వారణాసి : ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయిన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రెండోరోజే బ్రేక్ డౌన్ అయింది. శనివారం ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ రైలు తుండ్లా రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైలు నిలిచిపోయింది. నాలుగు కోచ్‌లలో బ్రేక్‌లు పట్టేయడం వల్ల రైలు నుంచి భారీ శబ్ధాలు వచ్చాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం 5.30 గంటలకు చోటుచేసుకుంది. దీంతో రైలులో ఉన్నావారిని మరో రెండు రైళ్లలో తరలించారు.
అయితే ఓ గేదె పట్టాలు దాటుతున్న సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు సమాచారం. దీంతో రైలు చివరి బోగీ దెబ్బతినడంతో పాటు చిన్నపాటి పొగతో పాటు దుర్వాసన కూడా రావడంతో అప్రమత్తమైన లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. అనంతరం గేదె కళేబరం రైలు చక్రాలకు చుట్టుకోవడంతో వాటిని తొలగించారు. సుమారు మూడు గంటల అనంతరం రైలు తిరిగి బయల్దేరింది. ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు రేపటి నుంచి (ఆదివారం) నుంచి కమర్షియల్ రన్ మొదలు కానున్నది.
Comments
Please login to add a commentAdd a comment