
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్‌పై రెండు భారీ వాహనాలు బ్రేక్‌డౌన్ కారణంగా నిలిచి పోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో దాదాపు 13 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్ మార్గాల్లో భారీ ఎత్తున వాహనాల రద్దీ ఉందని ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణం చేసేవారు.. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి జనం రోడ్లపైన నిరీక్షిస్తున్నారు. కాగా, ఘటనపై స్పందించిన సీపీ అంజన్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితి సమీక్షిస్తున్నామనీ, బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను వెంటనే తొలగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment