సాక్షి, న్యూఢిల్లీ: సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుకు సంబంధించిన అద్భుత దృశ్యాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. రైలు వెళ్తున్నప్పుడు దాని ప్రతిబింబం నీటిపై కన్పించిన ఈ దృశ్యం సుందరంగా ఉంది. పట్టాలపై, నీటిపై రెండు ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నట్లు కళ్లను మాయచేసేలా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'వాట్ ఏ క్యాప్చర్' అంటూ మాండవీయ దీన్ని షేర్ చేయగా.. ఇతర బీజేపీ నేతలు, నెటిజన్లు కూడా వీడియో చాలా బాగుందంటూ కొనియాడారు.
What a Capture! #VandeBharat pic.twitter.com/r60CxAPfVm
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 9, 2023
కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ ఈ వీడియోపై స్పందిస్తూ అన్‌స్టాపబుల్ అంటూ ప్రశంసించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించడంలో భారత్ కమిట్‌మెంట్‌కు ఈ వీడియో గొప్ప ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు. స్పీడు నుంచి సదుపాయాల వరకు భారత ఇంజనీరింగ్, సాంకేతికత శక్తి సామర్థ్యాలకు వందేభారత్ రైలు ఓ తార్కాణమన్నాడు. ఈ రైలు స్పీడు పెంచితే బుల్లెట్ రైలులా కన్పిస్తుందని మరో యూజర్ స్పందించాడు.
చదవండి: మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ
Comments
Please login to add a commentAdd a comment