డబ్బు పంపాలా.. మెసెంజర్ ఉంటే చాలు! | Make payments via Facebook Messenger soon | Sakshi
Sakshi News home page

డబ్బు పంపాలా.. మెసెంజర్ ఉంటే చాలు!

Published Tue, Apr 12 2016 2:45 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

డబ్బు పంపాలా.. మెసెంజర్ ఉంటే చాలు! - Sakshi

డబ్బు పంపాలా.. మెసెంజర్ ఉంటే చాలు!

మీరు ఎవరికైనా డబ్బులు పంపించాల్సి ఉండి, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ అందుబాటులో లేకపోయినా ఇక మీదట చింత అక్కర్లేదు. ఫేస్‌బుక్ మెసెంజర్ చేతిలో ఉండి, ఇటు పంపేవాళ్లతో పాటు అటు అందుకునేవాళ్లకు కూడా డెబిట్ కార్డులు ఉంటే చాలు.. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చట. అమెరికాలో ఫేస్‌బుక్ మెసెంజర్ వాడేవాళ్లు ఇప్పటికే ఆ యాప్ ద్వారా డబ్బులు పంపుతున్నారని టెక్నాలజీ వెబ్‌సైట్ సినెట్.కామ్ తెలిపింది. ఇతర దేశాలకు కూడా త్వరలోనే దీన్ని విస్తరిస్తున్నారు. ఇదంతా పూర్తి ఉచితంగానే చేసుకోవచ్చని అంటున్నారు. ఎటూ పిన్ ఆధారంగానే లావాదేవీలు జరుగుతాయి కాబట్టి, ఇందులో భద్రత గురించిన ఆందోళన కూడా అక్కర్లేదని ఫేస్‌బుక్ అంటోంది.

దీని కోసం యూజర్లు ముందుగా తమ ఆండ్రాయిడ్ మెసెంజర్ యాప్‌లో ప్రొఫైల్ ఐకాన్ టచ్ చేసి, అందులో డెబిట్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత పేమెంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లి, 'యాడ్ న్యూ డెబిట్ కార్డు' మీద ట్యాప్ చేయడం ద్వారా మిగిలిన పని పూర్తి చేయొచ్చు. మొబైల్ చెల్లింపులు చేయాలంటే, పేమెంట్స్ బటన్ టాప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనేది టచ్ చేస్తే 'పే' స్క్రీన్ వస్తుంది. అక్కడ మనం చెల్లించాల్సిన మొత్తం ఎంటర్ చేసి, ఎవరికి చెల్లించాలో కూడా ఎంటర్ చస్తే.. దానికి సంబంధించిన నోట్ వస్తుంది. అక్కడ 'పే' అనే బటన్ మీద టాప్ చేస్తే చెల్లింపు అయిపోయినట్లే. అంటే సెల్‌ఫోన్ బిల్లుల లాంటివి కూడా చెల్లించుకోవచ్చన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement