వారణాసి నుంచి ఢిల్లీ వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని టూండలా వద్ద చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జలేసర్-పోరా మధ్య రైలు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదేమీ మొదటిది కాదు..
ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగంగా వెళుతోంది. ఈ సమయంలో ఆ యువకుడు పట్టాలు దాటుతుండగా, అటువైపుగా వచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ యువకుడిని ఢీకొంది. సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. కాగా వందే భారత్ ఎక్సెప్రెస్ కారణంగా గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. ఇదేమీ మొదటిది కాదు. పలుమార్లు ట్రాక్‌పైకి పశువులు వచ్చిన కారణంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ముందుభాగం స్వల్పంగా ధ్వంసమయ్యింది. అలాగే ఈ రైలు వేగం కారణంగా రైలును ఢీకొనడంతో పలు పశువులు మృతి చెందాయి.
ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్వాగతించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఐదు వందేభారత్ రైళ్లను స్వాగతించారు. భోపాల్‌లో ఈ రైళ్లకు పచ్చజెండా చూపారు. వీటిలో మొదటి రైలు కమలాపతి- జబల్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్. రెండవ వందేభారత్ ఖజురహో నుంచి భోపాల్ మధ్య ఇండోర్ మీదుగా నడవనుంది. ఇదేవిధంగా గోవాలోని మడ్గావ్ నుంచి ముంబైకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు మొదలయ్యాయి. నాల్గవ వందేభారత్ ధార్వాడ- బెంగళూరు మధ్య నడవనుంది.
ఇది కూడా చదవండి: బ్యాంకు డిపాజిట్ ఫారంలో.. ‘ఇదేందయ్యా ఇది..’
Comments
Please login to add a commentAdd a comment