![Dressing Room Culture is the Key To Chennai Succes : MS Dhoni - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/23/Dhoni.jpg.webp?itok=Ao71Wwrz)
సాక్షి, హైదరాబాద్ : వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోని, తమ విజయాలకు అసలు కారణాన్ని బయటపెట్టాడు. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి ప్లేఆఫ్స్‌లో ఓటమి నుంచి తప్పించుకొని ధోని సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మిస్టర్ కూల్ మీడియాతో మాట్లాడుతూ తమ గెలుపుల వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు.
జట్టు నిలకడగా రాణించడానికి కారణాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ధోని వెల్లడించాడు. ఈ ఐపీఎల్‌లో తమకు మంచి జట్టు ఉందని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏళ్ల తరబడి ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నామని, దాని కారణంగానే విజయాలు దక్కుతున్నాయని తెలిపాడు. ఇదంతా జట్టు మేనేజ్‌మెంట్, స్టాఫ్‌కే దక్కుతుందని వెల్లడించాడు. వారి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదని అన్నాడు.
సన్‌రైజర్స్ బౌలర్లపై మిస్టర్ కూల్ ప్రసంశల జల్లు కురిపించాడు. రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు. హైదరాబాద్‌కు ఇద్దరు సరైన సమయంలో వికెట్లు తీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడం ద్వార తమపై వత్తిడి పెంచారని అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో మ్యాచ్ ఎలా గెలవాలో నేర్చుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు తన జట్టు బౌలర్లపై కూడా ధోని పొగడ్తలు గుప్పించాడు. ఆదివారం జరిగే టైటిల్‌పోరులో మరింత రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment