Facebook Messenger
-
ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ డౌన్! మీమ్స్ వైరల్!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థకు అనుసందానంగా ఉన్న సోషల్ మీడియా నెట్ వర్క్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్లు షట్ డౌన్ అయినట్లు తెలుస్తోంది.స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్‌లు ఆటోమెటిగ్గా డిలీట్ అవుతున్నట్లు నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నట్లు సోషల్ మీడియా సమస్యల్ని గుర్తించే డౌన్ డిటెక్టర్.ఇన్ తెలిపింది. డౌన్ డిటెక్టర్ సంస్థ మంగళవారం రాత్రి 8 గంటలకు ఫిర్యాదులు మొదలయ్యాయని తెలిపింది. బుధవారం 11.25గంటల సమయానికి మొత్తం 985 మంది నెటిజన్లు ఫిర్యాదు చేశారని పేర్కొంది. #instagramdown With great Instagram Down, comes great memes.. Zuckerberg trying to fix the dm crash pic.twitter.com/AmkCPTCw2d — Kunwar Fariyad Singh (@KunwarFariyad) July 5, 2022 అందులో 52శాతం యూజర్లు యాప్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని, 39శాతం మందికి సర్వర్ సమస్యలు, 9శాతం మందికి లాగిన్ సమస్యలు ఎదురయ్యానని ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటెక్టర్ ప్రతినిధులు తెలిపారు. Me waiting for instagram DMs for work again 🥺🤷♂️. #instagramdown #frustrating #instadown pic.twitter.com/X7wYJ31yY1 — Kartik Choudhary (@K4rtik007) July 6, 2022 ఈ తరుణంలో మెటాకు చెందిన ఫ్లాట్ ఫాంలపై అసహనం వ్యక్తం చేసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. footage me fixing instagram cause nobody else is. #instagramdown pic.twitter.com/LQR1UVpDYW — hot for the green mnm (@jdigglydawg) July 5, 2022 -
ఫేస్బుక్ యూజర్లకు గుడ్‌న్యూస్..! ఇప్పుడు అందరికీ అందుబాటులో..!
మెటాకు చెందిన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ యూజర్లకు గుడ్ న్యూస్‌ను అందించింది. ఎట్టకేలకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. సోషల్‌మీడియా యాప్స్‌లో అత్యంత ప్రజాదరణను పొందిన యాప్‌గా ఫేస్బుక్ నిలుస్తోంది. సుమారు 3 బిలియన్ల యూజర్లు ఫేస్బుక్ సొంతం. ది వెర్జ్ ప్రకారం 2016లోనే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫీచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రానుంది. టెక్స్ట్ సందేశాలు అలాగే గ్రూప్ చాట్లు, కాల్‌లను E2EE ఫీచర్ వస్తోందని ది వెర్జ్ నివేదిక తెలిపింది. అయితే 2023లోపు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (End to end encryption) ఫీచర్ డిఫాల్ట్‌గా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. మెటా యాజమాన్యంలోని మరో మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (WhatsApp).. ఇప్పటికే డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్కు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా మరిన్నీ ఫీచర్స్..! మెసేంజర్‌లో ఈ ఫీచర్ పూర్తి రోల్ అవుట్‌తో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ చాట్లలో, యూజర్లు GIFలు, స్టిక్కర్లు, రియాక్షన్లు, మెసేజ్‌లకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి లేదా ఫార్వార్డ్ చేయడానికి లాంగ్ ప్రెస్ ఉపయోగించవచ్చును. అంతేకాకుండా సదరు యూజర్‌కు పంపిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీస్తే ఇట్టే రెసిపెంట్‌కు తెలిసిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ కేవలం వానిష్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. చదవండి: బ్రాటా యమడేంజర్.. ముందు బ్యాంక్ అకౌంట్, ఆపై పర్సనల్ డాటా.. గుర్తించి జాగ్రత్త పడండి ఇలా! -
Facebook Scam: ‘ఈ వీడియోలో ఉంది మీరేనా?’
Facebook Messenger Video Link Scam Alert: ఆన్లైన్ మోసాలకు భారత్ నెంబర్ వన్ అడ్డాగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరిగిపోవడం.. కనీస అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో కొత్త తరహా ఆన్లైన్ స్కామ్‌లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్బుక్ మెసేంజర్ వీడియో స్కామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఫేస్బుక్ అకౌంట్ టార్గెట్‌గా జరిగే పిషింగ్ స్కామ్ ఇది. ఈ గాలంలో చిక్కితే గనుక.. ఫేస్బుక్ లాగిన్ క్రెడెన్షియల్స్ సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. తద్వారా ఆన్లైన్ మోసగాళ్లు ఫేస్బుక్ అకౌంట్లపై పట్టు సాధిస్తారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘సోఫోస్’ ఈ స్కామ్‌కు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది కూడా. విశేషం ఏంటంటే.. ఐదేళ్ల క్రితం ఇదే తరహా స్కామ్ ఒకటి ఫేస్‌బుక్‌ను కుదిపేసింది కూడా. లింక్‌కి టెంప్ట్ అయితే.. ముందుగా ఫేస్బుక్ మెసేంజర్ (మెసేజ్ బాక్స్) కు ఓ లింక్ పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఆ లింక్ పైన ‘ఈ వీడియో ఉంది మీరేనా?’ అని రాసి ఉంటుంది. ఆ లింక్ యూబ్యూట్ లింక్ మాదిరి ఉంటుంది. కాబట్టి, చాలా క్యాజువల్‌గా యూజర్ క్లిక్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి గనుక క్లిక్ చేసినట్లయితే.. నేరుగా ఫేస్బుక్ లాగిన్‌కు వెళ్తుంది. ఒకవేళ ఫేస్‌బుక్‌లోకి లాగిన్ గనుక అయినట్లయితే.. కిస్సా ఖల్లాస్. ఫేక్ పేజీ.. అది ఫేస్బుక్ లాగిన్ పేజీ అనుకుంటే పొరపాటే!. పక్కా ఫేక్ పేజీ. యూజర్ ఇన్ఫర్మేషన్ను తస్కరించేందుకే ప్రత్యేకంగా అలా డిజైన్ చేసి పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఒకవేళ అక్కడ లాగిన్ గనుక అయితే పాస్‌వర్డ్‌తో సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. వెంటనే ఫేస్బుక్ అకౌంట్ మీద పట్టు సాధించి.. ఆపై బ్లాక్‌మెయిల్‌కు, మోసాలకు దిగుతారు. గుర్తుపట్టడం ఎలా? ఆ ఫేస్బుక్ లాగిన్ లింక్ ఫేక్ లేదా ఒరిజినల్ అని గుర్తుపట్టడం ఎలా?. వెబ్సైట్ యూఆర్ఎల్ ఒక్కటే మార్గం. లింక్ పైన యూఆర్ఎల్లో HTTPS లేదంటే HTTPతో మొదలైందంటే.. అది ఒరిజినల్ అని గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో సేఫ్ ప్రొటోకాల్ కింద వెబ్సైట్లు అన్నీ HTTPS యూఆర్ఎల్ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి కాబట్టి. మోసపోయి ఫిర్యాదులు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చదవండి: మీ Whatsapp బ్యాన్ అని చూపిస్తుందా? పని చేయట్లేదా? ఇలా చేయండి -
కరోనా దెబ్బకు డిమాండ్, భలే స్కెచ్చేసిన మార్క్ జుకర్ బర్గ్..!
కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే, వాట్సాప్‌లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం ఈ యూపీఐ సర్వీసుల్ని ఫేస్బుక్ మెసెంజర్లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్‌ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెప్పారు. వచ్చే వారం యూఎస్యూలోని మెసేంజర్ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్‌పై టెస్ట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్‌లో పేర్కొంది. స్ప్లిట్ పేమెంట్ పేరుతో మెసెంజర్లో ఫేస్బుక్ పరిచయం చేయనున్న ఈ ఫీచర్‌తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్ బిల్లుల్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు గ్రూప్‌లో ఒక చాట్లా కనిపిస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుంది ►స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్‌ని ఉపయోగించడానికి గ్రూప్ చాట్‌లో “గెట్ స్టార్ట్” అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే పేమెంట్స్ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్ చేయాలి ►ఆ వివరాల్ని ఎంటర్ చేసిన అనంతరం మీరు మీ ఫేస్బుక్ పేమెంట్ వివరాల్ని కన్ఫాం చేయాల్సి ఉంటుంది. ►కన్ఫామ్ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్ వెళ్లిందా లేదా చెక్ చేయాలి. చదవండి: జుకర్ బర్గ్‌ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
అలాంటి వీడియో కాల్స్‌తో జాగ్రత్త!
వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలో తెలియని ఏదో అకౌంట్ నుంచి వీడియో కాల్స్ వస్తుంటాయి. లిఫ్ట్ చేయగానే.. షాక్. అవతల నగ్నంగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తారు. ఏం జరుగుతుందో ఊహించే లోపే కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. కాసేపటికి అన్నోన్ నెంబర్ లేదంటే సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోన్ కాల్స్ లేదంటే మెసేజ్‌లు వస్తాయి. అశ్లీల వీడియోలు చూసిన మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేశామనో, ఫొటోలు తీశామనో బెదిరిస్తారు. కొంత డబ్బును డిమాండ్ చేస్తూ.. ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ వీడియో/ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వ్యవహారాలను కొందరు లైట్ తీస్కుంటే.. చాలామంది భయంతో కంగారులో ఏం చేయాలో పాలుపోక వణికిపోతారు. సదరు అకౌంట్లను బ్లాక్ చేయడమో లేదంటే యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయడమో చేస్తుంటారు. అయినా బెదిరింపులు ఆగిపోతాయనుకోవడం పొరపాటే!. చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు.. దేశంలో ఆన్లైన్ మోసాలు, వేధింపుల కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే సైబర్ నేరాల్లో భారత్ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కొంతకాలంగా తగ్గిపోయిన ‘సెక్స్టార్షన్’ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఉత్తర రాష్ట్రాలు కేంద్రంగా జరుగుతున్న ఈ నేరాలపై సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం మేవాత్ (హర్యానా), భరత్పూర్ (రాజస్థాన్) నుంచి 36 బ్యాచ్‌లు దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే 600 మందికి పైగా అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపించి ఆపై వాటిని బూచిగా చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాయి ఈ ముఠాలు. నిజానికి సెక్స్టార్షన్.. నేరాలు కొత్తేం కాదు. కాకపోతే లాక్డౌన్ నుంచి ఈ తరహా నేరాలు మళ్లీ విజృంభిస్తున్నాయి. దేశ రాజధాని లక్క్ష్యంగా, మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు ఈమధ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మీకు తెలుసా?.. డిలీటైన వాట్సాప్ డేటాను సింపుల్‌గా ఇలా బ్యాకప్ చేయొచ్చు ఏం చేయాలంటే.. సెక్స్టార్షన్లు చాలా సీరియస్ నేరాలు. ఫేస్బుక్ మెసేంజర్లోగానీ, వాట్సాప్లోగానీ, ఇతర ఏ యాప్‌లలో అయినాగానీ తెలియని అకౌంట్లు, గుర్తుతెలిని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ కంగారులో లిఫ్ట్ చేసినా కెమెరాను కవర్ చేయాలి. కాల్స్ వచ్చే నెంబర్లు, అకౌంట్లను బ్లాక్ చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయాలి. బ్లాక్‌మెయిలింగ్ కాల్స్, మెసేజ్‌లకు ఎక్కువసేపు స్పందించకుండా ఉంటే.. ఫిర్యాదు చేస్తారేమోనని నేరగాళ్లే భయపడొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా ఫిర్యాదులు చేయడమే ఉత్తమమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. -
Meta: యూజర్ సేఫ్టీ.. ఇప్పట్లో అది కష్టమేనా!
end to end encryption To FB Messenger And Instagram: పేరు మారినా.. తీరు మారుతుందా? అంటూ మెటా (ఫేస్బుక్ కంపెనీ) వ్యవహారశైలిపై విసుర్లు విసురుతున్నారు నెటిజనులు. పైగా కంపెనీ పేరు మారాక నష్టాలతో పాటు విమర్శలూ పెరిగిపోయాయి. ఈ తరుణంలో యూజర్ల భద్రతకు సంబంధించిన ఓ అప్డేట్ను ఇప్పట్లో తేవడం కష్టమేనని తేల్చేసింది మెటా. వాట్సాప్ తరహాలోనే మెటా సర్వీసులైన ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ end-to-end encryption సేఫ్టీ ఫీచర్‌ను మెటా (ఫేస్బుక్ కంపెనీ) అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే!. తద్వారా యూజర్ల గోప్యత హామీని నెరవేర్చే ఆలోచనలో ఉంది. అయితే వచ్చే ఏడాదిలోనే ఈ సర్వీస్‌ను యూజర్ల దాకా తీసుకొస్తామని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడది మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. వీలైతే 2023 నుంచే ఆ ప్రయత్నాలు మెటా కంపెనీ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. యూజర్ సేఫ్టీకి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లకు తేవడం కాస్త ఆలస్యం అవుతుందని మెటా సేఫ్టీ హెడ్ అయిన ఆంటీగాన్ డేవిస్ ‘ది టెలిగ్రాఫ్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు మరో రెండేళ్లు పట్టొచ్చని ఆయన తేల్చేశారు. అయితే ఈ సర్వీస్ ద్వారా నేరాలకు అడ్డుకట్ట పడుతందనే వాదనను మాత్రం మెటా అంగీకరించదని డేవిస్ చెబుతున్నారు. మరోవైపు పిల్లల భద్రతకు సంబంధించి(ఇన్స్టాగ్రామ్) మెటాపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో.. విమర్శలకు చెక్ పెట్టేందుకైనా E2EE సేవల్ని వీలైనంత త్వరగతిన అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా యూజర్ల ఛాటింగ్ చాలా భద్రంగా ఉంటుందని whatsapp తొలి నుంచి ప్రకటించుకుంటోంది. అయితే నేరాలు జరిగిన సమయంలో వారెంట్ జారీ అయినప్పుడు.. నేరం ఆరోపించబడ్డ వ్యక్తి ‘ఎన్క్రిప్షన్ యాసెస్’కు అనుమతులు ఇచ్చే చట్టాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తలొగ్గాల్సిందేనని కొన్ని దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో భారత్, జపాన్, కెనడా, న్యూజిలాండ్, యూకే ఉండగా.. కిందటి ఏడాది ఈ దేశాలతో అమెరికా కూడా గళం కలిపింది. చదవండి: ఎలక్ట్రిక్ బ్రెస్ట్ మసాజర్! ఎలా పని చేస్తుందంటే.. -
మరోసారి ఫేస్బుక్, ఇన్‌స్టా డౌన్..! ట్విట్టర్లో యూజర్ల అరాచకం..!
ఫేస్బుక్ మరోసారి స్తంభించిపోయింది.భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఫేస్బుక్,ఇన్ స్టాగ్రామ్ సర్వీసులు బుధవారం అర్ధరాత్రి వరల్డ్ వైడ్‌గా పనిచేయడం ఆగిపోయాయి. దీంతో నెటిజన్లు మరోసారి ఆగ్రహానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌కు చెందిన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అవి మీకోసం. (చదవండి: 11 ఏళ్లకు అంతా ఉల్టా పల్టా? ఫేస్బుక్ డిలీట్ అంటూ కవర్ పేజీ) 'డౌన్ డిటెక్టర్' రిపోర్ట్ ప్రకారం..భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12:1 నిమిషాల సమయంలో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్,ఫేస్బుక్ మెసెంజర్ సర్వీసులు కొన్ని గంటల పాటు ఆగినట్లు తెలిపింది. దీంతో అసహనానికి గురైన భారత్‌తో పాటు యూఎస్,యూకే దేశాలకు చెందిన యూజర్లు ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఇక ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్ సర్వీసులు ఆగిపోవడంపై #facebookdown, #instagramdown అనే హ్యాష్ ట్యాగ్లు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే దీనిపై "ఫేస్బుక్ ఈఎంఈఏ కమ్యూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రూ వాయిస్కా స్పందించారు. మెసేజింగ్ యాప్స్ పనిచేయడం లేదని ఫిర్యాదులు అందాయి. బగ్‌ను గుర్తించి త్వరలోనే సేవల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. మెసేజింగ్ సర్వీసులు నిలిచిపోయినందుకు క్షమించండి అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్ అఫిషియల్ అకౌంట్ నుంచి బుధవారం అర్ధరాత్రి 1.33గంటలకు మెసేజ్ చేశారు. ఆ తరువాత మరోసారి తెల్లవారు జామున 4.34 గంటల ప్రాంతంలో వీఆర్ బ్యాక్. బగ్‌ను గుర్తించి, సమస్యను పరిష్కరించామంటూ" మెసేజ్ చేశారు. కాగా, గత అక్టోబర్ నెలలో వరుసగా రెండు సార్లు, బుధవారం అర్ధరాత్రి (నవంబర్ 3) ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమదైన స్టైల్లో ఫేస్బుక్ తీరును విమర్శిస్తున్నారు. Twitter striving while insta got clapped again #instagramdown pic.twitter.com/n4qDAcJXi5 — 💫𝓚𝓸𝓪𝓵𝓪💫 (@PapaKoalaYT) November 3, 2021 #instagramdown #instagramisdown Me after spending 10 minutes switching between WiFi and data pic.twitter.com/8EH5zf8aKN — Meaty Mané🇵🇰🏴🇪🇸🇫🇷 (@MeatyXtra) November 3, 2021 Instagram down again!!!🥵#instagramdown pic.twitter.com/1dAy51zTaJ — Rovin Singh Verma (@RovinSinghVerma) November 3, 2021 People coming to Twitter to check whether Instagram is down again #instagramdown pic.twitter.com/6bjtABIh5r — Troll (@Trollface_T__T) November 3, 2021 -
మళ్లీ బ్రేక్‌డౌన్! ఫేస్బుక్ సేవలకు అంతరాయం
Instadown Trend Amid Instagram Down Again: ఫేస్బుక్ సర్వీసులకు మరోసారి విఘాతం కలిగింది. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు గంటలసేపు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసేంజర్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మరోసారి అసహనానికి గురయ్యారు. ఇన్స్టాగ్రామ్ యాప్ రిఫ్రెష్ కాకపోవడం, ఫీడ్స్ ఆగిపోవడం, ఫేస్బుక్ మెసేంజర్ పని చేయకపోవడంతో పాటు ఫేస్బుక్ కార్యాలయంలోనూ పలు సేవలు ఆగిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ అంతరాయంపై యూజర్లకు ఫేస్బుక్ క్షమాపణలు చెప్పింది. ఇంకోవైపు Instagram Down, #Instadown హ్యాష్‌ట్యాగులు విపరీతంగా షేర్ కావడంతో ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. ఫేస్బుక్ సంబంధిత సేవలకు అంతరాయం ఏర్పడడం ఈ వారంలో ఇది రెండోసారి. సోమవారం రాత్రి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు సుమారు ఆరేడు గంటలు ఆగిపోవడంతో కోట్ల మంది యూజర్లు అసహనం వ్యక్తం చేశారు. ట్విటర్, టెలిగ్రామ్ సర్వీసుల వైపు మళ్లారు. ఈ అంతరాయం ఫలితంగా ఫేస్‌బుక్‌తో పాటు చిరువ్యాపారస్తులు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక శుక్రవారం రాత్రి ఏర్పడిన అంతరాయానికి, సోమవారం ఏర్పడిన అంతరాయానికి ఒకే కారణం కాదని ప్రకటించిన ఫేస్బుక్.. అంతరాయానికి కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు. అయితే సమస్యను పరిష్కరించినట్లు, ఇప్పుడంతా సర్దుకుందని మాత్రం ప్రకటించింది. మరోవైపు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపికగా ఎదురుచూసినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. We know some of you may be having some issues using Instagram right now (🥲). We’re so sorry and are working as quickly as possible to fix. — Instagram Comms (@InstagramComms) October 8, 2021 things have been fixed, and everything should be back to normal now. thank you for bearing with us (and for all the memes this week 🙃) — Instagram Comms (@InstagramComms) October 8, 2021 మరోవైపు ఒకేవారంలో రెండుసార్లు షట్‌డౌన్ కావడంపై యూజర్లు అసహనంతో పాటు సెటైర్లు పేల్చారు. శుక్రవారం రాత్రి ఆ రెండుగంటలపాటు ట్విటర్లో మీమ్స్‌తో ఫేస్బుక్ మీద విరుచుకుపడ్డారు. అందులో కొన్ని మీకోసం.. I call the master#instadown pic.twitter.com/Udi4ftuRvG — ΔΝΔSIK (@ilnasik) October 8, 2021 Situation right now when #instadown Instagram Twitter pic.twitter.com/qTT52Ojaar — Sakuta🌸 (@Sakutax2) October 8, 2021 People coming to Twitter again to check whether insta is down again #instagram #instadown pic.twitter.com/yhVgyLDpSP — Garry Gill (@garrygill1112) October 8, 2021 #instadown insta down go to Twitter pic.twitter.com/9GoCbTzRVz — Sakuta🌸 (@Sakutax2) October 8, 2021 Mark zuckerberg after taking insta down 2 times in a week #DeleteInstagram #instadown #instagramdown pic.twitter.com/sjW0PHgpW2 — Khizer (@khiz_7) October 8, 2021 #instadown I'm waiting when it will ok pic.twitter.com/1YNjkWFiiE — Ashutosh Srivastava (@ashutosh_sri8) October 8, 2021 చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. జుకర్‌బర్గ్‌ను ముంచిన ఆ ఒక్కడు -
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్‌బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్‌డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్‌ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్‌ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్‌ను క్లోజ్ చేసి మెసేంజర్‌లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్‌కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
ఫేస్‌బుక్‌లోని ఈ కొత్త ఫీచర్ సూపర్‌గా ఉందే....!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు కొత్తగా అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ యాప్‌లో ఉండే వాయిస్, వీడియో కాల్స్‌కు ఉండే ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రస్తుతం ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేకూరనుంది. కాగా గతంలోనే వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలోని యూజర్లకు పంపే మెసేజ్‌లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా దిగ్గజం మెసేజింగ్ సేవల పోర్ట్‌ఫోలియోలో క్రమంగా ఆడియో ,వీడియో ఫీచర్లను జోడించింది. "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ లో భాగంగా సందేశాలు, కాల్ల కంటెంట్ మీ ఫోన్ నుంచి రిసీవర్‌కు చేరుకునే వరకు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్బుక్ తన ప్రసిద్ధ ఇమేజ్-షేరింగ్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరితో ఒకరు సంభాషణల కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఫేస్బుక్ మెసేంజర్‌లోని గ్రూప్ చాట్లకు కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకురావాలని ఫేస్బుక్ చూస్తుంది. దాంతో పాటుగా మెసేంజర్‌లో సందేశాలను నిర్ణీత సమయం వరకు కనిపించేలా, తరువాత ఆ మెసేజ్‌లు కన్పించకుండా నియత్రించవచ్చును. మెసేంజర్‌లో పంపే సందేశాలకు 5 సెకండ్ల నుంచి 24 గంటలపాటు టైమర్‌ను ఉపయోగించి మెసేజ్‌లను పంపవచ్చును. -
ఫేస్బుక్లో సౌండ్ మోత.. ఇక పండుగే!
రెగ్యులర్ ఛాటింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో భావప్రకటన చేసేందుకు సులువైన మార్గాలే ఎమోజీలు. అవసరం ఉన్నా లేకున్నా వాటిని ఒకప్పుడు తెగ ఉపయోగించేవాళ్లు. అయితే జిఫ్ ఫైల్స్, స్టికర్ల రాకతో వీటి వాడకం కొంచెం తగ్గింది. ఈ తరుణంలో ఎమోజీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఫేస్బుక్ ఓ అడుగు ముందుకు వేసింది. యూజర్లకు మరింత వినోదం అందించేందుకు సౌండ్ ఎమోజీలను తీసుకొచ్చింది. ఇందుకోసం ఫేస్బుక్ మెసేంజర్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది. గురువారం రాత్రి నుంచే సౌండ్ ఎమోజీలను పంపే వీలు కల్పించింది. శనివారం(జులై17న) వరల్డ్ ఎమోజీ డే. సో.. అంతకంటే ముందే ‘సౌండ్మోజీ’ పేరుతో ఫీచర్‌ను యూజర్లకు అందిస్తోంది ఫేస్బుక్. ఇంతకు ముందు ఒకటి రెండు ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎక్కువ ఎమోజీలకు సౌండ్ ఎఫెక్ట్ యాక్సెస్ కల్పించింది మెసేంజర్. మెసేంజర్‌లో ఎమోజీ లైబ్రరీ నుంచి కావాల్సిన ఎమోజీని పంపుకోవచ్చు. అయితే ఆ పక్కనే ఉన్న సౌండ్ బటన్‌ను క్లిక్ చేయాలి. ఒకవేళ బటన్ గనుక కనిపించకుంటే.. యాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేం ఫుల్ వాల్యూమ్‌తో ఎమోజీలు పంపిస్తూ పండుగ చేసుకుంటున్నారు కొందరు యూజర్లు. ఇక ఈ విషయాన్ని అధినేత జుకర్‌బర్గ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. -
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు కాసేపు డౌన్!
న్యూఢిల్లీ: వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వేదికలు శుక్రవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం కాక నెటిజన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్డేట్ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్ కూడా కాలేకపోయారు. ఎర్రర్ అనే సందేశం కనిపించడం చూసి తల పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్ వెబ్సైట్ ‘డౌన్ డిటెక్టర్’ గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు. -
ఫేక్ ఐడీస్: నమ్మారో.. మోసపోయినట్లే..!
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఆధునిక యుగంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్బుక్ ఖాతాను విరివిరిగా వినియోగిస్తున్నారు. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో పోస్టింగ్ చేయడం.. షేర్ చేయడం అలవాటుగా మారింది. దీంతో ఉపయోగం ఎంత ఉందోకానీ కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్బుక్ అకౌంట్లో ప్రొఫైల్ ఫొటోను కొందరు డౌన్లోడ్ చేసుకుని ఫేక్ అకౌంట్‌ను అదే పేరుమీద ఓపెన్ చేస్తున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో ఓన్ హెల్ప్ మీ..అంటూ చాటింగ్ చేస్తారు. చదవండి: ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ.. ఫేస్బుక్ స్నేహితులు స్పందించినప్పుడు అర్జెంట్‌గా అమౌంట్ కావాలని, గూగూల్ పే, ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ నంబర్.. ఇలా ఏదీ కావాలంటే అది ఇస్తారు. ఆపదలో ఉన్నారు.. అత్యవసరంగా డబ్బు అవసరమై ఉంటుందని భావించిన స్నేహితులు రూ.20 వేలు, రూ.10 వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మొదట్లో పెద్ద మొత్తంలో మనీ అవసరమంటూ చాటింగ్ చేస్తూ చివరకు ఎంతో కొంత అత్యవసరంగా కావాలంటూ అడుగుతున్నారు. చదవండి: వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..? గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ ఎస్ఐ, కంభంలోని హీరో షోరూమ్ వ్యక్తి, బేస్తవారిపేటలోని ఓ కళాశాల కరస్పాండెంట్ల పేరుతో దొంగ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి పలువురి నుంచి భారీగానే అమౌంట్ దోచేశారు. వారం క్రితం ఓ పురుగుమందుల సంస్థలో పనిచేసే సేల్స్ మేనేజర్ అకౌంట్‌ను ఇలాగే చేశారు. స్పందించిన ఐదుగురు స్నేహితుల నుంచి రూ.60 వేలు కొట్టేశారు. ఇచ్చిన బ్యాంక్ అంకౌంట్ నంబర్లు, ఫోన్ నెంబర్లు ఛత్తీఘడ్లోని రాయచూర్ ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. గూగూల్, ఫోన్ పేలలో ఒకే పేరు గూగూల్ పే, ఫోన్ పేలలో ఫోన్ నంబర్ నమోదు చేయగానే పేరు చూపిస్తుంది. దొంగతనంగా తయారు చేసిన డూప్లికేట్ వ్యక్తుల ఫోన్ నంబర్ ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు సంబంధించినా ఓరిజినల్ వ్యక్తికి సంబంధించిన పేరు వస్తుంది. దీంతో నగదు బదిలీ చేసేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా స్నేహితులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్సక్షన్స్ ముగిసిన తర్వాత మరుసటి రోజుకు అతని ఫోన్ నంబర్ ఫోన్ పేలో నమోదు చేస్తే వేరే పేరు రావడం గమనార్హం. -
ట్రంప్‌నకు షాక్.. ట్విటర్ శాశ్వత సస్పెండ్
న్యూయార్క్: ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తాజాగా పేర్కొంది. రెండు రోజుల క్రితం క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్స్ నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్విటర్ వివరణ ఇచ్చింది. దీనికితోడు మరోసారి హింసాత్మక అల్లర్లకు మద్దతిచ్చే రిస్కులున్నందున ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా బంద్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం తదితర సమయాలలోనూ ఆన్లైన్ ద్వారా మరోసారి నిరసనలను ప్రోత్సహించే అవకాశముండటంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు సుదీర్ఘ వివరణను ఇచ్చింది. చాలకాలంగా ట్రంప్‌సహా వివిధ ప్రపంచ నేతలకు నిబంధనలలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నట్లు ట్విటర్ ఈ సందర్భంగా వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు(దాడులు), హేట్ స్పీచ్ తదితర విషయాలలో ప్రపంచ నేతలకు నిబంధనలనుంచి మినహాయింపులను ఇస్తున్నట్లు తెలియజేసింది. (హెచ్1 బీ వీసాలకు నేడు తీపి కబురు) పెరుగుతున్న ఒత్తిడి క్యాపిటల్ బిల్డింగ్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనల తదుపరి సోషల్ మీడియా దిగ్గజాలపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఓవైపు ఫేస్బుక్ తాత్కాలికంగా ట్రంప్ ఖాతాను ఈ నెల 20వరకూ నిలిపివేయగా.. ట్విటర్ సైతం తొలుత 12 గంటలపాటు ట్రంప్ ఖాతాకు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజా ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ ఖాతాను ట్విటర్ శాశ్వతంగా నిషేధించేందుకు నిర్ణయించగా.. ఫేస్బుక్ సైతం ఇదే బాటలో నడిచే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ వీడియో ద్వారా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడం ద్వారా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడులకు ట్రంప్ ఉసిగొల్పారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు పేర్కొన్నాయి. (హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్) నిబంధనలు పాటించాలి ప్రపంచ నేతల ఖాతాల విషయంలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నప్పటికీ నిబంధనల హద్దులను పూర్తిగా దాటితే చర్యలు తప్పవని ట్విటర్ తాజాగా స్పష్టం చేసింది. ఎవరైనాగానీ ట్విటర్‌ను హింసకు వినియోగించుకోవడాన్ని సమర్థించబోమని తెలియజేసింది. ట్విటర్‌కు సుమారు 8.9 కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నట్లు తెలియజేసింది. కాగా.. ట్రంప్‌నకు మద్దితిచ్చే మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్, అటార్నీ సిడ్నీ పోవెల్ ఖాతాలనూ శాశ్వతంగా నిషేధించినట్లు ట్విటర్ తాజాగా వెల్లడించింది. (ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ ఖాతాలు బంద్) -
న్యూలుక్లో ఫేస్బుక్ మెసెంజర్
ప్రపంచ సాంకేతిక దిగ్గజం ఫేస్బుక్ మెసెంజర్‌ను కొత్త అవతారంలో తీసుకురానుంది. అంతే కాకుండా దానికి చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్కర్లు, సరిపడా ప్రతిస్పందనలను ప్రవేశపెట్టనుంది. ‘భవిష్యత్ మెసెజింగ్‌కు అనుగుణంగా మార్పులు ఉంటాయి. ఈ మధ్యే ఇన్ స్టాగ్రామ్ తో మెసెంజర్ అనుసంధానం జరిగింది' అని ఫేస్బుక్ వెల్లడించింది. ఫేస్బుక్ మెసెంజర్ కొత్త లోగో దాని సాంప్రదాయ సాలిడ్ బ్లూ(నీలం) రంగు నుంచి కొద్దిగా మారనుంది. దానికి బదులుగా, ఇది ఇన్స్టాగ్రామ్ లోగో మాదిరిగా నీలం- నుండి- పింక్ ప్రవణతకు రూపుదిద్దుకోనుంది. త్వరలో వినియోగదారులు ఇన్కమింగ్ సెల్ఫీ స్టిక్కర్ల ఫీచర్లను ఉపయోగించగలుగుతారు. అది వారి సెల్ఫీలతో పాటు స్టిక్కర్లను తయారుచేయడానికి వీలు కల్పిస్తుంది. ఫేస్బుక్ కూడా డార్క్ మోడ్ లక్షణాన్ని విడుదల చేస్తుంది, దీని ద్వారా మీరు చాట్ నుండి నిష్క్రమించినప్పుడు లేదా అవి చూసిన తర్వాత సందేశాలు అదృశ్యమవుతాయి. "మా క్రొత్త లోగో భవిష్యత్ మెసెజింగ్ విషయంలో జరగాల్సిన మార్పును ప్రతిబింబిస్తుంది. మీరు సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి మరింత డైనమిక్, ఆహ్లాదకరమైన, సమ్మిళిత మార్గం దిశగా మళ్లనుంది. ఈ మార్పు మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. కేవలం మెసేజులు మాత్రమే పంపుకునే దశ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో వివిధ యాప్‌లు, పరికరాల ద్వారా హ్యాంగవుట్ అయ్యేందుకు నూతన మార్పులు వీలు కల్పిస్తాయి” అని మెసెంజర్ వైస్ ప్రెసిడెంట్ స్టాన్ చుడ్నోవీస్కీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. గత నెలలోనే ఫేస్బుక్ మెసెంజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించింది. దీంతో మెసెంజర్ లేదా ఇన్స్టాలలో దేన్నుంచైనా దేనికైనా సందేశాలు పంపుకునే వీలుంది. (చదవండి: యూజర్లకు షాక్.. ఐఫోన్ 12లో అవి మిస్) -
ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ఇవే!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో మైలురాయిని అందుకుంది. 2010 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్స్‌లో ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్లు మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలపై ఆరోపణలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్బుక్ క్రేజ్‌ను ఏమాత్రం నిలువరించలేకపోయాయి. యాప్ యానీ అనే యాప్ సంస్థ ఈ దశాబ్దంలోనే అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ జాబితాను రూపొందించింది. ఆన్లైన్ డిజిటల్ స్పేస్‌లో ఎక్కువగా యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసిన వాటిని పరిగణలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఆన్‌లైన్‌కు సంబంధించిన మరిన్ని జాబితాలు రూపొందిస్తామని యాప్ యానీ సంస్థ పేర్కొంది. యూజర్లు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ జాబితా: ఫేస్బుక్ ఫేస్బుక్ మెసేంజర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్నాప్‌చాట్ టిక్‌టాక్ యూసీ బ్రౌజర్ యూట్యూబ్ ట్విటర్ -
ఆ విమానంలో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు
విమానాల్లో కూడా ప్రయాణికులకు వై-ఫై సర్వీసులు అందించేందుకు విమానయానసంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా అలస్కా విమానయాన సంస్థ, తన ప్రయాణికులు ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్నప్పుడే ఉచితంగా ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌లు వాడుకునేలా అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. ఉత్తర అమెరికాలో దేశీయ విమానాలు నడుపుతున్న అలస్కా ఎయిర్‌లైన్స్, విదేశీ మార్గాలోనూ తన సేవలందిస్తోంది. మెక్సికో, కోస్టా రికా, క్యూబా వంటి ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. ఎంపికచేసిన ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులకు ఆన్‌బోర్డులో యాక్సస్ అందించడం ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉందని అలస్కా పేర్కొంది. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సినవసరం లేకుండా 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికులు ఫేస్బుక్ మెసేంజర్, వాట్సాప్, ఐ మెసేజ్‌లను వాడుకోవచ్చని తెలిపింది. జనవరి 24 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ''గోగో-వైఫై'' అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొన్ని సాధారణ స్టెపులను ఫాలో అయి కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సంభాషణ ప్రారంభించుకోవచ్చని అలస్కా చెప్పింది. ప్రస్తుతం ఇంటర్నెట్ యాక్సస్‌ను విమానాల్లో అందించడం ఎయిర్‌లైన్ ఇండస్ట్రికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తోంది. ఎయిర్ ఫ్రాన్సస్ తాజాగా బోయింగ్ 787 విమానంలో వైఫై సేవలందించింది. కానీ వాటికి చార్జీలు వసూలు చేసింది. ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేకుండా అలస్కా ఎయిర్‌లైన్ ఉచిత సేవలందించేందుకు సిద్దమవుతోంది. -
సీక్రెట్‌గా మెసెంజర్ సంభాషణ
ఫేస్బుక్ మెసెంజర్ నుంచి సీక్రెట్‌గా మెసేజ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది ఇప్పటినుంచి సాధ్యమవుతుందట. ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్‌కి ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్‌ను తెచ్చేసింది. రహస్య సంభాషణ(సీక్రెట్ కన్వర్జేషన్) పేరుతో తన యాప్ యూజర్లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ను ఆవిష్కరించింది. యూజర్లు ఎంపిక చేసుకున్న సంభాషణలకు పూర్తిగా ఎన్ క్రిప్షన్ సౌకర్యాన్ని ఫేస్బుక్ ఇకనుంచి కల్పించనుంది. అయితే సింగిల్ డివైజ్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని ఫేస్బుక్ పేర్కొంది. ఒక డివైజ్ ద్వారా సీక్రెట్ సంభాషణ చేసి, మరొక డివైజ్‌లో ఆ సంభాషణ చూడాలనుకుంటే కుదరదని ఫేస్ బుక్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తుందని... డెస్క్‌టాప్‌లో వాడే మెసెంజర్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని ఫేస్బుక్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ను ప్రతి చాట్‌కు యూజర్లు మాన్యువల్‌గానే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ లాగా అన్ని చాట్లకు ఈ ఫీచర్ వర్తించదు. మెసెంజర్ యాప్‌ను ఓపెన్ చేసుకుని, సీక్రెట్ సంభాషణ ఎవరితో చేయాలనుకున్నారో వారిని యూజర్లు ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ పేరును టాప్ చేసి పట్టుకోవడంతో, రహస్య సంభాషణ ఫీచర్ వారికి యాక్టివేట్ అవుతోంది. సీక్రెట్ కన్వర్జేషన్ ఆప్షన్‌కు తర్వాత ఐకాన్‌గా టైమర్ ఉండనుంది. ఈ ఆప్షన్‌తో యూజర్లు మెసేజ్‌లు కనిపించకుండా పోవడానికి టైమ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే జీఐఎఫ్స్, వీడియోస్ లాంటి కొన్ని ప్రముఖ ఫీచర్లకు ఈ సీక్రెట్ సంభాషణ వర్తించదని ఫేస్బుక్ తెలిపింది. -
డబ్బు పంపాలా.. మెసెంజర్ ఉంటే చాలు!
మీరు ఎవరికైనా డబ్బులు పంపించాల్సి ఉండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోయినా ఇక మీదట చింత అక్కర్లేదు. ఫేస్బుక్ మెసెంజర్ చేతిలో ఉండి, ఇటు పంపేవాళ్లతో పాటు అటు అందుకునేవాళ్లకు కూడా డెబిట్ కార్డులు ఉంటే చాలు.. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేయొచ్చట. అమెరికాలో ఫేస్బుక్ మెసెంజర్ వాడేవాళ్లు ఇప్పటికే ఆ యాప్ ద్వారా డబ్బులు పంపుతున్నారని టెక్నాలజీ వెబ్సైట్ సినెట్.కామ్ తెలిపింది. ఇతర దేశాలకు కూడా త్వరలోనే దీన్ని విస్తరిస్తున్నారు. ఇదంతా పూర్తి ఉచితంగానే చేసుకోవచ్చని అంటున్నారు. ఎటూ పిన్ ఆధారంగానే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి, ఇందులో భద్రత గురించిన ఆందోళన కూడా అక్కర్లేదని ఫేస్బుక్ అంటోంది. దీని కోసం యూజర్లు ముందుగా తమ ఆండ్రాయిడ్ మెసెంజర్ యాప్‌లో ప్రొఫైల్ ఐకాన్ టచ్ చేసి, అందులో డెబిట్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి, 'యాడ్ న్యూ డెబిట్ కార్డు' మీద ట్యాప్ చేయడం ద్వారా మిగిలిన పని పూర్తి చేయొచ్చు. మొబైల్ చెల్లింపులు చేయాలంటే, పేమెంట్స్ బటన్ టాప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనేది టచ్ చేస్తే 'పే' స్క్రీన్ వస్తుంది. అక్కడ మనం చెల్లించాల్సిన మొత్తం ఎంటర్ చేసి, ఎవరికి చెల్లించాలో కూడా ఎంటర్ చస్తే.. దానికి సంబంధించిన నోట్ వస్తుంది. అక్కడ 'పే' అనే బటన్ మీద టాప్ చేస్తే చెల్లింపు అయిపోయినట్లే. అంటే సెల్‌ఫోన్ బిల్లుల లాంటివి కూడా చెల్లించుకోవచ్చన్న మాట. -
ఇంటర్నెట్ లేకున్నా ఫేస్బుక్ చూడొచ్చు!
ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకున్నా ఫేస్‌బుక్‌ను చూడొచ్చు. ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లూ పెట్టొచ్చు. ఈ మేరకు తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ ప్రకటించింది. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను అందుబాటులో ఉంచేలా చూడనున్నట్టు తెలిపింది. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో మొబైల్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ఫేస్‌బుక్‌ను చూసే యూజర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు మరింత అందుబాటులో ఉండేలా కొత్త అప్డేట్ను ప్రస్తుతం పరీక్షిస్తుంది. దీనిప్రకారం ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్లో డౌన్లోడ్ అయిన ఫేస్బుక్ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు. యూజర్ల రెలెవెన్స్ ఆధారంగా న్యూస్‌ఫీడ్‌లో ఈ స్టోరీలు కనబడతాయి. అదేవిధంగా మెరుగైన నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్‌ఫీడ్‌లోకి వచ్చేలా మెరుగులు దిద్దుతున్నది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఫేస్‌బుక్‌లోని పోస్టులపై కామెంట్లు పెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమేటిక్‌గా అప్లోడ్ అవుతాయని తెలిపింది. ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునేలా రూపొందించిన సరికొత్త న్యూస్‌ఫీడ్ ఫీచర్స్ ఫేస్బుక్ ప్రస్తుతం పరీక్షిస్తున్నది. -
100 కోట్లకు ఫేస్బుక్ మెసెంజర్ యూజర్లు
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ మెసెంజర్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య 100 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ మెసేజింగ్ ప్రాడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ వెల్లడించారు. ఫేస్బుక్, వాట్స్‌యాప్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌ల 100 కోట్ల క్లబ్లో మెసెంజర్ కూడా చేరిందని తెలిపారు. -
త్వరలో ఫేస్బుక్ మెసెంజర్ గేమ్స్
న్యూయార్క్: మనం త్వరలోనే ఫేస్బుక్ మెసెంజర్లో గేమ్స్‌ను ఆడుకోవచ్చు. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనాయి. ఫేస్బుక్ ఇదివరకే గేమ్స్‌ను డెవలప్ చేసే కంపెనీలతో మెసెంజర్ కోసం గేమ్స్ రూపొందించే చర్చలు జరిపింది. గేమ్స్ ప్రణాళికలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ మెసెంజర్లో గేమ్స్ అనే ఊహ చాలా మందిని ఆక ర్షిస్తోంది. అధిక సంఖ్యాక ప్రజలు మెసెంజర్‌ను వినియోగిస్తున్నారు. కాబట్టి మెసెంజర్లో గేమ్స్ ఆడుకునే ఫీచర్‌ను పొందుపరిస్తే అది గేమ్స్ ఆడే చాలా మందికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇద్దరు గేమ్ ప్లేయర్ల మధ్య మెసెంజర్ ఒక వారధిగా పనిచేస్తుందా? లేకపోతే ఒక రు మాత్రమే ఆడే గేమ్స్‌ను ప్రవేశపెడుతుందా? అనే అంశాన్ని ఫేస్బుక్ నిర్ణయించాల్సి ఉంది. -
చూడు తమ్ముడూ!
విషయాన్ని సుత్తి లేకుండా.. సూటిగా చెప్పడం చేతకాని వారెందరో.. వాట్సప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ దగ్గర అడ్డంగా బుక్కై పోతుంటారు. విషయ పరిజ్ఞానం ఉన్నా.. సింపుల్‌గా చెప్పడం తెలియని మేధావుల మెసేజ్‌లకు వాట్.. వాట్.. అనే రిప్లైలు వస్తుంటాయి. ఇంకొందరుంటారు.. అల్రెడీ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గా ఉన్న స్మైలీ బొమ్మలను రిప్లైగా పంపుతూ.. అదే క్రియేటివిటీ అని ఫీలైపోతుంటారు. భాషలో రాయలేని విషయాలెన్నో.. ఒక్క బొమ్మ చెప్పేస్తుంది. అలాంటి బొమ్మల కొలువుతో వచ్చేసింది.. దేఖ్ భాయ్ ఆండ్రాయిడ్ యాప్. ఇది ఆన్లైన్ ప్రపంచంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో రాజ్యమేలుతోంది. ఈ మధ్య.. వాట్సప్, ఫేస్బుక్ మెసెంజర్, ఇన్స్టాగ్రామ్.. ఇత్యాది మెసేజ్ ఓరియెంటెడ్ ఆన్లైన్లో కొత్తగా కొన్ని చిత్రాలు విచిత్ర సంభాషణలతో కిక్కెక్కిస్తున్నాయి. మాటలకందని ఎన్నో భావాలు ఒక్క హావభావంతో ఎదుటివారికి చేరిపోతాయి. ఇదే సూత్రాన్ని పాటిస్తూ రూపొందించిన దేఖ్భాయ్ యాప్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది. కళ్లుమూసుకుని, ఓ చెయ్యెత్తి ఏదో సీరియస్‌గా చూస్తున్న ఓ గుండు బొమ్మపై.. దేఖ్ భాయ్ అని రాసుంటుంది. సందర్భోచితంగా మీరేదైనా మెసేజ్ రాసుకోవచ్చు. తర్వాత దాన్ని షేర్ చేస్తే చాలు. ఇందులోని ఇన్‌బిల్ట్ మెసేజ్‌లు కూడా సరదాగా, ఫన్నీగా ఉంటాయి. హస్తీ హస్తీ.. దోస్తీ దోస్తీ.. ‘దేఖ్ భాయ్.. పైసే మాంగేతో ఫ్రెండ్షిప్ ఖతమ్’ (డబ్బులడిగావో.. దోస్తీ కట్) ఇదో రకం చిలిపి హెచ్చరిక సందేశం. దీన్ని పంపి చూడండి.. అట్నుంచి నవ్వులే రిప్లైగా వస్తాయి. బాయ్ బొమ్మ మాత్రమే కాదు.. ఓ పెద్దావిడ సీరియస్‌గా హితవు పలుకుతున్నట్టు ఉండే బొమ్మ.. కోపం, సంతోషం, హాస్యం.. ఇలా రకరకాల భావాలకు తగ్గట్టుగా ఉన్న బొమ్మలు ఇందులో ఉన్నాయి. పెద్దావిడ విషయానికి వస్తే.. ‘దేఖ్ బేటా..’ అని మొదలవుతుంది మెసేజ్. ‘దేఖ్ బేటా.. సోజా వర్నా ఫోన్ కో ఆగ్ లగాదూంగీ’ (పండుకో.. లేకపోతే ఫోన్‌కు నిప్పెట్టేస్తా..!) ఇలాంటి సరదా వార్నింగులెన్నో ఈ పెద్దావిడ బొమ్మను అడ్డం పెట్టుకుని పంపించేయొచ్చు. సెలబ్రిటీ హంగులు.. దేఖ్ భాయ్ ప్రస్థానానికి మూలం గుజరాతీ ‘జో బకా’ (చూడు మిత్రమా). ‘జో బకా’ మెసేజ్‌లు ఆన్లైన్లో ఎప్పట్నుంచో చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన దేఖ్ భాయ్ సిరీస్‌కు ఈతరం యువత రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతోంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ బొమ్మలేకాదు.. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, బాబా రాందేవ్, రాహుల్ గాంధీ, రజనీకాంత్.. ఇలా ఫేమస్ పర్సనాలిటీల చిత్ర విచిత్రమైన క్యారికేచర్లు కూడా ఈ సరదా సందేశాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బొమ్మలకు బ్యాక్ గ్రౌండ్లో కనిపించే ఎల్లో కలర్‌ను కూడా కస్టమైజ్డ్ గా మీ కిష్టమైన రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇన్‌బిల్ట్ బొమ్మలే కాదు.. కస్టమైజ్డ్గా ఫొటోలు కూడా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంది. ఏ ఎక్స్ప్రెషన్స్నైనా పలికించే బొమ్మలు ఉన్నాయి కదా అని దేఖ్ భాయ్‌ని ఎడాపెడా వాడేస్తే లాభం లేదంటారు హ్యూమరిస్టులు. ఆ భావానికి తగ్గ భాషను పలికించగలిగితేనే కిక్కు డోసు పెరుగుతుందని చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ‘దేఖ్ భాయ్.. సోచ్ మత్.. డౌన్లోడ్ కర్..!!’.