greenlands
-
సముద్రాల గుండె చప్పుడు విందాం!
వాషింగ్టన్: వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో ముంపు భయం వెంటాడుతోంది. వీటన్నింటికి మానవుల అత్యాశే కారణమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సముద్రాల గుండె ఘోష వినేందుకు ఐర్లాండ్‌కు చెందిన కళాకారిణి సియోభాన్ మెక్‌డొనాల్డ్ నడుం బిగించారు. సముద్రాల అడుగు భాగంలో సంభవించే భూకంపాలు, విరిగిపడే కొండ చరియలు, జీవజాలం మనుగడ, కాలుష్యం, కరిగిపోతున్న మంచు గురించి సమగ్రంగా తెలుసుకొనేందుకు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సముద్రం వివిధ ప్రాంతాల్లో మైక్రోఫోన్లు(హైడ్రోఫోన్స్) జార విడుస్తున్నారు. ఇందుకోసం గ్రీన్‌ల్యాండ్, కెనడా మధ్య ఉన్న డెవిస్ అఖాతాన్ని ఎంచుకున్నారు. ఇప్పటిదాకా 12 మైక్రోఫోన్లను జారవిడిచారు. ఈ ప్రయోగానికి అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ మైక్రోఫోన్లు రెండేళ్లపాటు సముద్రంలోనే ఉంటాయి. 2024లో బయటకు తీస్తారు. ఇవి ప్రతి గంటకోసారి సముద్ర అడుగు భాగంలోని శబ్దాలను స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ శబ్దాలన్నింటిని కలిపి ఒక ఆడియోను రూపొందిస్తారు. ఇది ‘సముద్ర జ్ఞాపకం’గా మెక్‌డొనాల్డ్ అభివర్ణించారు. వాతావరణ మార్పులు, పర్యావరణ విపత్తుల విషయంలో ఇదే మొట్టమొదటి సైన్స్, ఆర్ట్స్ ఉమ్మడి ప్రయోగమని చెబుతున్నారు. సముద్రాల గుండె చప్పుడు వినడం ద్వారా భూమిపై సమీప భవష్యత్తులో సంభవించే విపరిణామాలను ముందే అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రయోగం ఒక టైమ్ క్యాప్సూల్ లాంటిదేనని మెక్‌డొనాల్డ్ అన్నారు. పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తనను ఈ ప్రయత్నానికి పురికొల్పిందని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌లో పెద్ద ఎత్తున మంచు పేరుకొని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకం ఆపేసినా సరే గ్రీన్‌ల్యాండ్‌లో 110 క్వాడ్రిలియన్ టన్నుల మంచు కరిగిపోయి సముద్ర మట్టం 27 సెంటీమీటర్లు(10.6 అంగుళాలు) పెరుగుతుందని అంచనా. -
హైదరాబాద్‌లో 13 కిలో మీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్‌పై రెండు భారీ వాహనాలు బ్రేక్‌డౌన్ కారణంగా నిలిచి పోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో దాదాపు 13 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్ మార్గాల్లో భారీ ఎత్తున వాహనాల రద్దీ ఉందని ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణం చేసేవారు.. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి జనం రోడ్లపైన నిరీక్షిస్తున్నారు. కాగా, ఘటనపై స్పందించిన సీపీ అంజన్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితి సమీక్షిస్తున్నామనీ, బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను వెంటనే తొలగిస్తామన్నారు. -
గ్రీన్‌ల్యాండ్ కరిగిపోతే ఏమవుతుంది?
గ్రీన్‌ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఏడాదిలో ఎక్కువకాలం తెల్లటి మంచు పొరలతో తళతళ మెరిసిపోతుంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ దీవిలో ఏడాదికి 350 గిగా టన్నుల మంచు కరిగిపోతోంది. దానిలో సగభాగం మంచు కరగిపోవడం వల్ల మరో సగభాగం మంచుకొండలు సముద్రంలోకి కుంగిపోవడం వల్ల జరుగుతోంది. 1990 నుంచి 2000 వరకు మంచు కరగడం, కూడుకోవడం మధ్య సమతౌల్యత ఉండేది. అంటే ఏడాదికి ఎంత మంచు కూడుతుందో అంతే మంచు కరిగిపోయేది. 2000 సంవత్సరం నుంచి ట్రెండ్ మారిపోయింది. అంటే కూడుతున్న మంచుకన్నా కరగిపోతున్న మంచే ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా మంచు కూడుకోవడం శీతాకాలంలో జరుగుతుంది. కరగిపోవడం వేసవిలో జరుగుతుంది. ఎప్పుడూ గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరగిపోవడం మే నెలలో ప్రారంభమయ్యేది. ఈసారి ఏప్రిల్ లోనే ప్రారంభమైంది. ఎప్పుడూ ఏప్రిల్ నెలలో అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలు ఉండగా, ఈసారి జీరో డిగ్రీలు మాత్రమే ఉంది. ఆర్కిటిక్‌లోని ఆల్ప్స్ మంచు పర్వతాల కన్నా ఆరు రెట్లు వేగంగా అక్కడి మంచు కరగుతోంది. కరగుతున్న మంచును రెండు రకాలుగా కొలుస్తారు. ఒకటి గ్రేస్ శాటిలైట్ ద్వారా మంచు కరగుతున్న శాతాన్ని అంచనావేస్తారు. సముద్రంలో కలుస్తున్న మంచు ఫలకల మందాన్ని నాసా శాస్త్రవేత్తలు తమ శాటిలైట్ ద్వారా కనుగొని సముద్రంలో కలుస్తున్న మంచు శాతాన్ని అంచనావేస్తారు. వచ్చే ఏడాది గ్రీన్‌ల్యాండ్‌లో మరింత వేగంగా మంచు కరగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు రకాలుగా అది వేగవంతం అవుతుంది. 2030 నాటికి భూతాపోన్నతి రెండు డిగ్రీల సెల్సియస్ పెరగడం వల్ల మంచు కరిగితే ఇప్పటికే మంచు ఫలకల కరగి పలుచబడడం పర్యవసానంగా సూర్య కిరణాల నుంచి ఎక్కువ వేడి వేడి ఎక్కువగా తగిలి మంచు కరగే ప్రక్రియ వేగవంతమవుతుంది. మంచు ఫలకలు మందంగా ఉండడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వెనక్కి ప్రతిఫలించి విశ్వంలో కలసిపోతాయి. మంచు తరిగిపోవడం వల్ల, మంచ పలకలు పలచబడడం వల్ల సూర్యకిరణాలు మంచు పొరల్లోకి చొచ్చుకుపోయి వేడి ఎక్కువగా తగులుతుంది. మంచు కరిగితే కలిగే నష్టం ఏమిటీ? గ్రీన్‌ల్యాండ్‌లోని మంచంతా కరిగి సముద్రంలో కలిస్తే భూగోళంపైనున్న సముద్రాల మట్టాలు ఆరు మీటర్లు పెరుగుతాయి. ఫలితంగా భారత్‌లోని ముంబై, కోల్‌కతా నగరాలతోపాటు షాంఘై, తియాంజిన్, హాంకాంగ్, ఢాకా, జకార్త, తాయ్జౌ నగరాలు దాదాపు సగం సముద్రంలో మునిగిపోతాయి. ఆయా నగరాల్లో నివసిస్తున్న 13 కోట్ల మంది ప్రజలపై చొచ్చుకువచ్చే సముద్రాల ప్రభావం ఉంటుంది. మంచు కరగుతున్న శాతాన్ని వారం వారం రికార్డు చేసేందుకు ఇప్పుడక్కడ ఓ ఆటోమేటిక్ లాబరేటరీని ఏర్పాటు చేశారు.