సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపైకి ఎక్కిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా విఫలమైందని ప్రజలు భావిస్తున్నారని, ఈ కార్యక్రమంపై పాలకులు పునరాలోచించాలని రాహుల్ వ్యాఖ్యానించారు. వారణాసి నుంచి ఢిల్లీ తిరిగివస్తున్న ట్రైన్ 18 బ్రేక్ డౌన్ అవడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అహోరాత్రులు కృషి చేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్ 18పై రాహుల్ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతమైందని, కోట్లాది భారతీయుల జీవితాల్లో భాగంగా మారిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మీ కుటుంబంఅభివృద్ధి కోసం ఆలోచించేందుకు తీసుకున్న ఆరు దశాబ్దాల సమయం సరిపోలేదా అంటూ గోయల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment