Alaska Airlines
-
గాల్లో ప్రయాణికుల ప్రాణాలు.. ‘బోయింగ్’ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూయార్క్: ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి బోయింగ్ సీఈవో పదవి నుంచి డేవ్ కాల్హౌన్ దిగిపోనున్నారు. ఆయనతో పాటు మేలో జరగనున్న వార్షిక సమావేశంలో సంస్థ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్న లారీ కెల్నర్ సైతం రాజీనామా చేయనున్నట్లు బోయింగ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్ ప్లగ్ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి 171 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం 16వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమవైపున తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నుంచి బోయింగ్‌కు చెందిన పలు విమానాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాలపై, ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో బోయింగ్ సీఈవో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రాజీనామాలు చేస్తున్నట్లు బోయింగ్ ప్రకటించడం చర్చాంశనీయంగా మారింది. -
అలాస్కా విమాన ప్రమాదం, మరో ఆశ్చర్యకరమైన విషయం
అలాస్కా ఎయిర్‌లైన్స్ ASA 1282 విమానంలో ఊహించని పరిణామంలో ప్రయాణీకులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా నమోదైంది. అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం నుండి 16వేల అడుగుల కింద పడిపోయిన ఆపిల్ ఐఫోన్ చిన్న గీత కూడా పడకుండా , చెక్కు చెదరకుండా ఉండటం విశేషంగా నిలిచింది. పోర్ట్‌లాండ్‌కు చెందిన సీనాథన్ బేట్స్ ఈ విషయాన్ని ట్విటర్లో షేర్ చేశారు. విమానం శిధిలాలను గుర్తించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న బార్న్స్ రోడ్లో నడుస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఐఫోన్‌ను కనుగొన్నానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఎన్టీఎస్బీ సమాచారం ప్రకారం ఆ ఘటనలో కనుగొన్న రెండో ఐఫోన్ అని, కానీ డోర్ మాత్రం దొరకలేదు అంటూ కమెంట్ చేశారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు దీనిపై నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. 16వేల అడుగుల ఎత్తునుంచి పడినా దానికి గీతలు పడలేదని, కవర్ , స్క్రీన్ ప్రొటెక్టర్ చెక్కుచెదరకుండా ఉన్నాయని బేట్స్ వెల్లడించారు. ఐఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉందని , దానిని కనుగొన్నప్పుడు అన్‌లాక్ చేసినట్టు వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఎన్టీఎస్బీ ఇచ్చినట్లు ట్విటర్(ఎక్స్)లో షేర్ చేశారు. దీన్ని అలాస్కా ఎయిర్‌లైన్ ప్యాసింజర్‌కు చెందినదని నిర్ధారించారు. అయితే ఇది ఏ మోడల్ ఐఫోన్ అనే వివరాలు అందుబాటులో లేవు. Found an iPhone on the side of the road... Still in airplane mode with half a battery and open to a baggage claim for #AlaskaAirlines ASA1282 Survived a 16,000 foot drop perfectly in tact! When I called it in, Zoe at @NTSB said it was the SECOND phone to be found. No door yet😅 pic.twitter.com/CObMikpuFd — Seanathan Bates (@SeanSafyre) January 7, 2024 కాగా పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోలో చెందిన అలాస్కా విమానం గాలిలో ఉండగా దాని డోర్ ఊడి ఎగిరిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సీట్లలో ఉన్న ప్రయాణికుల చేతుల్లోని మొబైల్ ఫోన్లతోపాటు, కొన్ని వస్తువులు కూడా ఆ విమానం నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చివరకు అదే ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9(1282) విమానం పోర్టులాండ్ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 🚨#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰📌#Portland | #Oregon ⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE — R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024 విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available. — Alaska Airlines (@AlaskaAir) January 6, 2024 ఇక ఈ సంఘటన అనంతరం అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్లైన్సన్ సీఈవో బెన్స్ మినికుచి పేర్కొన్నారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. -
అంతర్జాతీయ విస్తరణలో ఎయిర్ ఇండియా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం
దేశీయ దిగ్గజం 'టాటా' యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) 'అలాస్కా ఎయిర్‌లైన్స్'తో ఇంటర్లైన్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఎయిర్ ఇండియా న్యూయార్క్ JFK, నెవార్క్-న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, వాంకోవర్ గేట్‌వేల నుంచి అమెరికా, మెక్సికో, కెనడాలోని 32 గమ్యస్థానాలకు చేరుకోవడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ద్వైపాక్షిక ఇంటర్‌లైనింగ్ ద్వారా రెండు విమానయాన సంస్థలు ఒక నెట్‌వర్క్‌లో టిక్కెట్లను విక్రయించనున్నాయి. అంతే కాకుండా రెండు ఎయిర్‌లైన్స్ స్పెషల్ ప్రోరేట్ ఒప్పందాన్ని కూడా నమోదు చేసుకోవడం వల్ల అలస్కా ఎయిర్‌లైన్స్ కవర్ చేసే మార్గాలలో ఎయిర్ ఇండియాను అనుమతిస్తుందని ఎయిర్‌లైన్ ప్రతినిధి వెల్లడించారు. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ 'నిపున్ అగర్వాల్' మాట్లాడుతూ.. అలాస్కా ఎయిర్‌తో ఏర్పరచుకున్న ఒప్పందం అమెరికా, కెనడాలో విస్తృత సేవలను అందించడానికి మాత్రమే కాకుండా.. నెట్వర్క్ విస్తరణకు అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. -
విమానాన్ని ఎత్తుకెళ్లి.. చక్కర్లు.. ఆపై క్రాష్!
వాషింగ్టన్ : విమానాయాన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉన్నట్టుండి విమానాన్ని ఎత్తుకెళ్లి షికార్లు కొట్టాడు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉన్న విమానాన్ని ఝామ్మని గగనతలంలోకి తోలుకెళ్లిన అతను.. ఆపై కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. శుక్రవారం సాయంత్రం అమెరికాలోని వాషింగ్టన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒక్కసారిగా గాలిలోకి ఎగరడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇది ఉగ్రవాదుల చర్య అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వెంటనే జెట్ విమానాలతో ఆ విమానాన్ని వెంబడించారు. తీరా ఇది ఉగ్రవాద చర్య కాకపోవడంతో ఊపిరి తీసుకున్నారు. అలాస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ మోకానిక్ ఈ చర్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఈ సమయంలో విమానంలో అతను తప్ప ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. విమనాన్ని కొంతదూరం తీసుకెళ్లగలిగిన మోకానిక్ ఆ తరువాత కంట్రోల్ చేయలేకపోవడంతో వాషింగ్టన్ ప్రాంతంలో క్రాష్ చేశాడని పోలీసుల అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు. క్రాష్ అయిన విమానం 76 సీట్ల సామర్థ్యం గల విమానం అని, ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు. విమానం క్రాష్ కావడంతో అతని గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ విమానం గాలిలో చక్కర్లు కొడుతూ.. క్రాష్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆ విమానంలో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు
విమానాల్లో కూడా ప్రయాణికులకు వై-ఫై సర్వీసులు అందించేందుకు విమానయానసంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా అలస్కా విమానయాన సంస్థ, తన ప్రయాణికులు ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్నప్పుడే ఉచితంగా ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్‌లు వాడుకునేలా అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. ఉత్తర అమెరికాలో దేశీయ విమానాలు నడుపుతున్న అలస్కా ఎయిర్‌లైన్స్, విదేశీ మార్గాలోనూ తన సేవలందిస్తోంది. మెక్సికో, కోస్టా రికా, క్యూబా వంటి ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. ఎంపికచేసిన ఇన్స్టాంట్ మెసేజింగ్ సర్వీసులకు ఆన్‌బోర్డులో యాక్సస్ అందించడం ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉందని అలస్కా పేర్కొంది. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సినవసరం లేకుండా 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికులు ఫేస్బుక్ మెసేంజర్, వాట్సాప్, ఐ మెసేజ్‌లను వాడుకోవచ్చని తెలిపింది. జనవరి 24 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ''గోగో-వైఫై'' అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొన్ని సాధారణ స్టెపులను ఫాలో అయి కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సంభాషణ ప్రారంభించుకోవచ్చని అలస్కా చెప్పింది. ప్రస్తుతం ఇంటర్నెట్ యాక్సస్‌ను విమానాల్లో అందించడం ఎయిర్‌లైన్ ఇండస్ట్రికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తోంది. ఎయిర్ ఫ్రాన్సస్ తాజాగా బోయింగ్ 787 విమానంలో వైఫై సేవలందించింది. కానీ వాటికి చార్జీలు వసూలు చేసింది. ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేకుండా అలస్కా ఎయిర్‌లైన్ ఉచిత సేవలందించేందుకు సిద్దమవుతోంది. -
'ఓయ్ సెక్సీ' అంటూ పిలిచాడని..!
కాలిఫోర్నియా బేస్డ్ ఫ్లైట్ లో అలస్కా ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బందితో ఓ ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో అతడిని విమానం నుంచి దింపివేశారు. భద్రత కోసం మహిళా ఉద్యోగిని సూచనలు, సలహాలు ఇస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఓయ్ సెక్సీ.. అంటూ అసభ్యపదజాలంలో మహిళా సిబ్బందిని సంబోధించాడు. అక్టోబర్ 9న జరిగిన ఘటనపై అలస్కా ఎయిర్ లైన్స్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. సీటెల్ నుంచి బర్బాంక్ కు డిపార్టర్ అవడానికి రెడీగా ఉన్న ఫ్లైట్-520 నుంచి ఆ ప్యాసింజర్ ను కిందకి దింపివేసినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఇతర సిబ్బంది ప్రవర్తన మార్చుకుంటే మంచిదని ఆ ప్రయాణికుడిని హెచ్చరించారు. సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఓ ప్యాసింజర్ అంబర్ నిల్సన్.. ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇద్దరు మహిళా ప్యాసింజర్ల మధ్యలో ఆ ప్రయాణికుడి సీట్ ఉంది. అతడి చేష్టలతో ఇద్దరు మహిళలు కూడా ఎంతో అసౌకర్యానికి లోనయ్యారు. దాంతో పాటుగా ఫ్లైట్ మహిళా ఉగ్యోగినిని అసభ్య పదజాలంతో సంబోధించగా ఆమె అతడి వద్దకు వచ్చి కాస్త మర్యాదగా మాట్లాడాలని సూచించింది. 'నేను నీతో జస్ట్ ఫన్ చేశాను. నిన్ను ఓ ఆట ఆడుకుంటాను' అని ఆమెతో మరోసారి చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికొచ్చిన ఓ ఉద్యోగి ఆ ప్యాసింజర్ ను విమానం నుంచి దిగాలని చెప్పాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పురాకపోగా.. తానేం తప్పు చేయలేదని, ఎలాంటి ఉల్లంఘన చర్యలకు పాల్పడలేదని వాదించాడు. చివరికి తన ప్రవర్తనకు మూల్యం చెల్లించుకుంటూ విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. సిబ్బందికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు.