ఆ విమానంలో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు
ఆ విమానంలో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు
Published Wed, Jan 11 2017 2:03 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
విమానాల్లో కూడా ప్రయాణికులకు వై-ఫై సర్వీసులు అందించేందుకు విమానయానసంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా అలస్కా విమానయాన సంస్థ, తన ప్రయాణికులు ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడే ఉచితంగా ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్లు వాడుకునేలా అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. ఉత్తర అమెరికాలో దేశీయ విమానాలు నడుపుతున్న అలస్కా ఎయిర్లైన్స్, విదేశీ మార్గాలోనూ తన సేవలందిస్తోంది. మెక్సికో, కోస్టా రికా, క్యూబా వంటి ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. ఎంపికచేసిన ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులకు ఆన్బోర్డులో యాక్సస్ అందించడం ప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉందని అలస్కా పేర్కొంది.
ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సినవసరం లేకుండా 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికులు ఫేస్బుక్ మెసేంజర్, వాట్సాప్, ఐ మెసేజ్లను వాడుకోవచ్చని తెలిపింది. జనవరి 24 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ''గోగో-వైఫై'' అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొన్ని సాధారణ స్టెపులను ఫాలో అయి కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా సంభాషణ ప్రారంభించుకోవచ్చని అలస్కా చెప్పింది. ప్రస్తుతం ఇంటర్నెట్ యాక్సస్ను విమానాల్లో అందించడం ఎయిర్లైన్ ఇండస్ట్రికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తోంది. ఎయిర్ ఫ్రాన్సస్ తాజాగా బోయింగ్ 787 విమానంలో వైఫై సేవలందించింది. కానీ వాటికి చార్జీలు వసూలు చేసింది. ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేకుండా అలస్కా ఎయిర్లైన్ ఉచిత సేవలందించేందుకు సిద్దమవుతోంది.
Advertisement