టీ20 వరల్డ్‌కప్-2024కు సమయం దగ్గరపడుతుండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్-2024 నుంచి వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టోప్లీ (ఆర్సీబీ) సామ్ కుర్రాన్ (పంజాబ్ కింగ్స్) స్వదేశానికి పయనమయ్యారు.
టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు మే 22 నుంచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 10 రోజుల ముందే స్వదేశానికి రావాలని తమ ఆటగాళ్లను ఈసీబీ ఆదేశించింది.
అయితే ప్లే ఆఫ్స్‌కు ముందు స్టార్ ప్లేయర్లు ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడం ఆ జట్లకు పెద్ద ఎదరుదెబ్బగానే చెప్పుకోవాలి. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టులో బట్లర్ లేని స్పష్టంగా కన్పించింది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే మే 17న సీఎస్‌కేతో డూ ఆర్‌డై మ్యాచ్‌లో తలపడనుంది.
గత కొన్ని మ్యాచ్‌ల నుంచి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విల్ జాక్స్.. సీఎస్‌కేతో మ్యాచ్‌కు దూరం కావడం కచ్చితంగా ఆర్సీబీపై ప్రభావం చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో సీజన్ పూర్తికాకుండానే మధ్యలోనే వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ‘‘ఉంటే పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ ఫైరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment