AP: గర్ల్స్‌ హాస్టల్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన | Seshadri Rao Gudlavalleru Engineering College Students Protests Over Secret Camera Videos | Sakshi
Sakshi News home page

Gudlavalleru College Incident: గర్ల్స్‌ హాస్టల్‌లో సీక్రెట్‌ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన

Published Fri, Aug 30 2024 8:39 AM | Last Updated on Fri, Aug 30 2024 12:08 PM

Seshadri Rao Gudlavalleru Engineering College Students Protests

సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు.

వివరాల ప్రకారం.. గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్‌ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి విజయ్‌ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిలు.. మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు విద్యార్థినిలు నిరసనల్లో పాల్గొన్నారు.

 

 

ఈ ఘటనకు కారణమైన విజయ్‌ను అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినిలు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ.. వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి.. వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్‌ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, విజయ్‌ను విచారించిన తర్వాత.. అతడి ల్యాప్‌ ట్యాప్‌, సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విద్యార్థినిలకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement