చీటింగ్ కేసులో అరెస్ట్ అయి అర్థర్ రోడ్డు జైల్లో శిక్ష అనుభవిస్తున్న నబజీత్ నారాయణదాస్ (26) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని ఆ జైలు ఉన్నతాధికారులు గురువారం ముంబైలో వెల్లడించారు. ఉదయం జైలు గదిలో నారాయణదాస్ విగత జీవుడుగా పడి ఉండటాన్ని జైలు సిబ్బంది కనుగొని, జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జైలు అధికారులు వైద్యులను తీసుకుని తరలివచ్చారు.
ఉదయం 4.30 గంటలకు నారాయణదాస్ తీవ్ర గుండె నొప్పితో మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు. దాంతో అతని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే పోస్ట్మార్టం నివేదిక అందితే కాని నారాయణదాస్ మృతికి గల కారణాలు తెలియవని జైలు అధికారులు తెలిపారు. అసోం రాష్ట్రానికి చెందిన నారాయణదాసును చీటింగ్ కేసులోముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. అనంతరం అతడిని జూన్ 26న అర్థర్ జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అర్థర్ జైల్లో ఖైదీ మృతి
Published Thu, Aug 8 2013 4:17 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement
Advertisement