looting
-
కనీవినీ ఎరగని కార్చిచ్చుతో అల్లాడిపోతోంటే... మారువేషాల్లో దారుణం!
లాస్ ఏంజిల్స్‌లో రగిలిన కార్చిచ్చు అమెరికాను అతలాకుతలం చేసింది. కనీవినీ ఎరుగని ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కనిపించకుండాపోయారు. సుమారు 50వేల ఎకరాలు నాశనమైపోయాయి. 12వేల నిర్మాణాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు సోషల్ మీడియా యూజర్లు,ఇతర దాతలు విరాళాలకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంత జరుగుతుంటే..ఘోర విపత్తు మధ్య జనం అల్లాడి పోతుంటే.. కనీస మానవత్వం మరిచిన కేటుగాళ్లు తన వక్రబుద్ధి చూపించిన దారుణ ఘటనలు వార్తల్లో నిలిచాయి.ఘోరమైన మంటల మధ్య అగ్నిమాపక సిబ్బందిలా మారువేషంలో దోపీడీలకు తెగబడ్డారు కొంతమంది కేటుగాళ్లు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా, మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఆదివారం (జనవరి 12) కనీసం 29 మంది అరెస్టులు జరిగాయని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా ధృవీకరించారు. ఇంట్లో దొంగతనం చేస్తుండగా ఒకరిని పట్టుకున్నట్టు చెప్పారు. 25 అరెస్టులు ఈటన్ ఫైర్ ప్రాంతంలో జరగగా, మరో నాలుగు పాలిసాడ్స్ ఫైర్ ప్రాంతానికి సమీపంలో జరిగాయి.20250112 LOS ANGELES COUNTY CAWildfiresLA County District Attorney Nathan Hochman- Looting, Arson and Use of Drones- Scams: Internet Fundraising, Price Gouging, Bogus Government Benefits pic.twitter.com/qabZDXLaHN— Robert Waloven (@comlabman) January 12, 2025ఇదీ చదవండి: లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!ఈ నేపథ్యంలో భద్రతరీత్యా దోపిడీని అరికట్టడానికి ప్రభావిత ప్రాంతాలకు 400 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. సోమవారం సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ వరకు అమలులో ఉంటుందని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. మరోవైపు మంటల్లో చిక్కుకున్న బ్రెంట్‌వుడ్‌లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం సమీపంలో కర్ఫ్యూ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం మరిన్ని అరెస్టులు జరిగాయని కూడా అధికారులు వెల్లడించారు. -
‘కరోనా’ దోపిడీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల పేరుతో ప్రైవేట్ ల్యాబ్‌లు బాధితులను దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధరల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నాయి. తాజాగా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గినా, తెలంగాణలో మాత్రం తగ్గిన ధరలు అమలు కావట్లేదు. ఆ మేరకు తక్కువ వసూలు చేయాలన్న ఆదేశాలనూ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఇవ్వలేదు. ఇదే అదనుగా ప్రైవేట్ లేబొరేటరీలు తక్కువ ధరకు కిట్లను కొని ఎక్కువ ధరకు టెస్టులు చేస్తుండటంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసినందుకు రూ. 3 వేలపైనే వసూలు చేస్తున్నారు. మరోవైపు పీపీఈ కిట్ల ధరలను కూడా అధికంగా వేస్తూ లేబరేటరీలు సహా ఆసుపత్రులు బాధితుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. అలాగే కరోనా రోగులు వాడే రెమిడెసివీర్ ఇంజక్షన్ ధర కూడా మార్కెట్లో తగ్గినా, పాత ధరనే ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ప్రైవేట్‌లో 50చోట్ల ఆర్టీపీసీఆర్ పరీక్షలు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 చోట్ల, ప్రైవేట్ లేబొరేటరీల్లో 50 చోట్ల ఆర్టీపీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. 1,200 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పాజిటివ్‌గానే పరిగణిస్తారు. అందులో నెగెటివ్ వచ్చి, కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్ట్పీసీఆర్ పరీక్ష చేయాలన్నది భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిబంధన. దీంతో ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలున్నవారు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు బాధితులు ప్రైవేట్ లేబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ లేబరేటరీల్లో రోజూ 2,500 నుంచి 3 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. 90 శాతం ధరలు తగ్గినా.. తగ్గని దోపిడీ కరోనా విజృంభించిన కొత్తలో ఒక్కో ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.2,500 ఖర్చయ్యేది. దేశంలో రెండు మూడు కంపెనీలే కరోనా నిర్ధారణ కిట్లను తయారుచేయడం, డిమాండ్ ఎక్కువుండటంతో కిట్ల ధరలు ఆ స్థాయిలో ఉండేవి. పైగా చాలా తక్కువచోట్ల పరీక్షలు జరిగేవి. తెలంగాణలో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం మొదట్లో పుణేకు కారులో శాంపిళ్లను పంపించేవారు. తర్వాత గాంధీ వైరాలజీ లేబొరేటరీల్లో కరోనా పరీక్షలు మొదలయ్యాయి. ఆపై ప్రభుత్వం ప్రైవేట్ల లేబ్ల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షలకు అనుమతిచ్చింది. అప్పటికి కిట్ల ధరలు కాస్తంత తగ్గడంతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షకు ప్రభుత్వం రూ.2,200 ధర నిర్ధారించింది. ఇంటికి వచ్చి శాంపిళ్లు తీసుకెళ్లి టెస్ట్చేస్తే రూ.2,800 వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అయినా కొన్ని లేబ్లు పీపీఈ కిట్ ధరను కూడా కలిపి రూ.4 వేల వరకు వసూలు చేసేవి. ప్రస్తుతం కూడా రూ.3,500 వరకు వసూలు చేస్తున్న లేబొరేటరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ కిట్లను దేశంలో దాదాపు 180 కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అవన్నీ పోటీపడి బిడ్లు వేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కిట్ల ధర రూ.250కి పడిపోయిందని వైద్య ఆరోగ్య వర్గాలే చెబుతున్నాయి. అంటే ఒకప్పుడు సుమారు రూ.2,500 ఉన్న కిట్ ధర, ఇప్పుడు రూ.250కి పడిపోయింది. అంటే 90 శాతం మేర కిట్ల ధరలు తగ్గాయన్నమాట. దీంతో కేంద్రం గతంలో రూ.2,200 ఉన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫీజును రూ.950కి తగ్గించింది. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రైవేట్ లేబొరేటరీలు రూ.2,800 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నాయి. అంతేగాక ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ ధర ఒకప్పుడు రూ.504 వరకు ఉండగా, ఇప్పుడు రూ.275కు తగ్గింది. కానీ అనుమతి లేకున్నా కొన్ని ప్రైవేట్ లేబొరేటరీలు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తూ రూ.2 వేలపైనే వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ కిమ్మనడం లేదు. రెమిడెసివీర్ ధర వెయ్యి తగ్గుదల ఆసుపత్రుల్లో చేరే కరోనా రోగులకు వైరస్ తీవ్రతను బట్టి రెమిడెసివీర్ ఇంజక్షన్ ఇస్తారు. గతంలో దీని ధర రూ.3 వేలు ఉండగా, ఇప్పుడది రూ.2 వేలకు తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కొన్ని ఆసుపత్రులు మాత్రం పాత ధర కాదు కదా రూ.4 వేలకు మించి వసూలు చేస్తున్నాయని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతెందుకు పీపీఈ కిట్ ధర మొదట్లో రూ.600 వరకు ఉండేది. ఇప్పుడది రూ.250 నుంచి రూ.300 మధ్యకే దొరుకుతుంది. కానీ ఆసుపత్రులు మాత్రం రూ.600 నుంచి రూ.1,000 వరకు పీపీఈ కిట్ ధర ఫీజులో కలిపి బిల్లు వేస్తున్నాయి. ఇక రూ.200 – రూ.250 ఉండే ఎన్–95 మాస్క్ ధర ఇప్పుడు రూ.13కి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రుల్లో రూ.250 వరకు ఫీజులో కలిపి చూపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ లేబొరేటరీల్లో సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసినప్పుడు బాధితులు తప్పనిసరిగా ఎన్–95 మాస్క్ ధరించాల్సిందేనంటూ రూ.250 వసూలు చేస్తున్నాయి. ఇక త్రీలేయర్ సర్జికల్ మాస్క్ ధర గతంలో రూ.8 నుంచి రూ.10 వరకు ఉండగా, ఇప్పుడు వాటి ధర 80 పైసలకు పడిపోయింది. అయినా ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీలు మాత్రం పాత ధరలనే వసూలు చేస్తూ కరోనా బాధితుల్ని పిండేస్తున్నాయి. ఔను.. కిట్ల ధరలు తగ్గాయి కరోనా కిట్ల ధరలు దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గాయి. ఆర్టీపీసీఆర్ కిట్ ధర రూ.250కి, ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల ధర రూ.275కి తగ్గింది. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా చేస్తున్నందున తగ్గిన ధరల ప్రకారమే కిట్లను కొనుగోలు చేస్తాం. దీనివల్ల ప్రభుత్వం కిట్లకు అధికంగా సొమ్ము కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక రెమిడిసివీర్ ఔషధం, ఎన్–95 మాస్క్‌లు, సర్జికల్ మాస్క్‌ల ధరలు భారీగా తగ్గాయి. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు: రూ.కోటికి పైగా వసూలు
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తామని నకిలీ కేటాయింపు లేఖలతో నమ్మించి రూ.లక్ష లు వసూలు చేస్తున్న ముఠాను దుండిగల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.72,80,000 నగదు,తాడేపల్లి గూడెంలోని ప్లాటు డాక్యుమెంట్, నకిలీ డబుల్ బెడ్రూమ్ కేటాయింపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. సెక్రటేరియట్లో పరిచయాలున్నాయని... వెంకట సత్యకృష్ణ వరప్రసాద్ అనే వ్యక్తి దుండిగల్ ఠాణా పరిధిలోని బహూదూర్‌పల్లిలోని ఓ వైన్స్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా ఓ ఇద్దరు వ్యక్తులు డబుల్ బెడ్రూమ్ కేటాయింపు నకిలీ లేఖలపై చర్చిస్తుండటాన్ని గుర్తించాడు. దీంతో అతను వారితో మాట్లాడి సదరు లేఖ ను తన సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం నకిలీ లేఖలు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన బౌరంపేటకు చెందిన వెంకట్‌ను సంప్రదించి అదే తరహాలో లేఖలను తయారు చేయించాడు. అనంతరం అదే ప్రాంతంలో ఉంటున్న తన బంధువు మురళీ కృష్ణ మూర్తిని కలి సి తనకు సెక్రటేరియట్లో మంచి పరిచయాలున్నాయని డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మురళీకృష్ణ తన స్నేహితుడు ఇపూరి వెంకటేశ్వర రాజును పరిచయం చేశాడు. అనంతరం వెంకటేశ్వరరాజు, తన బంధువు కలెపల్లి పద్మదుర్గకు ఈ విషయాన్ని చెప్పాడు. ఇలా తమకున్న పరిచయాల ద్వారా ఒక్కో డబుల్ బెడ్రూమ్కు రూ.1,20,000 నుంచి రూ1,70,000 వరకు వసూలు చేశారు. వసూళ్లలోనూ కమీషన్.. పద్మ 38 మంది నుంచి రూ.47,60,000 వసూలు చేసింది. అందులో తన కమీషన్ రూ.5,80,000 మినహాయించుకొని రూ.44 లక్షలు వెంకటేశ్వరరాజుకు ఇచ్చింది. ఇదే తరహాలో వెంకటేశ్వరరాజు రూ.53,57,000 వసూలు చేశాడు. ఇందులో తన కమీషన్ రూ.6,98,700 మినహాయించుకొని మిగిలిన సొమ్మును వెంకట కృష్ణమూర్తి వరప్రసాద్‌కు అందజేశాడు. ఇలా 89 మంది పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇళ్లు మంజూరు కాకపోవడంతో కొంపల్లికి చెందిన తులసమ్మ ఫిబ్రవరి 5న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంతో పాటు ఇతర సిబ్బందిని సీపీ రివార్డులతో సత్కరించారు. -
షికాగోలో భారీగా లూటీలు: చెలరేగిన హింస
వాషింగ్టన్ : అమెరికా షికాగో నగరంలో మరోసారి అల్లర్లు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజామున వందల మంది యువకులు వీధుల్లోకి వచ్చి వీరంగం సృష్టించారు. వాణిజ్య సముదాయాల్లోకి చొరబడి లూటీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పరిస్థితిని అదుపు చేసేందుకు జరిగిన కాల్పుల్లో ఒక పౌరుడు, సెక్యూరిటీ గార్డుతోపాటు సుమారు 13 మంది అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు హల్ చల్ చేశాయి. (వైట్‌హౌజ్ పరిసరాల్లో కాల్పుల కలకలం) మాగ్నిఫిసెంట్ మైల్ తోపాటు, ఇతర ప్రాంతాల్లో సాయుధులైన వందలమంది దుండగులు షాపులు, హోటళ్లలోకి చొరబడి, షాపుల కిటీకీలను ధ్వంసం చేశారు. గంటల తరబడి విధ్వంసానికి తెగబడి భయోత్పాతం సృష్టించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పలు ఆంక్షలను విధించారు. ఇది నేరపూరిత సంఘటన అని పోలీస్ సూపరింటెండెంట్ డేవిడ్ బ్రౌన్ తెలిపారు. పోలీసులు ఒక నిరాయుధ యువకుడిని కాల్చి చంపారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అల్లర్లు చెలరేగాయన్నారు. అతను పోలీసులపై కాల్పులు జరపడంతో తాము తిరిగి కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు చెప్పారు. తాజా ఘటనలో100 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఐదు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై షికాగో మేయర్ లోరీ లైట్ఫుట్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హింసను తీవ్రంగా ఖండించారు. నిందితులను తక్షణమే గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ కొంతమంది ఆందోళనకు దిగారు. -
‘వారికే సబ్సిడీలు లాభాలుగా కనిపిస్తాయి’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్ల ద్వారా లాభాలను అర్జిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ వేదికగా శనివారం గట్టిగా కౌంటరిచ్చారు. ఎవరైతే దేశాన్ని దోచుకున్నారో వారికి సబ్సిడీలు లాభాలుగా కనిపిస్తున్నాయని గోయల్ విమర్శించారు. అయితే శనివారం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంపై కరోనా మహమ్మారి అనే మబ్బు దట్టంగా కమ్ముకుంది. ప్రజలు అష్టకష్టాలూ పడుతన్నా ప్రభుత్వం రైల్వే శాఖ ద్వారా 429.90 కోట్ల లాభాలను ఆర్జించిందని ట్వటర్లో వేదికగా రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అయితే రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను ప్రకటించగా, వలస కార్మికులు తమ గమ్య స్థానాలకు చేరడానికి శ్రామిక ప్యాసింజర్ రైళ్లల్లో ఉచితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన విషయాన్ని గోయల్ గుర్తు చేశారు. కాగా సోనియా చేసిన ఉచిత రైల్వే టికెట్లను ఎప్పుడు ఇస్తారోనని ప్రజలు అడుగుతున్నారని గోయల్ తెలిపారు. (చదవండి: నూరుశాతం సమయపాలన సాధించిన రైల్వేలు) -
భూమాతకు తూట్లు.. పచ్చనేతలకు కోట్లు
సాక్షి, అమరావతి : ‘తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చు..’ననిఓ కవి నాడు ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ నేడది నిజం అని నిరూపిస్తున్నారు పచ్చ పాలకులు.. ఇసుక, నీరు, మట్టి, చెట్లు..ఏదైతేనేం దోచుకోవడానికని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు.. నింగి సాక్షిగా భూమాతకు తూట్లు పొడుస్తూ జేబులు నింపుకుంటున్నారు.. జనమేమనుకుంటారన్న కనీస స్పృహ లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.. ‘నీరు – చెట్టు’ అంటూ ఆ రెండూ లేకుండా చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు.. పోలవరం ప్రాజెక్టులో 11.69 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాలి. గత ఐదేళ్లలో కనీసం మట్టి పనులు కూడా సర్కార్ పూర్తి చేయలేకపోయింది. కానీ నీరు–చెట్టు పథకం కింద 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీత పనులు పూర్తి చేసింది. అంటే.. పోలవరం ప్రాజెక్టులో మట్టి పనుల పరిమాణం కంటే 687 శాతం అధికంగామట్టి పనులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇంతకూ ఆ మట్టి ఏమైందనేగా మీ అనుమానం..? ప్రజాధనంతో పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్‌కు సగటున కనిష్టంగా రూ.500 చొప్పునటీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు అమ్మేసి దోచుకున్నారు. ఒక్క పూడిక తీసిన మట్టిని అమ్ముకోవడం ద్వారానే రూ.45,955 కోట్లకుపైగా కొల్లగొట్టారు. దోపిడీ అక్కడితో ఆగిపోలేదు.. చెరువుల కట్టలు, తూములకు మరమ్మతులు చేయకుండా చేసినట్లు.. గతంలో చేసిన పనులను తాజాగా చేసినట్లు.. పాత చెక్ డ్యామ్‌లకు పైపైన సిమెంటు పూత పూసి.. కొత్తగా నిర్మించినట్లుచూపి రూ.16,291.35 కోట్లు దోచుకున్నారు. పూడిక తీసిన మట్టి ద్వారా రూ.45,955కోట్లు, పనుల్లో రూ.16,291.35కోట్లు వెరసి రూ.62,246.35కోట్ల మేర దోపిడీ చేశారు.ఈ ఘరానా దోపిడీకి నీరు–చెట్టు పథకం కేంద్రమైంది. తిమిరి ఇసుమున తైలంబు పిండవచ్చునో లేదో గానీ పూడిక తీసిన మట్టి ద్వారా రూ.62,246.35 కోట్లు దోచుకున్న తీరు ఇదీ.. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకం కింద వేలాది కోట్ల ప్రజాధనాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెట్టింది. రాష్ట్రంలో చిన్న నీటి వనరుల పరిరక్షణ, భూగర్భజలాల సంరక్షణకు 2015–16లో నీరు–చెట్టు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జలవనరుల, అటవీశాఖల నిధులకు ఉపాధి హామీ పథకం నిధులను జత చేసి.. చెరువుల్లో పూడిక తీత, చెరువు కట్టల మరమ్మతు, తూముల మార్పిడి, చెరువులకు నీటిని సరఫరా చేసే సప్లయ్ ఛానల్స్(వాగులు, వంకలు)లో పూడిక తీత, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణ, కొత్త చెక్ డ్యామ్‌ల నిర్మాణం, కాంటూరు కందకాల తవ్వకం, పంట కుంటల తవ్వకం పనులను నీరు–చెట్టు కింద చేపట్టారు. ఈ పథకం కింద చేపట్టే పనుల్లో రూ.పది లక్షల అంచనా వ్యయంలోపు ఉండే పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులు బాటు కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ పథకం కింద పనులు మంజూరు చేసే అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకే అప్పగించింది. రాష్ట్రంలో 41,478 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుల్లో పూడికతీసే పనులను ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సూచించిన ఆ పార్టీ నేతలకే నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. నిబంధనల మేరకు పూడికతీసిన మట్టిని రైతుల పొలాలకు తరలించాలి. కానీ ఆ మట్టిని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. నేటికీ కుందు నదీలో మట్టిదిబ్బలు ఎత్తివేయకపోవడంతోమంచినీరు పారే కాలువ మురికినీటిమయం అయిన దృశ్యం. మట్టిద్వారా భారీ ఎత్తున దోచుకునే క్రమంలో చెరువులను అడ్డగోలుగా తవ్వేశారు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే తూముల కంటే 10 నుంచి 12 మీటర్ల దిగువ మట్టానికి పూడిక తవ్వేశారు. దీనివల్ల వర్షాలకు అరకొరగా చెరువుల్లోకి చేరిన నీరు కూడా తూములకు అందకపోవడంతో ఆయకట్టుకు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో బ్రహ్మలింగయ్య చెరువే అందుకు నిదర్శనం. 2015–16 నుంచి ఇప్పటివరరకూ చెరువుల్లో 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తీశారు. దీన్ని క్యూబిక్ మీటర్ సగటున కనిష్టంగా రూ.500కు విక్రయించడం ద్వారా రూ.45,955 కోట్లు దోచుకున్నారు. కుడి, ఎడమల దోపిడీ చెరువుల కట్టలు, తూముల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు తీసుకున్నారు. 2013–14కు ముందు చేసిన పనులనే 2015–16, 2016–17, 2017–18, 2018–19లో చేసినట్లు చూపి సొమ్ము చేసుకున్నారు. 96,439 చెక్ డ్యామ్‌లను నిర్మించినట్లుగా, 8,46,673 పంట కుంటలు తవ్వినట్లుగా, 8,23,775 జలసంరక్షణ పనులు చేపట్టినట్లుగా.. ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ మేరకు పనులు జరగలేదు. నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తమ దర్యాప్తులో వెల్లడైందని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలను ప్రభుత్వ పెద్దలు తుంగలోకి తొక్కడమే అందుకు తార్కాణం. పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లుల రూపంలో రూ.16,291.35 కోట్ల మేర టీడీపీ నేతలు మింగేశారు. వ్రతం చెడ్డా దక్కని ఫలితం నీరు–చెట్టు పథకంలో చేపట్టిన పనుల వల్ల 86.41 టీఎంసీలు అదనంగా అందుబాటులోకి వచ్చాయని, 7.24 లక్షల ఎకరాలను స్థిరీకరించినట్లుగా సర్కార్ ప్రకటించింది. కానీ చిన్న నీటిపారుదల విభాగంలో ఆయకట్టు విస్తీర్ణం 13.24 లక్షల ఎకరాలకు తగ్గడం గమనార్హం. అంటే.. చెరువుల కింద ఉన్న ఆయకట్టులో 12.36 లక్షల ఎకరాల ఆయకట్టు మాయమైనట్లు స్పష్టమవుతోంది. 91.91 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక తీసినా.. రూ.16,291.35కోట్లతో చెరువులను అభివృద్ధి చేసినా.. ఆయకట్టు పెరగకపోగా ఉన్న ఆయకట్టులోనే 50 శాతం తగ్గడం గమనార్హం. పోనీ భూగర్భజలాలు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. 2014, మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం అది 12.19 మీటర్లకు తగ్గింది. అంటే.. భూగర్భజలాలు పెరగకపోగా భారీగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. నీరు–చెట్టు పథకం కింద సర్కార్ ఖర్చు చేసిన రూ.16,291.35 కోట్లు.. పూడిక తీసిన మట్టిని అమ్ముకోవడం ద్వారా టీడీపీ నేతలు కాజేసిన రూ.45,955 కోట్లను వెచ్చించి ఉంటే.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని జలవనరుల శాఖ అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో కరవు సహాయక చర్యల్లో భాగంగా..1999 నుంచి 2004 వరకూ కేంద్ర ప్రభుత్వం ‘పనికి ఆహారం’ పథకం కింద పంపిన కోట్లాది టన్నుల బియ్యాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పేదలకు దక్కకుండా చేసి, దారి మళ్లించి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి తెలిసిందే!! - ఆలమూరు రామ్‌గోపాల్ రెడ్డి, సాక్షి, అమరావతి -
హెచ్1బీల శ్రమ దోచేస్తున్నారు
అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్నవారు దోపిడీకి గురవుతున్నారని, వేధింపుల్ని ఎదుర్కొంటున్నారని ‘సౌత్ ఆసియా సెంటర్ ఫర్ ది అట్లాంటిక్ కౌన్సిల్’ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో తేలింది. వారికి శ్రమకు తగిన వేతనం లభించడం లేదని, పని ప్రదేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఆ సంస్థ వెల్లడించింది. ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం వల్ల దేశానికే ఎక్కువ నష్టమని హెచ్చరించింది. హెచ్1బీ వీసా ద్వారా అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించేలా వీసా విధానంలో సంస్కరణలు చేస్తామని, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ ఈ అధ్యయనం చేసింది. హెచ్1బీ ఉద్యోగుల హక్కుల్ని కాపాడాలని, వారు పనిచేసే వాతావరణాన్ని మెరుగుపరచాలని ఆ సంస్థ తన నివేదికలో సూచించింది. వేతనాలు ఎక్కువగా ఇచ్చి ప్రతిభ కలిగిన విదేశీ ఉద్యోగుల్ని పనిలోకి తీసుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అభిప్రాయపడింది. ‘హెచ్1బీ ఉద్యోగులు తక్కువ వేతనాలకే పనిచేయాల్సి వస్తోంది. వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. పని చేసే ప్రదేశాల్లోనూ దారుణమైన పరిస్థితులున్నాయి’ అని వివరించింది. ఈ పరిస్థితులను మెరుగుపర్చేందుకు పలుసూచనలు చేసింది. మొదట చేయాల్సింది హెచ్1బీ ఉద్యోగుల వేతనాల పెంపు అని స్పష్టం చేసింది. అపుడే ట్రంప్ కోరుకుంటున్నట్లు నిపుణులైన ఉద్యోగులు వస్తారని తెలిపింది. నైపుణ్యం కలిగిన అమెరికన్లనూ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, అర్హతల్ని బట్టి వారిని అత్యున్నత పదవుల్లో నియమించాలని పేర్కొంది. ఇక ఉద్యోగుల భర్తీ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించింది. హెచ్1బీ వీసాల జారీలో మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, లాటరీ ద్వారా వారిని ఎంపిక చేయడం వంటి విధానాలకు స్వస్తి పలికి, నైపుణ్యం ఆధారంగానే వీసాలివ్వాలని సూచనలు చేసింది. -
పార్కింగ్‌చేస్తే.. మాయం
కరీంనగర్‌క్రైం: రోడ్లపై లారీపెడితే చాలూ క్షణాల్లో మాయం.. గంటల వ్యవధిలో సరిహద్దుదాటి స్క్రాప్ కింద మారుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ముఠాగుట్టును కరీంనగర్ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో లారీలను మాయం చేస్తున్న ముఠాలో ఒకరిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పర్భనీకి చెందిన రహీంఖాన్ సాహేబ్ లారీలను చోరీచేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. పర్భానీ పట్టణంలో సాగర్ సర్గం సొసైటీ ఏరియాలో షెడ్డు ఏర్పాటు చేశాడు. లారీలు చోరీ చేయడానికి కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. కొన్నేళ్లుగా కరీంనగర్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో పార్కింగ్ చేసిఉన్న లారీలు, ట్రక్కులు, వ్యాన్‌ను చోరీ చేయించాడు. వాటిని పర్భానీలోని షెడ్డుకు తరలించి, కొద్దిగంటల్లోనే భాగాలుగా విడదీసి విక్రయించసాగాడు. వెలుగులోకి ఇలా.. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్ శివారులోని లారీ అసోసియేషన్ పార్కింగ్‌స్థలంలో ఈనెల 4న రాత్రి కరీంనగర్‌కు చెందిన నారదాసు మారుతీరావు తన లారీని పార్క్‌చేశాడు. మరునాడు వచ్చి చూసేసరికి లారీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. పక్కజిల్లాల్లోనూ లారీలు మాయమైన విషయాన్ని గుర్తించారు. చోరీకి గురైన లారీలో జీపీఎస్ ఉండడంతో దాని సాయంతో విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రలోని పర్భానీ శివారులోని రహీంఖాన్ ఏర్పాటు చేసిన షెడ్డులో లారీ విడిభాగాలను గుర్తించారు. లారీని చోరీచేసిన డ్రైవర్ గజానన్ సామ్మోజీ బోస్లీని పట్టుకున్నారు. పలు లారీలకు సంబంధించిన విడిభాగాలు, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కమీషన్లతో ఏజెంట్ల ఏర్పాటు రహీంఖాన్ వివిధరాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. వారు కొద్దిరోజులుగా రోడ్లపై నిలిపిఉన్న లారీలను చోరీ చేస్తున్నారు. దీనికి మూడంచెల విధానాన్ని అమలు చేస్తారు. మొదట చోరీచేసిన వ్యక్తి కొంతదూరం తీసుకెళ్లి వదిలేస్తాడు. అక్కడి నుంచి మరొకరు తీసుకెళ్తారు. ఇలా ముగ్గురి చేతులు మారాక షెడ్డుకు చేరుతుంది. దీనికి ఒక్కో డ్రైవర్‌కు రూ.15నుంచి రూ. 20 వేలు కమీషన్ ఇస్తాడు. క్షణాల్లో మాయం... లారీ షెడ్డుకు చేరగానే.. భాగాలు విడదీయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. తక్కువ సమయంలోనే స్క్రాప్‌గా మార్చి విక్రయిస్తారు. ఇంజిన్‌కు పలుమార్పులు అమ్మేస్తారు. కరీంనగర్లో లారీని చోరీచేసిన గజానన్ సామ్మోజి బోస్లేను అరెస్టు చేయగా రహీంఖాన్ సాహేబ్, విజయ్ పరారీలో ఉన్నారు. దొంగలను పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై లక్ష్మినారాయణ, ఏఎస్సై తిరుపతి, సిబ్బందిని సీపీ అభినందించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, రూరల్ ఏసీపీ ఉషారాణి ఉన్నారు. -
ఈ డ్యూటీలు మాకొద్దు
► హడలెత్తిస్తున్న కొడనాడు ఎస్టేట్ ► కట్టలు..కట్టలుగా నగదు ► శిరతావూరు బంగ్లాలో డ్యూటీలొద్దంటూ పోలీసుల వేడుకోలు ► నిందితులకు మాజీ మంత్రి సహకారం! దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్, బంగ్లా అంటేనే పోలీసులు హడలిపోతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు, దోపిడీలతో బెంబేలెత్తిపోతున్నారు. అమ్మకు చెందిన శిరతావూరు బంగ్లాలో భయం..భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఈ డ్యూటీలు మాకొద్దు బాబోయ్.. అంటూ ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. కొడనాడు సంఘటన నిందితులు పారిపోయేందుకు మాజీ మంత్రి సహకరించినట్లు బైటపడడంతో పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అధికారిక లెక్కల ప్రకారం రూ.130 కోట్ల స్థిర, చరాస్థులు ఉన్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనపుడు జయ ఇంటి నుంచి కోట్లరూపాయల విలువైన నగలు, పట్టు చీరలు, చెప్పులు తదితర వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వస్తువులు బెంగళూరు కోర్టు ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు విచారణలో తీర్పు వెలువడి శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలు కెళ్లారు. జయ మరణంతో ఆమె వారసులకు ఈ సొత్తును అందజేసేందుకు కోర్టు నిరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా, జయలలితకు స్థిరాస్థుల్లో ఒకటైన నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోకి ఇటీవల పది మంది దుండగులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్‌ను కిరాతకంగా హతమార్చారు. మరో గార్డు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. 13 ప్రవేశ ద్వారాలు, వాటికున్న సెక్యూరిటీ గార్డులను దుండగులు ఏమాత్రం లెక్కచేయకుండా దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించగా, జయలలితకు చెందిన చెన్నై సమీపంలో శిరుతావూరులోని మరో బంగ్లాకు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను భయాందోళనలకు గురి చేసింది. ఈ బంగ్లాకు ఒక డీఎస్పీ, నలుగురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు చూస్తున్నారు. జయలలిత మరణం తరువాత కూడా భారీ బందోబస్తు కొనసాగుతోంది. బంగ్లా చుట్టూ ఆరుచోట్ల కుర్చీలు వేసుకుని పంటభూముల వైపు వెళ్లే ప్రజలను, ఇళ్ల స్థలాల కోసం వచ్చేవారిని విచారించి గానీ అనుమతించడం లేదు. కొడనాడు ఘటన తరువాత వీరిలో భయం పట్టుకుంది. తమను మరెక్కడికైనా బదిలీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. మీకు ఎటువంటి ప్రమాదం లేదు, ధైర్యంగా ఉండండి అని అధికారులు సముదాయించి పంపుతున్నారు. ఒక పోలీసు కానిస్టేబుల్ మాట్లాడుతూ, వర్దా తుపాన్ వచ్చినపుడు గొడుగులు కూడా లేకుండా వందమంది బందోబస్తు విధులు నిర్వర్తించగా, కనీసం ఒక్క అధికారి కూడా తమను పరామర్శించలేదని వాపోయాడు. రాత్రి వేళల్లో పనిచేసేవారికి కనీసం టార్చ్లైట్లు కూడా ఇవ్వలేదని అన్నాడు. శశికళ బంధువులు తరచూ వచ్చి వెళుతున్నారు, జయలలితకు సంబంధించిన ప్రాంతాల్లో తరచూ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడంతో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నామని చెప్పాడు. ప్రభుత్వానికి సంబంధించని వారు నివసించిన ఈ బంగ్లాకు పోలీసు బందోబస్తు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలు డబ్బు: కొడనాడు ఎస్టేట్‌లో కట్టలు కట్టలుగా దాచిపెట్టిన డబ్బును దోచుకునేందుకే సాహసం చేశామని ఈ సంఘటనలో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులు వాంగ్మూలంలో చెప్పారు. కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీలో 11 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. 8,9 నిందితులు జమ్షీర్ ఆలి (32), జిత్తన్‌జాయ్ (20)లను పోలీసులు విచారించగా అనేక విషయాలను బైటపెట్టారు. కొడనాడు ఎస్టేట్ గురించి తమకు పెద్దగా తెలియదు, జయలలిత కారు డ్రైవర్ కనకరాజ్ నేతృత్వంలో తాము పనిచేశామని తెలిపారు. మనోజ్ నాయకత్వంలో మొత్తం 9 మంది కేరళ నుంచి వచ్చామని తెలిపారు. ఎస్టేట్‌లోకి ప్రవేశించేపుడు సెక్యూరీటీ గార్డులు అడ్డుకోగా కనకరాజ్ వారితో సంప్రదింపులు జరిపి లక్షల రూపాయలు ఇస్తాని ఆశపెట్టినట్లు చెప్పారు. అయితే వారు నిరాకరించడంతో దుడ్డుకర్రలతో తలపై మోదగా స్పృహతప్పిపోయారని తెలిపారు. స్పృహరాగానే ఒక సెక్యూరిటీ గార్డు పారిపోగా, మరో గార్డు ఓం బహదూరును కత్తితో నరికి చంపివేసినట్లు తెలిపారు. ఎస్టేట్ భవంతితోని జయలలిత, శశికళ బెడ్రూంలలోకి ప్రవేశించి అక్కడి ర్యాక్, సూట్‌కేసుల్లో కట్టలు కట్టలుగా నగదు, మరో మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు ఉండగా, వాటిని కనకరాజ్ తీసుకుని అందరం కలిసి తెల్లారేలోగా తప్పించుకున్నుట్లు వారు తెలిపారు. కొడనాడు ఎస్టేట్ నుంచి దొంగలించిన నగదు నుంచి కనకరాజ్ తమకు చెరి రూ.2లక్షలు ఇచ్చాడని, మిగిలిన సొత్తు, డాక్యుమెంట్లు ఆయన వద్దనే ఉన్నాయని వివరించారు. కోవై ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతున్న మరో ప్రధాన నిందితుడు సయాన్ ప్రాణాలు కాపాడితేగానీ కేసు చిక్కుముడి వీడదని పోలీసులు భావిస్తూ వైద్యులకు సూచిస్తున్నారు. మాజీ మంత్రికి సంబంధాలు: నిందితులు జమ్షీర్ ఆలి (32), జిత్తన్‌జాయ్ (20)లను పోలీసులు విచారించే ముందు వారి సెల్‌ఫోన్ నంబర్లను తనిఖీ చేయగా తమిళనాడుకు చెంది ఒక మాజీ మంత్రి పేరు బైటపడినట్లు తెలుస్తోంది. కొడనాడు సంఘటన జరిగిన తరువాత వీరిద్దరూ పారిపోతుండగా వాహన తనిఖీల్లో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. తమకు పలానా మాజీ మంత్రి తెలుసని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించారు, సదరు మాజీ మంత్రి వారిద్దరూ తనకు తెలిసిన వారు అని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు. అయితే ఆ తరువాత కేరళలో పట్టుకున్నారు. దీంతో కొడనాడు సంఘటనలో రాజకీయ ప్రముఖల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించుకుని మాజీ మంత్రిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు.