సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ల ద్వారా లాభాలను అర్జిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ వేదికగా శనివారం గట్టిగా కౌంటరిచ్చారు. ఎవరైతే దేశాన్ని దోచుకున్నారో వారికి సబ్సిడీలు లాభాలుగా కనిపిస్తున్నాయని గోయల్ విమర్శించారు. అయితే శనివారం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంపై కరోనా మహమ్మారి అనే మబ్బు దట్టంగా కమ్ముకుంది. ప్రజలు అష్టకష్టాలూ పడుతన్నా ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా 429.90 కోట్ల లాభాలను ఆర్జించిందని ట్వటర్‌లో వేదికగా రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
అయితే రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను ప్రకటించగా, వలస కార్మికులు తమ గమ్య స్థానాలకు చేరడానికి శ్రామిక ప్యాసింజర్ రైళ్లల్లో ఉచితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన విషయాన్ని గోయల్ గుర్తు చేశారు. కాగా సోనియా చేసిన ఉచిత రైల్వే టికెట్లను ఎప్పుడు ఇస్తారోనని ప్రజలు అడుగుతున్నారని గోయల్ తెలిపారు. (చదవండి: నూరుశాతం సమయపాలన సాధించిన రైల్వేలు)
Comments
Please login to add a commentAdd a comment