Shah Rukh Khan Emotional When He Met Aryan: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అతడికి బెయిల్ రాలేదు. దీంతో షారుక్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారాం. ఈ నేపథ్యంలో తొలిసారిగా కొడుకు ఆర్యన్‌ను చూసేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లిన షారుక్..దాదాపు 18నిమిషాల వరకు మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో కొడుకు పరిస్థితి తల్లి షారుక్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. చదవండి: షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌కు డ్రగ్ డీలర్లతో లింకులు?
ఈ క్రమంలో..సరిగ్గా తింటున్నావా అని షారుక్ అడగ్గా..జైలు భోజనం బాగోలేదని ఆర్యన్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో కొడుకు కోసం ఇంటి భోజనం పంపించొచ్చా అని షారుక్ జైలు అధికారులను అడగ్గా..ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్లు తెలుస్తుంది. జైళ్లో ఆర్యన్ సరిగ్గా తినడం లేదని, అంతేకాకుండా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆర్యన్ ఆరోగ్య పరిస్థితిపై షారుక్ ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు తెలిపారు.
చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్!
షారుక్ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వూ
Comments
Please login to add a commentAdd a comment