా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చర్యలు తీసుకోవాలని ఆయన సూచించాడు. జేసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌లు ఐపీఎల్ కారణంగానే గాయాలపాలై జాతీయ జట్టుకు దూరమాయ్యరని ప్రస్తావించాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా.. రొటేషన్ విధానంలో ఏదో ఒక టోర్నీలో ఆడే విధంగా ఈసీబీ షెడ్యూల్ ప్రిపేర్ చేయాలని ఓ కాలమ్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఇంగ్లండ్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి రూట్‌ను తప్పించి బెన్‌స్టోక్స్‌కు అప్పగిస్తే సత్ఫలితాలు రాబట్టొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ సిల్వర్‌వుడ్‌ను సైతం సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్ స్ట్రాటజీ వరకు కెప్టెన్, కోచ్‌లు దారుణంగా విఫలమవుతున్నారని మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూసిన సంగతి తెలిసిందే. చదవండి: రెండో టెస్ట్‌కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి -
ఆ మూడు ఐపీఎల్ జట్లకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం
దుబాయ్: సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు కళ తప్పనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇంగ్లీష్ మీడియా కథనాలు. వివరాల్లోకి వెళితే.. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ముగ్గురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు దూరం కానున్నట్లు బ్రిటీష్ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. సన్‌రైజర్స్ కీలక ఆటగాడు జానీ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు క్రిస్ వోక్స్.. మలిదశ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సదరు ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆటగాళ్ల గైర్హాజరీపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పందిచాల్సి ఉంది. కాగా, ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. చదవండి: ఈసారి టైటిల్ నెగ్గేది మేమే: డీసీ స్టార్ ప్లేయర్ -
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాల్ టాంపరింగ్ చేసిందా?
లార్డ్స్: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జిడ్డు బ్యాటింగ్ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో ట్విటర్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో మొహాలు చూపించకపోవడంతో ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది. ఇక వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ... ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ ఎలా రియాక్టవుతుందో చూడాలి. ఇక క్రికెట్లో బాల్‌టాంపరింగ్ ఉదంతం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది ఆసీస్ ఆటగాళ్లు. 2018 కేప్‌టౌన్ టెస్ట్‌లో సాండ్ పేపర్ విధానంతో బెన్ క్రాప్ట్ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ ఉదంతంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హస్తం కూడా ఉందని తెలియడంతో వారిద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించిన ఐసీసీ బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. టాపార్డర్ విఫలమైన వేళ రహానే, పుజారాలు నెమ్మదైన ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 64 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పుజారా (33, 180 బంతులు), రహానే( 33, 106 బంతులు) క్రీజులో ఉన్నారు. https://t.co/2CqnuowAqq — GurPreet ChAudhary (@GuriChaudhary77) August 15, 2021 -
వాళ్లు నిజంగా జాత్యహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
న్యూఢిల్లీ: ఇంగ్లీష్ క్రికెటర్ ఓలీ రాబిన్సన్ ఎపిసోడ్‌పై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించాడు. రాబిన్సన్ ఎనిమిదేళ్ల కిందట చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించాడు. అతని విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) నిర్ణయం సరైందేనని, మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై జీవితకాల నిషేదం విధించాలని ఈసీబీని కోరాడు. ఈ సందర్భంగా రాబిన్సన్ను వెనకేసుకొచ్చిన వారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. గతంలో తాను లాంకషైర్ కౌంటీకి ప్రాతినిధ్యం వహించే రోజుల్లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ఇంగ్లీష్ వాళ్లు భారతీయుల పట్ల అహంకారులుగా వ్యవహరించే వాళ్లని తెలిపాడు. వాళ్లు అప్పుడు ఇప్పుడు మన యాసను ఎగతాలి చేస్తున్నారని, వాళ్లలో జాత్యాంహంకారం బుసలు కొడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అయితే తరచూ బ్లడీ ఇండియన్స్ అంటూ సంబోధించేవాడని, అలాంటి వాడిని మన వాళ్లే అందలమెక్కించారని వాపోయాడు. ఈ విషయంలో ఇంగ్లీష్ క్రికెటర్ల తర్వాత ఆసీస్ ఆటగాళ్లుంటారని, వాళ్లు కూడా భారతీయుల పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తారని పేర్కొన్నాడు. ఒకప్పుడు మనపై వివక్ష చూపిన వాళ్లంతా ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమా అని మన బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారని, వాళ్ల నిజస్వరూపమేంటో తనకు తెలుసునని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన రాబిన్సన్.. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఆసియా వాసులు, ముస్లింలపై జాతి వివక్ష ట్వీట్లు చేశాడన్న ఆరోపణలపై ఈసీబీ అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: క్రికెట్ చరిత్రలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే అత్యుత్తమం -
జీతాల కోతకు ఇంగ్లండ్ క్రికెటర్లు ఓకే
లండన్: కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు, సిరీస్‌లు జరగక... పర్యటనలు లేక చాలా క్రికెట్ బోర్డులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. దీంతో పలు బోర్డులు జీతాల కోత విధిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదనకు ఆ దేశ క్రికెటర్లు సమ్మతించారు. కోవిడ్ వల్ల ఇప్పటికే ఈసీబీ 100 మిలియన్ యూరోల (రూ. 874 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టం వచ్చే ఏడాదికి రెట్టింపు (రూ. 1,748 కోట్లు) కానుందని ఈసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ అనివార్యమని భావించిన బోర్డు ఇప్పటికే 62 మంది ఉద్యోగులకు బైబై చెప్పింది. అలాగే ఆటగాళ్ల కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజుల కోతకు సిద్ధపడింది. ఈ మేరకు ఆటగాళ్ల సంఘం ముందు ప్రతిపాదన పెట్టగా తాజాగా ఆటగాళ్లు 15 శాతం కోతకు అంగీకరించారు. దీంతో ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తమ టీమ్ ఇంగ్లండ్ ప్లేయర్ల పార్ట్నర్షిప్ (టీఈపీపీ–ఇది ప్లేయర్ల అసోసియేషన్)కు అభినందనలు తెలిపారు. ‘ఆటగాళ్లతో బోర్డు బంధం ఎంతో ధృడమైనది. మా ఆటగాళ్ల సేవలకు గుర్తింపు ఇస్తాం. ఈ కష్టకాలంలో ఆటగాళ్లు కనబరిచిన పరిణతికి మా అభినందనలు, టెస్టు, వన్డే కెప్టెన్లు రూట్, మోర్గాన్, ఆటగాళ్లు అందరూ సవాళ్లను స్వీకరిస్తూనే బాధ్యతల్ని పంచుకుంటున్నారు’ అని గైల్స్ కొనియాడారు. టీఈపీపీ చైర్మన్ రిచర్డ్ బెవాన్ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో ఆటగాళ్లంతా బోర్డుకు అండగా నిలవాలనుకోవడం గొప్ప విషయమని అన్నారు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో మధుర క్షణం
-
కామన్వెల్త్ వేదికగా ఎంగేజ్మెంట్.. వైరల్
గోల్డ్ కోస్ట్ : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో చెప్పలేం. ప్రేమను గెలుపించుకున్న ఆనందం ఒకరిదైతే.. తన మనసుకు నచ్చినవాడే ఎదురొచ్చి ప్రపోజ్ చేస్తే ఆ సంతోషమే వేరు. ప్రస్తుతం అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలాంటి మధుర క్షణం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆ దేశానికి చెందిన ఇద్దరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కామన్వెల్త్ గేమ్స్‌ను తమ జీవితాల్లో మరచిపోలేని వేడుకకు వేదికగా చేసుకున్నారు. బాస్కెట్ బాల్ పురుషుల జట్టుకు చెందిన జామెల్ అండర్సన్, ఆ దేశ బాస్కెట్ బాల్ మహిళల జట్టుకు చెందిన జార్జియా జోన్స్‌కి ప్రపోజ్ చేశాడు. బాస్కెట్ బాల్ విభాగంలో కామెరూన్ జట్టుపై విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ జట్టు సభ్యుడు అండర్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ జోన్స్‌కి మోకాలిపై కూర్చోని సినిమా సీన్లను తలపించేలా.. తన ప్రేమ విషయాన్ని తెలిపాడు. అతడి లవ్ ప్రపోజల్‌కు జోన్స్ ఒకే చెప్పగానే అండర్సన్ తోటి క్రీడాకారుల సమక్షంలో ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి ఉద్వేగానికి లోనయ్యాడు. తన తోటి క్రీడాకారులు చేసిన ఏర్పాట్ల వల్లే ఇంత చక్కగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయగలిగానని అండర్సన్ తెలిపాడు. వీరి నిశ్చితార్థంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. కామన్వెల్త్ వేదికగా జరిగిన వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇంగ్లండ్ బాస్కెట్‌బాల్ టీమ్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రీడాకారులు వీరికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు. -
‘యాషెస్’ ఆనందంలో ఇంగ్లండ్ క్రికెటర్ల వికృత చేష్టలు
లండన్: ఇంగ్లండ్ ఆటగాళ్ల విపరీత ప్రవర్తన మరోసారి బయటపడింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నెగ్గిన ఆనందంలో ఒళ్లు మరిచి ప్రవర్తించి క్రీడా లోకానికి తలవంపులు తెచ్చారు. యాషెస్ సిరీస్ గెలిచిన సంబరంలో మునిగిన ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూమ్‌లో పార్టీ చేసుకున్న అనంతరం గ్రౌండ్లోకి చేరారు. అక్కడంతా చీకటిగా ఉన్నా మందు తాగారు. కెవిన్ పీటర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ఈ ముగ్గురు ఆటగాళ్లు మరింత ముందుకెళ్లి పిచ్‌పై మూత్రం పోశారు. ఈ సమయంలో దీనిని మిగతా ఆటగాళ్లు ప్రోత్సహిస్తూ కనిపించారు. ఇదంతా ప్రెస్ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జర్నలిస్టులు గమనించారు. మ్యాచ్ ముగిసిన ఐదు గంటల అనంతరం ఈ సంఘటన జరిగినట్టు వారు తెలిపారు. పిచ్‌పై కూర్చుని క్రికెటర్లు బీరు తాగుతున్న ఫొటోను వికెట్ కీపర్ మాట్ ప్రయర్ ట్విట్టర్లో పెట్టాడు. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై బ్రిటన్ క్రీడా మంత్రి హ్యూజ్ రాబర్ట్సన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామని అన్నారు. కోచ్ ఆండీ ఫ్లవర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించినప్పటికీ ఈ ఒక్క సంఘటన వారికి మచ్చ తే నుంది. క్యురేటర్ కామ్ సదర్లాండ్ కూడా పిచ్ సహజంగా కనిపించలేదని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.